దుమ్మురేపుతున్న కలెక్షన్లు | Mersal film gets massive Opening | Sakshi
Sakshi News home page

దుమ్మురేపుతున్న ‘మెర్శల్’ కలెక్షన్లు

Published Thu, Oct 19 2017 2:28 PM | Last Updated on Thu, Oct 19 2017 6:17 PM

Mersal film gets massive Opening

సాక్షి, చెన్నై: ‘ఇళయదళపతి’ విజయ్ నటించిన తమిళ సినిమా ‘మెర్శల్‌’  బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. అక్టోబర్‌ 18న విడుదలైన ఈ సినిమా భారీగా ఓపెనింగ్‌ కలెక్షన్లు రాబట్టింది. తొలిరోజు 31.3 కోట్ల వసూళ్లు సాధించినట్టు ట్రేడ్‌ వర్గాల సమాచారం. వివాదాలను దాటుకుని భారత్‌లో 2500 స్క్రీన్లపై విడుదలైన ఈ సినిమా అటు విదేశాల్లోనూ భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఒక్క చెన్నైలోనే తొలిరోజు రూ.1.52 కోట్లు సాధించినట్టు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో రూ. 18-19 కోట్ల బిజినెస్‌ చేసినట్టు తెలిపాయి.

అమెరికా, ఆస్ట్రేలియా, మలేసియా, యూకేలోనూ విడుదలైన ఈ సినిమా ఊహించిన దానికంటే ఎక్కువగా కలెక్షన్లు సాధిస్తోంది. అమెరికాలో 129 ప్రాంతాల్లో విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ. 2.25 కోట్లు వసూలు చేసినట్టు ప్రముఖ ట్రేడ్‌ ఎనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. మలేసియాలో రూ.90.31 లక్షలు, యూకేలో 81.08 లక్షలు, ఆస్ట్రేలియాలో రూ.68.01 లక్షలు రాబట్టినట్టు తెలిపారు. శ్రీతేనాండాళ్‌ ఫిలింస్‌ నిర్మించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌.రెహ్మాన్ సంగీత బాణీలను అందించారు. సమంత, కాజల్‌ అగర్వాల్, నిత్యామీనన్ నాయికలుగా నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement