
సాక్షి, సూర్యాపేట : అభిమానం హద్దు మీరింది. టికెట్లు అమ్మి ప్రత్యేక షో వేయలేదని ఆగ్రహించిన అభిమానులు బుధవారం ఓ సినిమా థియేటర్‌పై దాడి చేసి ఆందోళనకు దిగారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. కాగా హీరో రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ చిత్రం బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. స్థానికంగా ఉన్న తేజ థియేటర్ యాజమాన్యం నిన్న రాత్రి బెనిఫిట్ షో పేరిట టికెట్లు విక్రయించింది. అయితే సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ చర్యకు పాల్పడ్డారు. కాగా దాదాపు రెండేళ్ల విరామం అనంతరం రవితేజ రాజా ది గ్రేట్ చిత్రంతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రావిపూడి అనిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment