‘సినిమా అనేది ఎంతో శక్తి వంతమైన మాధ్యమం. ప్రజా జీవనాన్ని ప్రతిబింబించేలా అది ఉండాలి’ అన్నారు బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్. మంచి సినిమాలు చేస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి పర్యావరణ ప్రేమికురాలు కూడా.ఇటీవల ఓ ఇంటర్వూలో బాలీవుడ్ సినిమా కథలపై భూమి స్పందించింది. ప్రజలకు ఉపయోగపడే సినిమాలు తీయడంలో హిందీ పరిశ్రమ వెనక బడి ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.
సినిమాల గురించి భూమి మాట్లాడుతూ..‘హిందీ సినిమాలో ప్రజల స్థిరమైన జీవన విధానాన్ని చూపించడానికి సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. దేశంలో బాలీవుడ్ చిత్రాలని ఎక్కువ మంది చూస్తారు. అందుకే సామాజిక స్పృహతో సినిమాలు తీయాలి. అయితే ఆ విషయంపై ఇండస్ట్రీ దృష్టి పెట్టట్లేదని’ని అభిప్రాయపడింది.
సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అత్యంత శక్తివంతమైన మాధ్యమం సినిమాలు, అందుకే వాణిజ్య పంథాలో ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకువచ్చే కథల్ని ఎంచుకోవాలని ఈ బ్యూటీ తెలిపింది. కాగా ‘పతి ఔర్ పత్ని’, ‘రక్షా బంధన్’ మూవీస్‌తో గుర్తింపు పొందిన భూమి ప్రస్తుతం ‘తఖ్త్’, ‘బధాయ్ దో’ సినిమాల్లో నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment