అల్లు అర్జున్‌ కెరీర్‌లో దుమ్ము లేపిన టాప్‌ 5 చిత్రాలు.. | Allu Arjun: Top 5 Highest Grossing Films | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ కెరీర్‌లో భారీ కలెక్షన్లు సాధించిన చిత్రాలు..

Published Wed, Apr 7 2021 7:57 PM | Last Updated on Wed, Apr 7 2021 8:44 PM

Allu Arjun: Top 5 Highest Grossing Films - Sakshi

అల్లు అర్జున్‌... ఆయన అభిమానులకు ఈ పేరొక పవిత్ర మంత్రం. బన్నీ సినిమా రిలీజైందంటే చాలు తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లిపోయేలా సందడి చేస్తుంటారీ ఫ్యాన్స్‌. అలాంటిది రేపు ఆయన బర్త్‌డే అంటే వీళ్ల హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే పలు చోట్ల పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి ర్యాలీలు తీస్తూ స్వీట్లు పంచుతూ, డ్యాన్సులు చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు.

వీళ్లు ఇంతగా అభిమానిస్తున్న ఆ హీరో కూడా మామూలోడు కాదు. ఏ సినిమా జనాలకు నచ్చుతుందో, ఎలాంటి కథలైతే ప్రేక్షకులకు బోర్‌ కొట్టవో, ఏవి తీస్తే అభిమానులు ఎగిరి గంతులేస్తారో అచ్చంగా అలాంటి సినిమాలే ఎంచుకుంటాడు. అవలీలగా హిట్లు సాధిస్తాడు. తొలి సినిమా 'గంగోత్రి'లో అమాయక చక్రవర్తిగా కనిపించిన అల్లు అర్జున్‌ 'దేశముదురు'లో సన్యాసిని సైతం ప్రేమలో పడేసే తెలివైనోడిగా కనిపించి అదుర్స్‌ అనిపించుకున్నాడు.

తండ్రిని ఆరాధించే కొడుకుగా, ప్రేయసి కోసం పాట్లు పడే ప్రేమికుడిగా, అన్న కోసం ఎవరినైనా ఎదిరించే తమ్ముడిలా, ఆశయం కోసం అన్నీ వదులుకునే యువకుడిగా.. ఇలా అన్నిరకాల పాత్రల్లోనూ ఒదిగిపోయాడాయన. డైలాగ్‌ డెలివరీతో, డ్యాన్స్‌ స్టెప్పులతో, కొత్త లుక్స్‌తో ఎప్పటికప్పుడు నయా ట్రెండ్‌ను సృష్టించే ఈ హీరో కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించి బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచిన చిత్రాలేంటో చూసేద్దాం..

సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన అల వైకుంఠపురములో
అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అల వైకుంఠపురములో. ఫ్యామిలీ డ్రామా, కామెడీ పార్ట్‌ మెండుగా ఉన్న ఈ చిత్రం జనాలకు బాగా కనెక్ట్‌ అయింది. దీనికి తోడు థమన్‌ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. గతేడాది సంక్రాంతికి బరిలో దిగిన ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది.

వంద కోట్లు దాటేసిన సరైనోడు
బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా 2016లో ప్రేక్షకుడి ముందుకు వచ్చింది. రకుల్‌ ప్రీత్‌సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి రూ.127 కోట్లు వచ్చాయి.

బాక్సాఫీస్‌ను దున్నేసిన దువ్వాడ జగన్నాథం
అల్లు అర్జున్‌ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. ఒక పాత్రలో బన్నీ పూజారిగా కనిపిస్తే, మరో పాత్రలోఅండర్‌కవర్‌ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఇందులో కిషోర్‌ కామెడీ, పూజా హెగ్డేతో బన్నీ కెమిస్ట్రీ అదిరిపోయింది. దేవి శ్రీప్రసాద్‌ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు హైప్‌ తీసుకొచ్చింది. 2017లో వచ్చిన దువ్వాడ జగన్నాథం సుమారు రూ.115 కోట్ల వసూళ్లు కురిపించింది.

శభాష్‌ అనిపించుకున్న సన్నాఫ్‌ సత్యమూర్తి
విలువలే నా ఆస్తి అంటూ తండ్రి సిద్ధాంతాన్ని నమ్ముతాడు బన్నీ. ఇందులో అన్నీ ఉన్న శ్రీమంతుడి స్థాయి నుంచి ప్రతీది కోల్పోయిన నిరుద్యోగి మారతాడు బన్నీ. విలువల కోసం అన్నింటినీ వదులుకునే వ్యక్తిగా బన్నీ నటన అద్భుతంగా ఉంటుంది. త్రివిక్రమ్‌ చేసిన మ్యాజిక్‌, సమంత క్యారెక్టరైజేషన్‌, ఉపేంద్ర, స్నేహ, నిత్యామీనన్‌లు కనిపించే సీన్లు ప్రేక్షకుడిని వినోదాన్ని పంచుతాయి. ఈ చిత్రం సెంచరీకి అడుగు దూరంలో ఆగిపోయి రూ.90 కోట్ల కలెక్షన్లు సాధించింది.

బాక్సాఫీస్‌ దగ్గర పరుగులు పెట్టిన రేసుగుర్రం
2014లో ఈ సినిమాలో బన్నీ నటన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. బన్నీ రౌడీతో తలపడే సన్నివేశాలు, అన్నతో ఫైట్‌ చేసే తీరు, స్పందనగా శృతి హాసన్‌ నటన, బ్రహ్మానందం కామెడీ టైమింగ్‌ ప్రేక్షకుడికి డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించాయి. సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రూ.60 కోట్లు వచ్చాయి.

చదవండి: రష్మిక ఫస్ట్‌లుక్‌ ఎక్కడంటూ ఫ్యాన్స్‌ ఫైర్‌‌‌

కోహ్లిని ఎత్తిపడేసిన అనుష్క.. వీడియో వైరల్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement