బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'సరైనోడు' | 'Sarrainodu' mints Rs.22 crore on release day | Sakshi
Sakshi News home page

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'సరైనోడు'

Published Sun, Apr 24 2016 12:51 PM | Last Updated on Sun, Sep 3 2017 10:39 PM

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'సరైనోడు'

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న 'సరైనోడు'

చెన్నై: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం 'సరైనోడు' బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. సినిమాపై మిశ్రమ స్పందన వ్యక్తమైనప్పటికీ రిలీజ్ రోజున భారీ కలెక్షన్లు కొల్లగొట్టాడు. రిలీజ్ రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 22 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ ఎనలిస్ట్ త్రినాథ్ వెల్లడించారు. విమర్శకులకు ఈ సినిమా నచ్చనప్పటికీ ప్రేక్షకులు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఆయన విశ్లేషించారు. వీకెండ్ లో ఎంత వసూలు చేస్తుందనే దానిపై కలెక్షన్లు ఆధారపడివుంటారని చెప్పారు. విదేశాల్లో 'సరైనోడు' కాసుల వర్షం కురిపిస్తున్నాడని చెప్పారు. ఉత్తర అమెరికాలో ఇప్పటికే కలెక్షన్లు 5 లక్షల డాలర్లు మించాయి.

గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్, కేథరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement