ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది సహా నార్త్‌లోనూ అల్లు అర్జున్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలోని పాటలు, డైలాగులు సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో ఊపేస్తున్నాయి. ఇక పుష్ప చిత్రంలోని 'శ్రీవల్లీ' సాంగ్ అన్ని భాషల్లోనూ సూపర్ హిట్టయ్యింది. ముఖ్యంగా అల్లు అర్జున్ చేసిన సిగ్నేచర్ స్టెప్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
చదవండి: సుందరం మాస్టర్‌పై నటి సుధ సంచలన వ్యాఖ్యలు, సెట్‌లో అందరి ముందే..
ఈ పాట వినిపిస్తే చాలు బన్నీ సిగ్నేచర్ స్టెప్‌ను అనుసరించకుండ ఉండలేకపోతున్నారు నెటిజన్లు. చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు బన్నీ స్టేప్‌కు కాలు కదుపుతున్నారు. తాజాగా ఓ ఏడాది బుడ్డోడు శ్రీవల్లి పాటలోని అల్లు అర్జున్ సిగ్నేచర్ స్టేప్‌కు కాలు కదిపాడు. టీవీలో శ్రీవల్లి పాట వస్తుండగా.. అందులో బన్నీని చూసి ఈ బుడ్డోడు భుజం పైకెత్తి చూట్టు తిరగడం స్టార్ట్ చేశాడు. ఈ ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో బుడ్డోడిని చూసి అంతా ఫిదా అవుతూ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment