రెండేళ్ల విరామం తరువాత వెండితెర మీద కనిపించిన మాస్ మహరాజ్ రవితేజ సూపర్ హిట్ తో అలరించాడు. రాజా ది గ్రేట్ సినిమాలో అంధుడిగా నటించిన రవితేజ గ్రాండ్ విక్టరీతో అభిమానులను ఖుషీ చేశాడు. అదే జోరులో మరిన్ని సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే టచ్ చేసి చూడు సెట్స్ మీద ఉండగా మరో రెండు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు ఈ మాస్ హీరో.
శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా ఉంటుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ సినిమా జనవరిలో ప్రారంభం కానుంది. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను లాంటి చిత్రాలు ఘనవిజయం ఆసాధించిన నేపథ్యంలో కొత్త సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాతో పాటు తమిళ సూపర్ హిట్ భోగన్ రీమేక్ కూడా అదే సమయంలో ప్రారంభ కానుందట. ఈ రెండు సినిమాల్లో ఒకేసారి నటించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు రవితేజ.
Comments
Please login to add a commentAdd a comment