fans attack theatre
-
విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అరాచకం
సాక్షి, విశాఖపట్నం: నగరంలో పవన్ కల్యాణ్ అభిమానులు అరాచకం సృష్టించారు. బ్రో ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో తమ నాయకుడిలానే ఊగిపోతూ రచ్చరచ్చ చేశారు. జగదాంబ థియేటర్లో అద్దాలు పగుల గొట్టి బీభత్సం సృష్టించారు. గతంలో కూడా అనేక కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా, గత నెలలో తొలిప్రేమ సినిమా ప్రదర్శించిన థియేటర్‌ను ధ్వంసం చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గాంధీనగర్‌లో ఉన్న కపర్థి థియేటర్లో ప్రదర్శించారు. సెకండ్ షో రాత్రి 10.30 గంటలకు మొదలవగా, 10.45కి కొంతమంది అభిమానులు స్క్రీన్ వద్దకు చేరి డ్యాన్సులు చేశారు. స్క్రీన్‌ను చింపేందుకు ప్రయత్నించగా, థియేటర్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పవన్ అభిమానులు రెచ్చిపోయి సిబ్బందిపై దాడి చేశారు. స్క్రీన్‌ను చించివేశారు. కుర్చీలు, తలుపులు విరగ్గొట్టారు. అద్దాలను పగులగొట్టారు. సినిమాకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు థియేటర్లో విధ్వంసం సృష్టించి రూ.4 లక్షలు ఆస్తి నష్టం కలిగించారు. చదవండి: ‘పవన్.. ఈ తరహా చర్యల వల్ల మీ టీచర్లు కూడా సిగ్గు పడతారు’ -
‘పుష్ప’ థియేటర్ ఎదుట ఫ్యాన్స్ ఆందోళన, రాళ్లతో దాడి
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన పుష్ప సినిమా థియేటర్స్‌లో దుమ్మురేపుతుంది. ఈ రోజు(డిసెంబర్ 17) పుష్ప ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పాటలు అన్ని భాషల్లో సూపర్‌హిట్ కావడం, బన్నీ- సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. విడుదలైన అన్ని ప్రాంతాల్లో పుష్ప పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో పుష్ప బెనిఫిట్ సో వేయలేదంటూ బన్నీ ఫ్యాన్స్ థియేటర్‌పై దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. చదవండి: Radhe Shyam Movie: రాధేశ్యామ్ మూవీ సీక్రెట్ చెప్పేసిన డైరెక్టర్ ఒకప్పుడు మూవీ రిలీజ్ డేకు ముందు రోజు రాత్రి బెనిఫిట్ షో వేసేవారు. ఇప్పడు చాలా చోట్ల ఈ షోని రద్దు చేశారు. కానీ తెలంగాణలోని పలు థియేటర్లో బెనిఫిట్ షోకు అనుమతి ఉండటంతో ఈ షోను వేశారు. ఇక ఏపీలో కూడా ఇటీవల బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ జీవో పాస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు పుష్ప రిలీజ్ సందర్భంగా ఏపీలో బెనిఫిట్ షోలు వేస్తారని ఫ్యాన్స్ అంతా ఆశించారు. కానీ వారికి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో అనంతపురం జిల్లా హిందూపురం బాలాజీ థియేటర్లో బెనిఫిట్ షో వేస్తామని చెప్పి ఆ థియేటర్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసింది. చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుతం నో ఆఫర్స్, అయినా తగ్గని క్రేజ్.. తీరా బెనిఫిట్ షో వేయకుండ ఫ్యాన్స్‌కు మొండిచేయి చూపించింది. దీంతో డబ్బులు తీసుకొని బెనిఫిట్ షో వేయలేదంటూ అభిమానులంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన అభిమానులు థియేటర్‌పై రాళ్లు విసరి అద్దాలు పగలగొట్టారు. అంతేగాక థియేటర్ ముందు ధర్నాకు దిగి రచ్చ చేశారు. ఇక థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి, థియేటర్‌ను క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
హీరో విజయ్ ఫ్యాన్స్ అరెస్ట్
అభిమానం హద్దు మీరింది. బిగిల్ చిత్రం విడుదల సందర్భంగా విజయ్ అభిమానులు విధ్వంసానికి దిగారు. ముందుగా సినిమా ప్రదర్శించలేదని థియేటర్లోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. సీసీ టీవీలను పగులకొట్టారు. దీంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: విజయ్ హీరోగా నటించిన బిగిల్ చిత్రం విడుదల విధ్వంసానికి, లాఠీ చార్జ్‌కి దారితీసింది. విజయ్ అభిమానుల ఆగ్రహానికి అంగళ్లతోపాటూ పోలీసు వాహనం కూడా అగ్నికి ఆహుతైంది. నలుగురు పోలీసులు గాయపడగా, పలువురు అభిమానులు కటకటాల పాలయ్యారు. తమిళ సినీ పరిశ్రమలో రజనీకాంత్ తరువాత అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్లుగా ప్రచారంలో ఉన్న హీరో విజయ్. ఆయన సినిమా అంటే అభిమానులకు పండుగే. శుక్రవారం విజయ్ చిత్రం విడుదల కావడంతో అభిమానుల్లో ఆనందం కట్టలుతెంచుకుంది. దర్శకుడు అట్లీ, విజయ్, నయనతార కాంబినేషన్ కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ చిత్రం ప్రత్యేక ప్రదర్శన కోసం అభిమానులు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు. అయితే గురువారం రాత్రి ప్రభుత్వం అకస్మాత్తుగా తొలిరోజు మాత్రం ప్రత్యేక ప్రదర్శనకు అనుమతి ఇవ్వడంతో ఒకింత శాంతించారు. శుక్రవారం తెల్లవారుజామున రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ప్రత్యేక షో ప్రదర్శితమైంది. కృష్ణగిరిలో రెండు థియేటర్లలో బిగిల్ ప్రదర్శనకు సిద్ధంకాగా, అభిమానుల కోసం శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని యాజమాన్యం ప్రకటించింది. దీంతో గురువారం అర్ధరాత్రి నుంచే పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకోవడం ప్రారంభించారు. క్రమేణా ఈ సంఖ్య మరింత పెరిగిపోవడంతో తోపులాట, తొక్కిసలాట మొదలైంది. వెంటనే షో వేయాలని అభిమానులు కేకలు వేశారు. అయితే 3 గంటల తరువాత మాత్రమే ప్రత్యేక ప్రదర్శన వేయాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయని యాజమాన్యం వారికి తెలిపింది. దీంతో అసహనానికి లోనైన అభిమానులు విధ్వంస చర్యలు ప్రారంభించారు. థియేటర్లోకి జొరబడి కుర్చీలను ధ్వంసం చేశారు. రోడ్డు పక్కన ఉన్న అంగళ్లను, ప్రకటన బోర్డులను తగులబెట్టారు. థియేటర్‌కు అమర్చి ఉన్న సీసీటీవీ కెమెరాలను పగులగొట్టారు. అప్పటికే గస్తీ విధుల్లో ఉన్న పోలీసులు అభిమానులను చెదరగొట్టడం ప్రారంభించగా గందరగోళం నెలకొంది. పోలీసులపై అభిమానులు దాడికి దిగారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. అభిమానుల దాడులు అదుపు తప్పడంతో పోలీసులు కంట్రోలు రూముకు ఫోన్ చేయడంతో ప్రత్యేక పోలీసు దళం రంగప్రవేశం చేసి లాఠీచార్జ్‌కి దిగారు. ఈ గొడవల్లో నలుగురు పోలీసులకు, కొందరు అభిమానులకు గాయాలయ్యాయి. పోలీసుల అదుపులో 37 మంది.. ఆస్తులను ధ్వంసం చేసిన వారిలో 37 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణగిరిలోని రెండు థియేటర్ల ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి శుక్రవారం తెల్లవారుజాము 5 గంటలకు అభిమానుల కోసం ప్రత్యేక షో వేశారు. ఇదిలా ఉండగా, శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వందలాది థియేటర్లలో యధావిధిగా విడులైంది. విజయ్ ఫ్లెక్సీలకు అభిమానులు పాలాభిషేకం చేశారు. నకిలీ టోకెన్లు.. ప్రత్యేక షో చూసేందుకు నకిలీ టోకెన్లతో వచ్చిన ముగ్గురు అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూత్తుకూడిలో రెండు థియేటర్లలో బిగిల్ విడుదలైంది. విజయ్ అభిమానుల కోసం ప్రత్యేక ప్రదర్శన కోసం ఏర్పాట్లు జరిగాయి. ఇందుకోసం నగదు మొత్తాన్ని యాజమాన్యానికి చెల్లించారు. ఆ తరువాత తొలి ప్రదర్శనకు టిక్కెట్ల పంపిణీకై టోకన్లను పంపిణీ చేశారు. అయితే కొందరు అభిమాలను చేతుల్లోని టోకన్లపై అభిమాన సంఘం నేతలకు అనుమానం రావడంతో తనిఖీ చేయగా అవి నకిలీ టోకన్లని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో రాజన్ (28), మోహన్‌బాబు (26), ఆనంద్ (30)లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నకిలీ టోకన్లను ముద్రించిన తిరునెల్వేలీకి చెందిన ఒక వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా కోర్టులు, కేసులు, ఆరోపణలు, వ్యతిరేకతలను అధిగమించి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన బిగిల్ చిత్రం తెలుగులో ‘విజిల్’ గా విడుదలైంది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. మరోవైపు సినిమా పాజిటిల్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ మాస్ పాత్రలో ఇరగదీశాడంటూ, సెకండ్ హాఫ్‌లో సెంటిమెంట్ ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను కనెక్ట్ అయ్యాడంటూ అభిమానులు ట్విట్ చేస్తున్నారు. -
ఫ్యాన్స్ ఆగ్రహం, థియేటర్ ఫర్నిచర్ ధ్వంసం
సాక్షి, సూర్యాపేట : అభిమానం హద్దు మీరింది. టికెట్లు అమ్మి ప్రత్యేక షో వేయలేదని ఆగ్రహించిన అభిమానులు బుధవారం ఓ సినిమా థియేటర్‌పై దాడి చేసి ఆందోళనకు దిగారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. కాగా హీరో రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ చిత్రం బుధవారం విడుదలైన విషయం తెలిసిందే. స్థానికంగా ఉన్న తేజ థియేటర్ యాజమాన్యం నిన్న రాత్రి బెనిఫిట్ షో పేరిట టికెట్లు విక్రయించింది. అయితే సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ చర్యకు పాల్పడ్డారు. కాగా దాదాపు రెండేళ్ల విరామం అనంతరం రవితేజ రాజా ది గ్రేట్ చిత్రంతో ప్రేక్షకుల ముందకు వచ్చాడు. దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రావిపూడి అనిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించాడు. -
థియేటర్‌పై ‘ఖైదీ’ అభిమానుల దాడి
-
థియేటర్‌పై ‘ఖైదీ’ అభిమానుల దాడి
గుంటూరు : మెగా ఫ్యాన్స్ అభిమానం హద్దు మీరింది. తమ అభిమాన హీరో సినిమా ప్రదర్శన ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్‌పై దాడికి దిగారు. ఈ ఘటన గుంటూరు జిల్లా కొల్లూరులో చోటుచేసుకుంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం బెనిఫిట్ షో వేస్తామని శ్రీనివాస థియేటర్ యాజమాన్యం తెలిపింది. అయితే బుధవారం తెల్లవారుజాము వరకూ బెనిఫిట్ షో వేయకపోవడంతో అభిమానులు రెచ్చిపోయారు. థియేటర్లోని కుర్చీలతో పాటు స్క్రీన్‌ను ధ్వంసం చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీఛార్జ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఖైదీ నెంబర్ 150 చిత్రం ఇవాళ (బుధవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే.