
Janhvi Kapoor Praises Allu Arjun For Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్‌లో వచ్చిన క్రేజీ హ్యాట‍్రిక్ చిత్రం 'పుష్ప: ది రైజ్'. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో మించి హిందీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. ఇటీవల ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 7న దక్షిణాది భాషల్లో విడుదలైంది పుష్ప చిత్రం. కానీ హిందీలో ఇంకా విడుదల కాలేదు. త్వరలో జనవరి 14న సంక్రాంతి కానుకగా హిందీలో కూడా రిలీజ్ చేయనుంది అమెజాన్. ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో 'పుష్ప' ఫైర్ గట్టిగానే అంటుకుంది. స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లతోపాటు హీరోయిన్లు కూడా పుష్ప రాజ్‌కు ఫిదా అవుతున్నారు.
ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనపై రీసెంట్‌గా దర్శకనిర్మాత కరణ్ జోహార్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కూడా అల్లు అర్జున్‌ను, 'పుష్ప' సినిమాను పొగిడాడు. ఆర్య సినిమా నుంచే బన్నీకి ఫ్యాన్ అంటూ తన ఇన్‌స్టా గ్రామ్‌లో రాసుకొచ్చాడు. తాజాగా అర్జున్ చెల్లెలు జాన్వీ కపూర్ సైతం పుష్పరాజ్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. సోషల్ మీడియా వేదికగా పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపించింది. అంతేకాకుండా ప్రపంంచంలోనే కూలెస్ట్ మ్యాన్ అంటూ స్టోరీ పెట్టింది. ఇప్పటికే బీటౌన్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు మంచి గుర్తింపు ఉంది. తాజాగా అల్లు అర్జున్ కూడా బాలీవుడ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం 'అబ్బా సాయిరాం' అన్నట్లుగా ఉంది.
ఇదీ చదవండి: నోట్లో థర్మామీటర్‌తో జాన్వీ.. కరోనాగా అనుమానం
Comments
Please login to add a commentAdd a comment