బాక్సాఫీస్ వద్ద లియో జోరు.. నెగెటివ్ టాక్‌ వచ్చినా తగ్గేదేలే! | Leo Box Office Collection Day 3: Thalapathy Vijay-Starrer Grosses Rs 200 Crore Worldwide - Sakshi
Sakshi News home page

Leo Movie Collections: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న లియో.. మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్!!

Published Sun, Oct 22 2023 6:03 PM | Last Updated on Mon, Oct 23 2023 1:39 PM

Vijay Starrer Leo Movie Crossed 200 Crores In Just Three Days - Sakshi

తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం లియో. లోకేశ్ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది. ఈనెల 19 ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. 

మొదటిరోజే రూ. 64 కోట్ల వసూళ్లు రాబట్టిన లియో.. దాదాపు మూడో రోజు అదే జోరును కొనసాగించింది. శనివారం దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.40 కోట్లు వసూలు రాబట్టింది. దీంతో మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. సినిమా రిలీజ్ రోజు నెగెటివ్ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. రెండో రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన లియో.. మూడో రోజే రెండొందల కోట్ల మార్కును దాటేసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

అయితే తమిళ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను ఆదరించలేదు. మొత్తంగా తమిళనాడులో మూడు రోజుల్లో కలిపి రూ.56.9 కోట్లు రాబట్టింది. తొలి రోజు రూ.27.63 కోట్లు, రెండో రోజు రూ.15.95 కోట్లు, మూడో రోజు రూ.13.32 కోట్లు వసూలు మాత్రమే రాబట్టింది. అయితే విడుదలకు ముందే ఈ చిత్రం రిలీజ్‌పై వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడం.. తెలుగులోనూ రిలీజ్‌పై స్టేలు ఇవ్వడం కలెక్షన్లపై కాస్తా ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement