
నాని హీరోయిన్ యమా బిజీ..!
నాని హీరోగా తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మెహరీన్. తొలి సినిమాలోనే అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది మెహరీన్. అయితే కృష్ణగాడి వీర ప్రేమగాథ తరువాత వెంటనే బిజీ హీరోయిన్ అవుతుందని భావించినా.. పెద్దగా అవకాశాలు రాలేద. దీంతో బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన మెహరీన్ ఫిలౌరీ సినిమాతో ఆకట్టుకుంది.
బాలీవుడ్ సినిమా చేస్తుండగానే టాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్తో జవాన్, రవితేజతో రాజా ది గ్రేట్, శర్వానంద్, మారుతిల సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ, సందీప్ కిషన్ సరసన నటిస్తున్న సినిమాతో కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. వీటితో పాటు మరికొన్ని సినిమాలు ఇప్పుడు చర్చల దశలో ఉన్నాయి.