మెర్శల్‌ చిత్రం మాదిరిగానే.. | Suseenthiran's next title changed to 'Nenjil Thunivirunthal' | Sakshi
Sakshi News home page

మెర్శల్‌ అంశాలతో..

Published Wed, Nov 8 2017 7:05 AM | Last Updated on Wed, Nov 8 2017 7:05 AM

Suseenthiran's next title changed to 'Nenjil Thunivirunthal' - Sakshi

తమిళసినిమా: విజయ్‌ నటించిన మెర్శల్‌ చిత్రం ఎంతగా వివాదాలకు దారి తీసిందో తెలిసిందే. అలాంటి అంశాలు తమ చిత్రంలోనూ ఉంటాయంటున్నారు దర్శకుడు సుశీద్రన్‌. ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం నెంజిల్‌తుణివిరిందాల్‌. సందీప్‌ కిషన్, నటి మెహరిన్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో నటుడు విక్రాంత్‌ ప్రధాన పాత్రను పోషించారు. డి.ఇమాన్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 10వ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుశీద్రన్‌ మాట్లాడుతూ తన గత చిత్రాల తరహాలోనే నెంజిల్‌ తుణివిరిందాల్‌ చిత్రంలోనూ సోషల్‌ మేసేజ్‌ ఉంటుందన్నారు. ఇది విజయ్‌ నటించిన మెర్శల్‌ చిత్రం మాదిరిగానే చర్చనీయాంశం బలమై సామాజిక అంశాలతో సంచలన కలిగిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ముఖ్యంగా ఇందులో నటుడు విక్రాంత్‌ నటన గురించి అందరూ చెప్పుకుంటారన్నారు.

ఆయనకు ఈ చిత్రం తరువాత మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. తన లైబ్రరీలో వెన్నెలా కబడ్డీకుళ్లు, అళగర్‌సామియిన్‌ కుదిరై, జీవా, మావీరన్‌ కిట్టు లాంటి చిత్రాలంటే తనకు చాలా ఇష్టం అన్నారు. ఎక్కువగా చిన్న హీరోలతోనే చిత్రాలు చేస్తున్నారేమిటని చాలా మంది అడుగుతున్నారని, నిజం చెప్పాలంటే స్టార్‌ హీరోలతో చేస్తే ఆ చిత్ర విజయాలు వారికే చేరుతాయన్నారు. అదే కొత్త వారితో చిత్రం చేస్తే ఆ విజయాలు దర్శకుడికి చెందుతాయని పేర్కొన్నారు. నెంజిల్‌ తుణివిరిందాల్‌ చిత్ర విజయంపై తనతో పాటు యూనిట్‌ అందరికీ నమ్మకం ఉందని సుశీద్రన్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement