
'దర్శకుడి కోసం ఫ్రీగా చేశా'
టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటిస్తూ స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న బ్యూటీ రాశీఖన్నా. త్వరలో ఎన్టీఆర్ సరసన నటించిన జై లవ కుశ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న రాశీ.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. సాధారణంగా ఫాంలో ఉన్న హీరోయిన్లు ఎంత చిన్న క్యారెక్టర్లో నటించినా.. ఓపెనింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నా భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారు.
అలాంటి రాశీ ఓ స్పెషల్ సాంగ్ ను ఫ్రీగా చేసిందట. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న రాజా ది గ్రేట్ సినిమాలో రాశీ ఖన్నా స్పెషల్ సాంగ్ లో నటించింది. అయితే ఆ చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడితో ఉన్న స్నేహం కారణంగా ఆ పాటలో ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించిందట రాశీ. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే నెలలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.