Viral Video: Man Uses Pushpa Srivalli Song Step To Calm Down Crying Baby - Sakshi
Sakshi News home page

Pushpa Hook Step: 'శ్రీవల్లీ' పాటకు చిన్నారి ఫిదా.. ఆకట్టుకుంటున్న వీడియో

Published Sat, Jan 22 2022 7:30 PM | Last Updated on Sat, Jan 22 2022 7:59 PM

Viral Video: Man Uses Pushpa Srivalli Song Step To Calm Down Crying Baby - Sakshi

Viral Video: Man Uses Pushpa Srivalli Song Step To Calm Down Crying Baby: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది సహా నార్త్‌లోనూ అల్లు అర్జున్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలోని పాటలు, డైలాగులు సోషల్‌ మీడియాను ఓ రేంజ్‌లో ఊపేస్తున్నాయి. ఇక పుష్ప చిత్రంలోని 'శ్రీవల్లీ' సాంగ్‌ అన్ని భాషల్లోనూ సూపర్‌ హిట్టయ్యింది.

ముఖ్యంగా అల్లు అర్జున్‌ చేసిన సిగ్నేచర్‌ స్టెప్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. తాజాగా షాదాబ్‌ అలీ ఖాన్‌ అనే ఓ నెటిజన్‌ సైతం శ్రీవల్లీ సాంగ్‌ హుక్‌ స్టెప్పులేస్తూ ఏడుస్తున్న పాపాయిని జో కొట్టాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను షేర్‌ చేస్తూ.. పాపను హ్యాపీ చేయడానికి  శ్రీవల్లి స్టెప్‌ పర్‌ఫెక్ట్‌ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఇక ఒరిజినల్‌ శ్రీవల్లీ సాంగ్‌ యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. ఇప్పటికే ఈ సాంగ్‌ 80మిలియన్‌ వ్యూస్‌తో  దూసుకుపోతుంది. తెలుగులో సిద్‌ శ్రీరామ్‌ ఈ పాటను పాడగా, హిందీ వెర్షన్‌లో జావేద్‌ అలీ పాడారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement