
లాంగ్ గ్యాప్ తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా రాజా ది గ్రేట్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. రవితేజ మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన రాజా ది గ్రేట్ ఘన విజయం సాధించటంతో చిత్రయూనిట్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ వారం గరుడవేగ, నెక్ట్స్‌నువ్వే, ఏంజెల్ లాంటి ఇంట్రస్టింగ్ సినిమాలు రిలీజ్‌అవుతుండటంతో కలెక్షన్లు పడిపోకుండా కాపాడుకునేందుకు చిత్రయూనిట్ కొత్త ప్లాన్ వేశారు.
ఈ శనివారం నుంచి ఎడిటింగ్ లో తీసేసిన మూడు కామెడీ సన్నివేశాలను యాడ్ చేయబోతున్నారు. ఇప్పటికే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఇకపై మరింత వినోదాన్నిపంచనుంది. మరి ఈ కొత్త ప్లాన్ రాజా దిగ్రేట్ థియేటర్లకు రిపీట్ ఆడియన్స్‌ను తీసుకువస్తుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment