duvvada jagannadham movie
-
అల్లు అర్జున్ కెరీర్లో దుమ్ము లేపిన టాప్ 5 చిత్రాలు..
అల్లు అర్జున్... ఆయన అభిమానులకు ఈ పేరొక పవిత్ర మంత్రం. బన్నీ సినిమా రిలీజైందంటే చాలు తెలుగు రాష్ట్రాలు దద్దరిల్లిపోయేలా సందడి చేస్తుంటారీ ఫ్యాన్స్. అలాంటిది రేపు ఆయన బర్త్‌డే అంటే వీళ్ల హంగామా ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే పలు చోట్ల పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి ర్యాలీలు తీస్తూ స్వీట్లు పంచుతూ, డ్యాన్సులు చేస్తూ తెగ హడావిడి చేస్తున్నారు. వీళ్లు ఇంతగా అభిమానిస్తున్న ఆ హీరో కూడా మామూలోడు కాదు. ఏ సినిమా జనాలకు నచ్చుతుందో, ఎలాంటి కథలైతే ప్రేక్షకులకు బోర్ కొట్టవో, ఏవి తీస్తే అభిమానులు ఎగిరి గంతులేస్తారో అచ్చంగా అలాంటి సినిమాలే ఎంచుకుంటాడు. అవలీలగా హిట్లు సాధిస్తాడు. తొలి సినిమా 'గంగోత్రి'లో అమాయక చక్రవర్తిగా కనిపించిన అల్లు అర్జున్ 'దేశముదురు'లో సన్యాసిని సైతం ప్రేమలో పడేసే తెలివైనోడిగా కనిపించి అదుర్స్ అనిపించుకున్నాడు. తండ్రిని ఆరాధించే కొడుకుగా, ప్రేయసి కోసం పాట్లు పడే ప్రేమికుడిగా, అన్న కోసం ఎవరినైనా ఎదిరించే తమ్ముడిలా, ఆశయం కోసం అన్నీ వదులుకునే యువకుడిగా.. ఇలా అన్నిరకాల పాత్రల్లోనూ ఒదిగిపోయాడాయన. డైలాగ్ డెలివరీతో, డ్యాన్స్ స్టెప్పులతో, కొత్త లుక్స్‌తో ఎప్పటికప్పుడు నయా ట్రెండ్‌ను సృష్టించే ఈ హీరో కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్స్‌గా నిలిచిన చిత్రాలేంటో చూసేద్దాం.. సెన్సేషన్ క్రియేట్ చేసిన అల వైకుంఠపురములో అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అల వైకుంఠపురములో. ఫ్యామిలీ డ్రామా, కామెడీ పార్ట్ మెండుగా ఉన్న ఈ చిత్రం జనాలకు బాగా కనెక్ట్ అయింది. దీనికి తోడు థమన్ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసింది. గతేడాది సంక్రాంతికి బరిలో దిగిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వంద కోట్లు దాటేసిన సరైనోడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా 2016లో ప్రేక్షకుడి ముందుకు వచ్చింది. రకుల్ ప్రీత్‌సింగ్, కేథరిన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి రూ.127 కోట్లు వచ్చాయి. బాక్సాఫీస్‌ను దున్నేసిన దువ్వాడ జగన్నాథం అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. ఒక పాత్రలో బన్నీ పూజారిగా కనిపిస్తే, మరో పాత్రలోఅండర్కవర్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఇందులో కిషోర్ కామెడీ, పూజా హెగ్డేతో బన్నీ కెమిస్ట్రీ అదిరిపోయింది. దేవి శ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు హైప్ తీసుకొచ్చింది. 2017లో వచ్చిన దువ్వాడ జగన్నాథం సుమారు రూ.115 కోట్ల వసూళ్లు కురిపించింది. శభాష్ అనిపించుకున్న సన్నాఫ్ సత్యమూర్తి విలువలే నా ఆస్తి అంటూ తండ్రి సిద్ధాంతాన్ని నమ్ముతాడు బన్నీ. ఇందులో అన్నీ ఉన్న శ్రీమంతుడి స్థాయి నుంచి ప్రతీది కోల్పోయిన నిరుద్యోగి మారతాడు బన్నీ. విలువల కోసం అన్నింటినీ వదులుకునే వ్యక్తిగా బన్నీ నటన అద్భుతంగా ఉంటుంది. త్రివిక్రమ్ చేసిన మ్యాజిక్, సమంత క్యారెక్టరైజేషన్, ఉపేంద్ర, స్నేహ, నిత్యామీనన్‌లు కనిపించే సీన్లు ప్రేక్షకుడిని వినోదాన్ని పంచుతాయి. ఈ చిత్రం సెంచరీకి అడుగు దూరంలో ఆగిపోయి రూ.90 కోట్ల కలెక్షన్లు సాధించింది. బాక్సాఫీస్ దగ్గర పరుగులు పెట్టిన రేసుగుర్రం 2014లో ఈ సినిమాలో బన్నీ నటన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. బన్నీ రౌడీతో తలపడే సన్నివేశాలు, అన్నతో ఫైట్ చేసే తీరు, స్పందనగా శృతి హాసన్ నటన, బ్రహ్మానందం కామెడీ టైమింగ్ ప్రేక్షకుడికి డబుల్ ఎంటర్టైన్మెంట్ అందించాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రూ.60 కోట్లు వచ్చాయి. చదవండి: రష్మిక ఫస్ట్‌లుక్ ఎక్కడంటూ ఫ్యాన్స్ ఫైర్ కోహ్లిని ఎత్తిపడేసిన అనుష్క.. వీడియో వైరల్! -
తేనెపట్టులా నీ పలుకే..
‘ముకుంద’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘మహర్షి’... సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న పూజా హెగ్డే అంతరంగాలు... రీచార్జ్ ‘ఫలనా వ్యక్తిలా నేనెందుకు ఉండకూడదు!’ అని ఎప్పుడూ ఆలోచించలేదు.‘నేను నాలాగే ఉండాలి’ అనేది నా విధానం. అలా ఉంటేనే సౌకర్యంగా ఉంటాను. ప్రజలతో కలిసిపోవడం, ప్రయాణాలు చేయడం, పుస్తకాలు చదవడం ద్వారా నన్ను నేను రీచార్జ్ చేసుకుంటాను. పరకాయప్రవేశం కొన్నిసార్లు అదృష్టవశాత్తు మన స్వభావానికి అద్దం పట్టే పాత్రలు వస్తాయి. అప్పుడు అవలీలగా చేసేయవచ్చు. కొన్నిసార్లు మాత్రం మన స్వభావానికి విరుద్ధమైన పాత్రలు వస్తాయి. అది ఒకరకంగా సవాలే! ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో ఔట్‌గోయింగ్, మోడర్న్ కారెక్టర్ చేశాను. నిజానికి నిజ జీవితంలో నేను రిజర్వ్డ్గా ఉంటాను. సిగ్గరిని కూడా. అయినప్పటికీ ‘డిజే’లో ఆ క్యారెక్టర్లోకి పరకాయప్రవేశం చేశాను. ఇక్కడ ఒక విషయం పంచుకోవాలి... నేను మోడర్న్ కాకపోవచ్చుగానీ... నా ఆలోచనలు మాత్రం మోడర్న్‌గానే ఉంటాయి. కొత్త కొత్తగా... షూటింగ్‌లేని సమయాల్లో ఖాళీగా కూర్చోవడం కంటే కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. మా బ్రదర్ నుంచి గిటార్ ప్లే చేయడం నేర్చుకుంటున్నాను. పాటలు కూడా పాడుతాను. అయితే ఇంకా ప్రావీణ్యం రావాలి.‘‘ఒకేసారి అన్ని పాటలు పాడాలనుకోకు, ఒక పాట పర్ఫెక్ట్గా నేర్చుకున్న తరువాతే రెండో పాట గురించి ఆలోచించు’’ అని బ్రదర్ సలహా ఇచ్చాడు. ప్రస్తుతానికి మాత్రం ‘పాపా కెòహెతే’ పాట బాగా పాడగలను. ఈ సంగతి ఎలా ఉన్నా... పాటల మీద ఉన్న ఇష్టం వల్ల సంగీతకారులపై ప్రత్యేక గౌరవం పెరిగింది. అదృష్టం విధిరాతను నమ్ముతాను. ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉండాలి అనేది ముందే డిజైనై ఉంటుందని నా నమ్మకం. టీనేజ్‌లో బక్కపలచగా ఉండేదాన్ని. నేను సినిమాల్లో నటిస్తానని ఎవరూ అనుకోలేదు. సినిమా ఫీల్డ్‌లోకి వెళ్లాలని నేనూ ఎప్పుడూ అనుకోలేదు. ఇది మాత్రమే కాదు ‘భవిష్యత్‌లో ఇది చేయాలి’ అని ఎప్పుడూ అనుకోలేదు. విధివశాత్తు సినిమా ప్రొఫెషన్లోకి వచ్చాను. ఇది అదృష్టంగా భావిస్తున్నాను. ‘మా అమ్మాయి కాబట్టి ఎలా చేసినా ప్రశంసించాలి’ అనే దృష్టితో కాకుండా మా పేరెంట్స్ కరెక్ట్ ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. దీవివల్ల తప్పులు ఏమైనా ఉంటే సరిచేసుకుంటాను. -
‘దువ్వాడ జగన్నాథమ్’కు మరో షాక్
హైదరాబాద్: అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథమ్ (డీజే) సినిమాలోని శృంగార గీతాల్లో యజుర్వేదంలో ఉన్న నమకం, చమకం వంటి పవిత్ర పదాలను ఉపయోగించారని, వీటిని తొలగించేంత వరకు ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శించకుండా నిషేధం విధించాలంటూ ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని రంగారెడ్డి జిల్లాకు చెందిన గోగులపాటి కృష్ణమోహన్ దాఖలు చేశారు. ఇందులో ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారి, వెంకటేశ్వర క్రియేషన్స్, డీజీపీ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. డీజే సినిమాలోని శృంగార గీతాల్లో పలు అభ్యంతరకర పదాలు ఉన్నాయని పిటిషనర్ తెలిపారు. అంతేకాక యజుర్వేదంలోని నమకం, చమకం వంటి పవిత్ర పథనాలను కూడా ఉపయోగించారన్నారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ సెన్సార్ బోర్డు అధికారులకు వినతిపత్రం సమర్పించినా, దానిని పరిగణనలోకి తీసుకోలేదని వివరించారు. ఈ పదాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినా ప్రయోజనం లేకపోయిందన్నారు. అందువల్లే మరో ప్రత్యామ్నాయం లేక హైకోర్టును ఆశ్రయించామని వివరించారు. నమకం, చమకం వంటి పదాలను శృంగార గీతాల్లో నుంచి తొలగించేంత వరకు థియేటర్లలో డీజే ప్రదర్శనపై నిషేధం విధించేలా ఆదేశాలు జారీ చేయాలని కృష్ణమోహన్ కోర్టును కోరారు. ఇంతకుముందు బ్రాహ్మణ సంఘాలు ఆందోళన చేయడంతో పాటలోని అభ్యంతరకర పదాలను తొలగిస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది.