Pushpa Movie: Fans Attacked On Balaji Theatre In Anantapur Over Benefit Show Issue - Sakshi
Sakshi News home page

Pushpa Movie: ‘పుష్ప’ థియేటర్‌ ఎదుట ఫ్యాన్స్‌ ఆందోళన, రాళ్లతో దాడి

Published Fri, Dec 17 2021 6:51 PM | Last Updated on Mon, Dec 20 2021 11:31 AM

Fans Attacked On Balaji Theatre In Anantapur Over Benefit Show Issue - Sakshi

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన పుష్ప సినిమా థియేటర్స్‌లో దుమ్మురేపుతుంది. ఈ రోజు(డిసెంబర్‌ 17) పుష్ప ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పాటలు అన్ని భాషల్లో సూపర్‌హిట్‌ కావడం, బన్నీ- సుకుమార్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌ కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. విడుదలైన అన్ని ప్రాంతాల్లో పుష్ప పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో పుష్ప బెనిఫిట్‌ సో వేయలేదంటూ బన్నీ ఫ్యాన్స్‌ థియేటర్‌పై దాడి చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

చదవండి: Radhe Shyam Movie: రాధేశ్యామ్‌ మూవీ సీక్రెట్‌ చెప్పేసిన డైరెక్టర్‌

ఒకప్పుడు మూవీ రిలీజ్‌ డేకు ముందు రోజు రాత్రి బెనిఫిట్‌ షో వేసేవారు. ఇప్పడు చాలా చోట్ల ఈ షోని రద్దు చేశారు. కానీ తెలంగాణలోని పలు థియేటర్లో బెనిఫిట్‌ షోకు అనుమతి ఉండటంతో ఈ షోను వేశారు. ఇక ఏపీలో కూడా ఇటీవల బెనిఫిట్‌ షోలు రద్దు చేస్తూ జీవో పాస్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు పుష్ప రిలీజ్‌ సందర్భంగా ఏపీలో బెనిఫిట్‌ షోలు వేస్తారని ఫ్యాన్స్‌ అంతా ఆశించారు. కానీ వారికి నిరాశే  ఎదురైంది. ఈ క్రమంలో అనంతపురం జిల్లా హిందూపురం బాలాజీ థియేటర్‌లో బెనిఫిట్‌ షో వేస్తామని చెప్పి ఆ థియేటర్‌ యాజమాన్యం డబ్బులు వసూలు చేసింది. 

చదవండి: ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌, ప్రస్తుతం నో ఆఫర్స్‌, అయినా తగ్గని క్రేజ్‌..

తీరా బెనిఫిట్‌ షో వేయకుండ ఫ్యాన్స్‌కు మొండిచేయి చూపించింది. దీంతో డబ్బులు తీసుకొని బెనిఫిట్ షో వేయలేదంటూ అభిమానులంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన అభిమానులు థియేటర్‌పై రాళ్లు విసరి అద్దాలు పగలగొట్టారు. అంతేగాక థియేటర్ ముందు ధర్నాకు దిగి రచ్చ చేశారు. ఇక థియేటర్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి, థియేటర్‌ను క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement