
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అల్లు అర్జున్‌పై తన అభిమానాన్ని చాటుకుంది. ఇటీవల పలు భాషల్లో విడుదలైన కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న కేజీఎఫ్-2 మూవీపై బన్నీ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన రవీనా ‘‘ థ్యాంక్యూ. అల్లు అర్జున్.. నేను మీకు పెద్ద ఫ్యాన్‌ను..పుష్ప సినిమాలో నచ్చారు. మరిన్ని బ్లాక్ బస్టర్స్ రావాలి’’ అంటూ విష్ చేశారు. దీంతో ఇప్పటికే పుష్ప మూవీ ప్రభంజనాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్ మరింత మురిసిపోతున్నారు.
కేజీఎఫ్-2 ఘన విజయంపై స్పందించిన బన్నీ కేజీఎఫ్-2 టీమ్ మొత్తానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్యంగా ఈ మూవీ హీరో యశ్, బాలీవుడ్ నటుడు, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి తదితర నటీనటులను ప్రసంశించారు. అంతేకాదు అద్భుతం అంటూ మ్యూజిక్ డైరెక్టర్ రవితోపాటు, ఇతర టెక్నీషియన్స్ అందర్నీ అభినందిస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అలాగే అద్భుతమైన సినిమాను అందించారు అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపారు బన్నీ.
కాగా ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేజీఎఫ్ చాప్టర్-2 రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్న తొలి కన్నడ చిత్రంగా ఘనతను చాటుకుటున్న సంగతి తెలిసిందే.
Thank you @alluarjun 😊😊🙏🏻🙏🏻💛 am a huge fan ! Loved you in #pushpa and many more to come! https://t.co/1zqpc4puVD
— Raveena Tandon (@TandonRaveena) April 22, 2022