రాజా ది గ్రేట్ లో రాశీ స్పెషల్ సాంగ్
చెన్నై: రవితేజ హీరోగా రానున్న ‘రాజా ది గ్రేట్’ సినిమాలో నటి రాశీఖన్నా ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంలోని ప్రత్యేక పాటలో కొద్దిసేపు మాత్రమే కనిపిస్తానని, ఆ పాత్ర స్పెషల్‌గా ఉంటుందని రాశీఖన్నా ట్వీట్ చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి కోరిక మేరకు రాశీ ఈ పాత్ర చేస్తోందని టాక్.
రాజా ది గ్రేట్ లో మాస్ రాజా అంధుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాతోనే ఆయన కుమారుడు మహాధన్ తెరంగేట్రం చేయనున్నాడు. రెండేళ్ల తర్వాత వస్తున్నరవితేజ సినిమాలో మెహ్రీన్ పిర్జాదా, ప్రకాష్‌రాజ్, రాధికా శరత్‌కుమార్ లు నటించనున్నారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.