టాలీవుడ్‌ లో కోలీవుడ్‌ హిట్ డైరెక్టర్‌ | Kollywood Star Atlee To Direct Telugu Star Hero | Sakshi
Sakshi News home page

Published Tue, Apr 3 2018 10:21 AM | Last Updated on Tue, Apr 3 2018 10:21 AM

Kollywood Star Atlee To Direct Telugu Star Hero - Sakshi

తమిళ దర్శకుడు అట్లీ

రాజా రాణీ, తేరి, మెర్సల్‌ సినిమాలతో వరుస విజయాలు సాధించిన కోలీవుడ్‌ యంగ్ డైరెక్టర్‌ అట్లీ. వరుసగా రెండు సినిమాలు స్టార్‌ హీరో విజయ్‌తో కలిసి చేసిన అట్లీ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఈ యువ దర్శకుడు తెరకెక్కించిన తేరి.. పోలీస్‌ పేరుతో మెర్సల్‌ అదిరింది పేరుతో తెలుగులో రిలీజ్‌ అయినా ఆశించిన స్థాయిలో విజయం సాదించలేకపోయాయి. దీంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకునేందుకు తెలుగు హీరోతో సినిమా చేయాలని భావిస్తున్నారు అట్లీ.

త్వరలో ఓ తెలుగు సినియా చేయబోతున్నట్టుగా అట్లీ స్వయంగా ప్రకటించారు. తెలుగులోనూ ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించాడు అట్లీ. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement