Sri Valli
-
బుడ్డోడిని సైతం ఆకట్టుకున్న ‘శ్రీవల్లి’, బన్నీని ఎలా ఫాలో అయ్యాడో చూడండి..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది సహా నార్త్‌లోనూ అల్లు అర్జున్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలోని పాటలు, డైలాగులు సోషల్ మీడియాను ఓ రేంజ్లో ఊపేస్తున్నాయి. ఇక పుష్ప చిత్రంలోని 'శ్రీవల్లీ' సాంగ్ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్టయ్యింది. ముఖ్యంగా అల్లు అర్జున్ చేసిన సిగ్నేచర్ స్టెప్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చదవండి: సుందరం మాస్టర్‌పై నటి సుధ సంచలన వ్యాఖ్యలు, సెట్లో అందరి ముందే.. ఈ పాట వినిపిస్తే చాలు బన్నీ సిగ్నేచర్ స్టెప్‌ను అనుసరించకుండ ఉండలేకపోతున్నారు నెటిజన్లు. చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు బన్నీ స్టేప్కు కాలు కదుపుతున్నారు. తాజాగా ఓ ఏడాది బుడ్డోడు శ్రీవల్లి పాటలోని అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టేప్కు కాలు కదిపాడు. టీవీలో శ్రీవల్లి పాట వస్తుండగా.. అందులో బన్నీని చూసి ఈ బుడ్డోడు భుజం పైకెత్తి చూట్టు తిరగడం స్టార్ట్ చేశాడు. ఈ ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో బుడ్డోడిని చూసి అంతా ఫిదా అవుతూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. -
'శ్రీవల్లీ' స్టెప్.. ఏడుపు మానేసిన చిన్నారి, వీడియో వైరల్
Viral Video: Man Uses Pushpa Srivalli Song Step To Calm Down Crying Baby: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది సహా నార్త్‌లోనూ అల్లు అర్జున్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలోని పాటలు, డైలాగులు సోషల్ మీడియాను ఓ రేంజ్లో ఊపేస్తున్నాయి. ఇక పుష్ప చిత్రంలోని 'శ్రీవల్లీ' సాంగ్ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్టయ్యింది. ముఖ్యంగా అల్లు అర్జున్ చేసిన సిగ్నేచర్ స్టెప్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తాజాగా షాదాబ్ అలీ ఖాన్ అనే ఓ నెటిజన్ సైతం శ్రీవల్లీ సాంగ్ హుక్ స్టెప్పులేస్తూ ఏడుస్తున్న పాపాయిని జో కొట్టాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ.. పాపను హ్యాపీ చేయడానికి శ్రీవల్లి స్టెప్ పర్ఫెక్ట్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇక ఒరిజినల్ శ్రీవల్లీ సాంగ్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. ఇప్పటికే ఈ సాంగ్ 80మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. తెలుగులో సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడగా, హిందీ వెర్షన్లో జావేద్ అలీ పాడారు. View this post on Instagram A post shared by Sʜᴀᴅᴀʙ Aʟɪ Kʜᴀɴ 🖤 (@beingshadabkhan.27) -
శ్రీవల్లి రష్మిక, సాత్విక ముందంజ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్ క్వాలిఫయింగ్ రౌండ్లో తెలంగాణ క్రీడాకారులు భమిడిపాటి శ్రీవల్లి రష్మిక, సామ సాత్విక ముందంజ వేశా రు. పోర్చుగల్‌లోని పల్మెలా వేదికగా సోమవారం జరిగిన క్వాలిఫయింగ్ తొలి రౌండ్ పోటీల్లో వీరిద్దరూ గెలుపొందారు. శ్రీవల్లి రష్మిక 4–6, 6–3, 13–10తో కింబర్లీ పుకుసా (బ్రిటన్)పై గెలుపొందగా... ఎనిమిదో సీడ్ సాత్విక 6–3, 6–1తో బెట్రిజ్ పసిలెట్టి డ్యూర్టె కోస్టా (పోర్చుగల్)ను ఓడించింది. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో అనా ఫిలిపా సాంటోస్ (పోర్చుగల్)తో సాత్విక, మూడో సీడ్ వాలెంటినా ఇవనోవ్ (న్యూజిలాండ్)తో శ్రీవల్లి రష్మిక ఆడతారు. -
సెమీస్‌లో శ్రీవల్లి, రుషీల్ ఖోస్లా
సాక్షి, హైదరాబాద్: ఆసియా ర్యాంకింగ్ అండర్–14 టెన్నిస్ టోర్నమెంట్లో మేడిశెట్టి శ్రీవల్లి వర్మ, రుషీల్ ఖోస్లా ముందంజ వేశారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ సెమీస్‌కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన అండర్–14 బాలికల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో శ్రీవల్లి వర్మ 6–3, 6–2తో సౌమ్రితపై విజయం సాధించింది. బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ రుషీల్ ఖోస్లా 6–3, 6–2తో ఐదో సీడ్ వినీత్ ముత్యాలను ఓడించాడు. ఇతర బాలుర క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో వెంకట్ రిషి (అమెరికా) 6–3, 6–2తో వత్సల్ మణికంఠన్‌పై, ఏడో సీడ్ ప్రజ్వల్ తివారీ 6–2, 7–6 (7/5)తో దేవహర్షిత్ నీలమ్ (అమెరికా)పై, ఎనిమిదో సీడ్ రితిన్ ప్రణవ్ సెంథిల్ కుమార్ 6–3, 6–1తో అదిత్ అమర్నాథ్పై గెలుపొంది సెమీస్‌లో అడుగు పెట్టారు. మరోవైపు బాలికల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఎనిమిదో సీడ్ సౌమ్య 6–4, 6–1తో ఆమోదిని నాయక్‌పై, ఆరోసీడ్ సుహిత 6–1, 6–0తో ఐకరాజుపై గెలుపొందగా... కుందనశ్రీ 6–0, 6–1తో రెండోసీడ్ చహనకు షాకిచ్చి సెమీస్‌కు చేరుకుంది. -
సైంటిఫిక్ థ్రిల్లర్
‘బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్’ వంటి అద్భుతమైన చిత్రాలకు కథ అందించి, ‘రాజన్న’ మూవీతో డైరెక్టర్‌గా తన సత్తా చాటిన విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్రీవల్లీ’. రజత్, మాజీ మిస్ ఇండియా నేహా హింగే జంటగా రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నిర్మాత మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన సైంటిఫిక్ ఎరోటిక్ థ్రిల్లర్ ఇది. ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్లో ఆసక్తి, ఉత్కంఠ రేకెత్తిస్తాయి. టీజర్, ట్రైలర్, ఆడియోకి మంచి స్పందన వస్తోంది. ట్రైలర్ బాగుందని పలువురు ప్రముఖులు ఫోన్ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సునీత రాజ్‌కుమార్. -
నాన్నతో దెబ్బలాడే క్షణం కోసం ఎదురు చూస్తున్నా!
– దర్శకుడు రాజమౌళి ‘‘తాతగారు సంపాదించిన ఆస్తులన్నీ పోయిన తర్వాత పెదనాన్నగారు (శివశక్తి దత్తా), నాన్నగారు (విజయేంద్రప్రసాద్) ఘోస్ట్ రైటర్స్‌గా డబ్బులు సంపాదించేవారు. రైటర్స్‌గా వారి పేర్లు ఎప్పుడు తెరపై పడతాయా? అని ఎదురు చూసేవాణ్ణి. చాలా సంవత్సరాల తర్వాత ‘జానకిరాముడు’ సినిమాకు వారి పేర్లు తెరపై పడ్డప్పుడు నాకు గర్వంగా అనిపించింది’’ అని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు. రజత్, నేహా హింగే జంటగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో సునీత, రాజ్‌కుమార్ బృందావనం నిర్మించిన చిత్రం ‘శ్రీవల్లీ’. ఎం.ఎం. శ్రీలేఖ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని రాజమౌళి విడుదల చేసి, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి ఇచ్చారు. రాజమౌళి మాట్లాడుతూ– ‘‘రెండు వారాల గ్యాప్‌లో ‘బాహుబలి’, ‘భజరంగీ భాయ్‌జాన్’ వంటి హిట్స్ ఇచ్చిన రచయితగా నాన్నగారికి పేరు వచ్చినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. రైటర్‌గా నాన్న ఎంత గొప్పవారో తెలుసు. డైరెక్టర్‌గా సినిమాను అంత గొప్పగా తీసినప్పుడు కొడుకుగా గర్వపడతా. నా సినిమాల్లో నాన్న తప్పలు వెతుకుతుంటారు. ‘శ్రీవల్లీ’ విషయంలో కొడుకుగా గర్వపడ్డా, డైరెక్టర్‌గా నాన్నతో దెబ్బలాడే క్షణం కోసం ఎదురు చూస్తున్నా’’ అన్నారు. ‘‘మా చిత్రంలో స్టార్ట్స్, డ్యాన్సులు, ఫైట్స్ లేకున్నా మంచి కథ, గ్రాఫిక్స్ ఉన్నాయి. ఏ వ్యక్తీ పుట్టుకతో చెడ్డవాడు కాదు. పరిస్థితుల ప్రభావంతో మారతాడు. దానికి కారణం మనసే. ఆ మనసును మనం చూడగలిగితే మనలోని ఎన్నో సిండ్రోమ్స్, ఫోబియోలను దూరం చేయవచ్చు. మానవాళిని గొప్పగా మార్చవచ్చు అనే నేపథ్యంలో ఉంటుందీ చిత్రం. ఓ మంచి సినిమా చూశామనే తృప్తి ప్రేక్షకులకు కలుగుతుంది’’ అన్నారు విజయేంద్ర ప్రసాద్. దర్శకుడు కొరటాల శివ, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, శివశక్తి దత్తా, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు. -
ఫైనల్లో శ్రీవల్లి -రష్మిక జోడి
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ అండర్-18 టెన్నిస్ టోర్నమెంట్లో శ్రీవల్లి రష్మిక జోడి ఫైనల్‌కు చేరుకుంది. మారిషస్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో గురువారం జరిగిన మహిళల డ బుల్స్ సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక (భారత్)-కేటీ లాఫ్రాన్స్ (అమెరికా) జోడి 4-6, 7-5, 10-8తో స్నేహల్ మణె (భారత్)-వెరొనికా (పొలాండ్) జంటపై విజయం సాధించింది. టాప్‌సీడ్ జోడి చేతిలో తొలి సెట్ కోల్పోయిన రష్మిక జోడి తర్వాతి రెండు సెట్లలో విజయం సాధించింది. -
సత్తాచాటిన శ్రీవల్లి
ఆసియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆసియా ర్యాంకింగ్ అండర్-14 టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు శ్రీవల్లి రష్మిక, సాయి దేదీప్య దూసుకెళ్తున్నారు. పుణేలో జరుగుతున్న ఈ టోర్నీలో వీళ్లిద్దరూ బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్ సాయి దేదీప్య 6-1, 6-2తో తేజస్విపై గెలుపొందగా, శ్రీవల్లి 6-1, 6-2తో రెండో సీడ్ రుతూజ జాదవ్‌కు షాకిచ్చింది. డబుల్స్‌లో శ్రీవల్లి-పాన్యభల్లా జోడి 6-3, 6-3తో తేజస్వి- అనన్య త్రోట్ ద్వయంపై, సాయి దేదీప్య-ఈశ్వరి జంట 6-0, 6-0తో యర్లగడ ఖుషి-పాయల్ నగరే జోడిపై గెలుపొందాయి. ఇతర ఫలితాలు: బాలికల సింగిల్స్: అమినేని శివాని (ఏపీ) 6-2, 6-1తో పరాడేపై, విపాశ మెహ్రా 7-5, 6-4తో నషీద్ ఖాన్‌పై, ఈశ్వరి మాత్రే 6-2, 6-2తో అనన్య త్రోట్పై, ఆద్యా చల్లా 6-2, 6-2తో సనా ఖాన్‌పై గెలిచారు. బాలుర సింగిల్స్: హిమాన్షు మోర్ 6-1, 6-3తో నామ హిమన్పై, నీల్ గరుద్ 6-1, 6-1తో విక్రాంత్ మెహతాపై, అమన్ పటేల్ 7-5, 7-5తో గుంజన్ జాదవ్‌పై విజయం సాధించారు.