సత్తాచాటిన శ్రీవల్లి | srivalli sucessful Asian ranking tennis tournment | Sakshi
Sakshi News home page

సత్తాచాటిన శ్రీవల్లి

Published Thu, Apr 17 2014 12:57 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

srivalli  sucessful Asian ranking tennis tournment

ఆసియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ
 సాక్షి, హైదరాబాద్: ఆసియా ర్యాంకింగ్ అండర్-14 టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు శ్రీవల్లి రష్మిక, సాయి దేదీప్య దూసుకెళ్తున్నారు. పుణేలో జరుగుతున్న ఈ టోర్నీలో వీళ్లిద్దరూ బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్ సాయి దేదీప్య 6-1, 6-2తో తేజస్విపై గెలుపొందగా, శ్రీవల్లి 6-1, 6-2తో రెండో సీడ్ రుతూజ జాదవ్‌కు షాకిచ్చింది. డబుల్స్‌లో శ్రీవల్లి-పాన్యభల్లా జోడి 6-3, 6-3తో తేజస్వి- అనన్య త్రోట్ ద్వయంపై, సాయి దేదీప్య-ఈశ్వరి జంట 6-0, 6-0తో యర్లగడ ఖుషి-పాయల్ నగరే జోడిపై గెలుపొందాయి.
 
 ఇతర ఫలితాలు: బాలికల సింగిల్స్: అమినేని శివాని (ఏపీ) 6-2, 6-1తో పరాడేపై, విపాశ మెహ్రా 7-5, 6-4తో నషీద్ ఖాన్‌పై, ఈశ్వరి మాత్రే 6-2, 6-2తో అనన్య త్రోట్‌పై, ఆద్యా చల్లా 6-2, 6-2తో సనా ఖాన్‌పై గెలిచారు. బాలుర సింగిల్స్: హిమాన్షు మోర్ 6-1, 6-3తో నామ హిమన్‌పై, నీల్ గరుద్ 6-1, 6-1తో విక్రాంత్ మెహతాపై, అమన్ పటేల్ 7-5, 7-5తో గుంజన్ జాదవ్‌పై విజయం సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement