
సాక్షి, హైదరాబాద్ : ‘మాస్ మహారాజా’ రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. శ్రీవెంకటేశ్వర పతాకంపై ‘దిల్’రాజు నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. మెహరీన్ కౌర్ హీరోయిన్. దీపావళి కానుకగా అక్టోబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రవితేజ తన కెరీర్‌లో మొదటిసారి అంధుడి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ప్రేక్షకుల ముఖచిత్రాలేమిటో..!’ అనే డైలాగ్ ట్రైలర్‌లో హైలెట్‌గా నిలిచింది. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. సుమారు రెండు సంవత్సరాల సాంగ్ గ్యాప్ తరువాత రవితేజ నటిస్తున్న ‘రాజా ది గ్రేట్’ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment