'రాజా ది గ్రేట్' దర్శకుడి ఆవేదన | Director Anil ravipudi on Raja the great piracy | Sakshi
Sakshi News home page

'రాజా ది గ్రేట్' దర్శకుడి ఆవేదన

Oct 22 2017 10:37 AM | Updated on Oct 22 2017 10:38 AM

Raja the Great Piracy

తెలుగు, తమిళ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను వేదిస్తున్న ప్రధాన సమస్య పైరసీ. ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా.. రిలీజ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సినిమా రిలీజ్ అయిన రెండో రోజే పైరసీ వెబ్ సైట్లలో సినిమాల లింకులు దర్శనమిస్తున్నాయి. ఇటీవల రిలీజ్ అయిన రవితేజ సినిమా రాజా ది గ్రేట్ కు కూడా పైరసీ బారిన పడింది. ఈ విషయంపై దర్శకుడు అనిల్ రావిపూడి తన సోషల్ మీడియా పేజ్ ద్వారా స్పందించారు.

ఓ అభిమాని ట్విట్టర్ లో షేర్ చేసిన ఫొటోను అనిల్ రీ ట్వీట్ చేశారు. శ్రీనివాస్ కుమార్ అనే వ్యక్తి ' ఎయిర్ పోర్ట్ లాంజ్ లో మేడమ్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మరి చూస్తున్నారు రాజా ది గ్రేట్ సినిమా. చాలా బాధగా ఉంది. సినిమాలను బతికించండి, కిల్ పైరసీ' అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ను రీ ట్వీట్ చేసిన దర్శకుడు 'ఫేస్ బుక్ లో చాలా మంది ఈ సినిమాను షేర్ చేస్తున్నారు. దయచేసి పైరసీని ప్రొత్సహించకండి. థియేటర్లలోనే సినిమాను చూడండి' అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement