Hollywood cinema
-
అవతార్-2 అరుదైన రికార్డ్.. రెండు వారాల్లోనే ఆ చిత్రాన్ని దాటేసింది..!
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’. డిసెంబర్ 16న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. ఇండియాలోనూ ఓ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోందీ చిత్రం. పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించి వింతలు, అద్భుతాలతో ఆద్యంతం విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సముద్రం అడుగున ఓ అద్భుత ప్రపంచాన్ని సృష్టించడం కామెరూన్‌కే సాధ్యమనేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. (ఇది చదవండి: అవతార్-2 ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన టికెట్ రేట్స్) తాజాగా ఈ చిత్రం ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వన్ బిలియన్ డాలర్ల టికెట్ల అమ్మకాల మార్క్‌ను అవతార్-2 అధిగమించింది. కేవలం 14 రోజుల్లో ఈ మార్క్‌ను దాటేసింది కామెరూన్ విజువల్ వండర్. జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రాన్ని అధిగమించి 2022లో రెండో అత్యధిక గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది. 2022లో విడుదలైన మూడు సినిమాలు మాత్రమే వన్ బిలియన్ డాలర్ల మార్కును అధిగమించాయి. అవతార్: ది వే ఆఫ్ వాటర్‌తో పాటు టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్: మావెరిక్ (31 రోజులు), క్రిస్ ప్రాట్ మూవీ జురాసిక్ వరల్డ్ డొమినియన్ ఈ మార్క్ చేరుకోవడానికి నాలుగు నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది. 2019లో విడుదలైన తొమ్మిది సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లను అధిగమించాయి. 2021లో వచ్చిన స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ మూవీ తర్వాత అవతార్- 2 అత్యంత వేగంగా ఈ మార్క్‌ను చేరుకుంది. స్పైడర్ మ్యాన్ చిత్రం కేవలం 12 రోజుల్లోనే అధిగమించి మొదటిస్థానంలో ఉంది. ఇప్పటివరకు కేవలం ఆరు సినిమాలు మాత్రమే మొదటి రెండు వారాల్లో వన్ బిలియన్ చేరుకున్నాయి. (ఇది చదవండి: సెన్సేషన్‌గా అవతార్ 2.. ఇండియాలో ఎంత వచ్చిందంటే?) అవతార్ 2 ఇప్పటివరకు ఉత్తర అమెరికాలో 317.1 మిలియన్ డాలర్లు, విదేశాల్లో 712.7 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 1.025 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. జురాసిక్ వరల్డ్ డొమినియన్ 1.001 బిలియన్ డాలర్లను అధిగమించి రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది అవతార్-2. ప్రస్తుతం అంచనాల ప్రకారం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కొవిడ్ మహమ్మారి మరోసారి పుంజుకోనుంది. అవతార్-2 ప్రధాన థియేట్రికల్ మార్కెట్ అయిన చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలు ఆంక్షల రష్యాలో చిత్రానికి ఆదరణ తగ్గింది. -
నటిపై అత్యాచారం.. నిర్మాతకు 24 ఏళ్ల జైలు శిక్ష..!
ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్ తాజాగా మరో అత్యాచారం కేసులో దోషిగా తేలాడు. 2013లో ఇటాలియన్ నటి, మోడల్‌పై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు లాస్ఏంజెల్స్ కోర్టు తేల్చింది. 12 మంది సభ్యుల జ్యూరీ అత్యాచారం, లైంగిక దాడిలో అతన్ని దోషిగా తేల్చింది. ఇప్పటికే ఇతర లైంగిక కేసుల్లో నేరం చేసినట్లు రుజువు కావడంతో అతను న్యూయార్క్‌లో 23 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ తీర్పుతో అతనికి మరో 24 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మొత్తం నలుగురు బాధితుల కేసులను కోర్టు విచారణ చేపట్టింది. 2010లో ఓ హోటల్లో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మసాజ్ థెరపిస్ట్ చేసిన ఆరోపణల కేసులో అతన్ని నిర్దోషిగా తేల్చింది. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ భార్య, డాక్యుమెంటరీ చిత్రనిర్మాత జెన్నిఫర్ సిబెల్ న్యూసోమ్‌కు సంబంధించిన అత్యాచారం, లైంగిక వేధింపుల కేసుతోపాటు మరో మహిళ కేసులో జ్యూరీ ఓ నిర్ణయానికి రాలేకపోయింది. అయితే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు హార్వే తన న్యాయ పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు అతని తరఫు ప్రతినిధులు తెలిపారు. దశాబ్దాలపాటు హాలీవుడ్లో నిర్మాతగా వెలిగిన హార్వే వేన్‌స్టీన్‌పై దాదాపు 80 మంది హాలీవుడ్ నటీమణులు, మహిళలు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏంజెలీనా జోలీ, సల్మా హయక్, జెన్నిఫర్ ఐన్‌స్టన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 2017లో ఆయనపై ఆరోపణలే మీటూ ఉద్యమానికి దారితీసిన సంగతి తెలిసిందే. అతను జీవితాంతం జైల్లోనే ఉండాలని కోరుకుంటున్నా అని తీర్పు అనంతరం ఆ ఇటాలియన్ నటి ప్రకటన విడుదల చేశారు. -
కష్టకాలంలో ఉక్రెయిన్.. మాతృదేశం కోసం భర్తతో కలిసి ఏకంగా రూ.267 కోట్లు
గత 27 రోజులుగా కొనసాగుతున్న రష్యా వైమానిక దాడులతో ఉక్రెయిన్ కకావికలం అవుతోంది. ఒకవైపు చర్చలు అంటూనే.. మరోవైపు రష్యా మారణహోమం సృష్టిస్తోంది. రష్యా విధ్వంసానికి ఉక్రెయిన్‌లో ఎక్కడ చూసినా కూలిన భవనాలు, గోడలు, శవాల దిబ్బలే కనిపిస్తున్నాయి. ఉన్న ఊరుని, ఇళ్లను వదిలి దాదాపు పది లక్షల మంది పౌరులు పొరుగు దేశాలకు శరనార్థులుగా వెళుతున్నారు. అయినప్పటికీ ఉక్రెయిన్ ఎక్కడా తగ్గడం లేదు. యుద్ధంలో రష్యా సైన్యానికి ఎదురొడ్డి పోరాడుతోంది. మరోవైపు ఉక్రెయిన్‌కు అనేక దేశాలు మానవతా సాయాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో దాదాపు నాలుగు వారాలుగా రష్యా దాడులతో అల్లాడిపోతున్న ఉక్రెయిన్‌కు అండగా నిలిచేందుకు ఓ హాలీవుడ్ జంట ఏకంగా 35 మిలియన్ డాలర్లు (సుమారు రూ.267 కోట్లు) విరాళంగా సేకరించింది. అమెరికాకు చెందిన ఆస్టన్ కుచర్, మిలా కునిస్ దంపతులు సామాజిక మాధ్యమాల వేదికగా ఇంత భారీ మొత్తంలో నిధులు సమీకరించారు. రష్యా చేస్తున్న ముప్పేట దాడులతో సర్వస్వాన్ని కోల్పోతున్న ఉక్రెయిన్ పౌరులకు తమ వంతు సాయం చేయాలని ఆస్టన్ కుచర్ జంట సంకల్పించింది. చదవండి: భారత్ వణుకుతోంది.. బైడెన్ సంచలన వ్యాఖ్యలు ఇందుకోసం ‘గో ఫండ్ మీ’ పేరుతో సామాజిక మాధ్యమాల్లో విరాళాలు సేకరించారు. నెటిజన్ల నుంచి విశేష స్పందన రావడంతో ఇప్పటివరకు 35 మిలియన్ల డాలర్లు విరాళంగా సమకూరాయి. 1983లో ఉక్రెయిన్‌లో జన్మించిన కునిస్ మాతృదేశానికి తనవంతు సాయం చేయడం పట్ల ఉప్పొంగిపోయారు. ఇక కష్టకాలంలో ఉన్న ఉక్రెయిన్‌కు అండగా నిలిచిన ఈ జంటపై ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వాళ్లే ప్రపంచంలో స్ఫూర్తి నింపుతారంటూ ట్వీట్ చేశారు. చదవండి: Russia Ukraine War భాష రాక ఉక్రేనియన్ల గోస.. 7 భాషల్లో సాయం.. అంధుడికి సలాం! కాగా మిలా కునిస్ 1983లో ఉక్రెయిన్‌లోనే జన్మించారు. ఓ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఒక అమెరికన్ అయినందుకు ఎప్పుడూ గర్వపడతాను. కానీ ఈరోజు నాకు ఉక్రేనియన్ దేశస్తురాలిని అని చెప్పుకునేందుకే ఎక్కువ గర్వంగా ఫీల్ అవుతున్నాను. అని తెలిపారు. అదే విధంగా తాను ఒక ఉక్రేనియన్‌ను పెళ్లి చేసుకున్నందుకు గర్వంగా ఉందంటూ కునిస్ భర్త ఆస్టన్ కుచర్ పేర్కొన్నారు. .@aplusk & Mila Kunis were among the first to respond to our grief. They have already raised $35 million & are sending it to @flexport & @Airbnb to help 🇺🇦 refugees. Grateful for their support. Impressed by their determination. They inspire the world. #StandWithUkraine pic.twitter.com/paa0TjJseu — Володимир Зеленський (@ZelenskyyUa) March 20, 2022 -
క్రిస్మస్ నేపథ్యంతో అలరించిన హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు ఇవే..
Top 10 Movies That Include Christmas Theme: భారతదేశం అన్ని పండుగలను ఒకే విధంగా జరుపుకుంటుంది. ప్రపంచంలోని ఇతర దేశాల మాదిరిగానే క్రిస్మస్ను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఇండియన్స్. ఈ పండుగలను సినిమాల్లో చూపించడం, వాటి గురించి ప్రస్తావన తేవడం సహజం. పండుగల ప్రత్యేకతలను తెలిపే సినిమాలు చాలానే వచ్చాయి. ఇలా క్రిస్మస్ పండుగ నేపథ్యంలో సాగే సినిమాలు సైతం వెండితెరపై అలరించాయి. ఇందులో రొమాంటిక్ ప్రేమ కథల నుంచి హృదయాన్ని కదిలించే ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్, హాస్యభరితమైన వరకు చిత్రాలు ఉన్నాయి. ఈ ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా బాలీవుడ్, హాలీవుడ్లో క్రిస్మస్తో అలరించిన టాప్ 10 సినిమాలపై ఓ లుక్కేద్దామా ! 1. ఏక్ మే ఔర్ ఏక్ తూ 2. అంజానా అంజాని 3. 2 స్టేట్స్ 4. దిల్వాలే 5. లాస్ట్ క్రిస్మస్ 6. షాందార్ 7. ది హాలీడే 8. శాంటా క్లాజ్ 9. ది పోలార్ ఎక్స్‌ప్రెస్ 10. హోమ్ ఎలోన్ -
పుష్పకు పోటీగా స్పైడర్ మ్యాన్.. మూడో రోజు కలెక్షన్ ఎంతంటే ?
Spider Man: No Way Home Crosses 100 Crore Mark On Day 3 In India: హాలీవుడ్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా ఫుల్ క్రేజ్. స్పైడర్ మ్యాన్ చేసే విన్యాసాలు, విలన్లతో పోరాట సన్నివేశాలు ఆడియెన్స్‌ను మంత్రముగ్ధులను చేస్తాయి. అందుకే ఈ స్పైడీ సినిమా అంటే చాలు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. అలాంటి భారీ హైప్‌తో డిసెంబర్ 16న విడుదలైంది స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. టామ్ హాలండ్ నటించిన ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద విజయ ఢంకా మోగిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ స్పైడీ చిత్రం ఇండియాలో రూ. 100 కోట్ల మార్కును దాటేసింది. అయితే ఆదివారం కూడా ఈ సినిమా భారీ వసూళ్లు నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: స్పైడర్ మ్యాన్‌తో స్టెప్పులేయించిన శిల్పా శెట్టి.. ఎందుకో తెలుసా ? ఎంతగానో ఎదురుచూస్తున్న మార్వెల్ సూపర్ హీరో యాక్షన్ చిత్రం 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' ఇండియాలో గురువారం (డిసెంబర్ 16) ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో 3,264 స్క్రీన్లలో రిలీజైంది. ఈ చిత్రం శుక్రవారం మాత్రం అంతగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఎందుకంటే అదే రోజున (డిసెంబర్ 17) ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ సినిమా 'పుష్ప: ది రైజ్' విడుదలే కారణం. అత్యధిక జనం పుష్పకు వెళ్లడంతో స్పైడర్ మ్యాన్ చిత్రానికి వసూళ్లు తగ్గాయి. పుష్ప సినిమాతో గట్టి పోటీ ఎదుర్కొన్న స్పైడీ శుక్రవారం రూ. 20.37 కోట్లు వసూలు చేయగా.. శనివారం మాత్రం రూ. 26.10 కోట్లు రాబట్టాడు. #SpiderMan is UNSHAKABLE and UNBEATABLE on Day 3… Fetches ₹ 26 cr+ on *non-festival Saturday* in pandemic era is 🔥🔥🔥… Expect another big day today [Sun]… Thu 32.67 cr, Fri 20.37 cr, Sat 26.10 cr. Total: ₹ 79.14 cr Nett BOC… Gross BOC: ₹ 100.84 cr. #India biz. pic.twitter.com/uL7HwKy5GR — taran adarsh (@taran_adarsh) December 19, 2021 ఇంకా ఈ సినిమా ఆదివారం రోజున భారీ వసూళ్లు రాబట్టనుందని అంచనా వేశారు ప్రముఖ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ ఇండియాలో ఇప్పటివరకు రూ. 100.84 కోట్లకు చేరుకుంది. అలాగే ఈ సినిమా విడుదలైన గురువారం (డిసెంబర్ 16) రోజున రూ. 32.76 కోట్లు వసూళ్లు సాధించింది. జాన్ వాట్స్ దర్శకత్వం వహించిన ఈ ఎమ్‌సీయూ (Marvel Cinematic Universe) చిత్రంలో పీటర్ పార్కర్/స్పైడర్ మ్యాన్‌గా టామ్ హాలండ్ నటించాడు. #SpiderMan is TERRIFIC on Day 2… Faces a dip in #South due to a big opponent [#Pushpa], yet the overall numbers are jaw-dropping… Should cross ₹ 💯cr in its 4-day *extended* weekend… Thu 32.67 cr, Fri 20.37 cr. Total: ₹ 53.04 cr Nett BOC… Gross BOC: ₹ 67.17 cr. #India biz. pic.twitter.com/vhAoO6gVEp — taran adarsh (@taran_adarsh) December 18, 2021 ఇదీ చదవండి: స్పైడర్ మ్యాన్-నో వే హోమ్ పోస్టర్ విడుదల.. ఇవి గమనించారా..! -
ప్రియాంక చోప్రా: ఇండియాను నా నుంచి విడదీయలేరు.. ఎందుకంటే
Priyanka Chopra Interesting Comments On India And Culture: గ్లోబల్ స్టార్ ప్రియాంక జోనాస్ ఎప్పుడూ తన సినిమాలతో బిజీగా ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే తన అస్థిత్వాన్ని, గుర్తింపును ఎవరైన తక్కువ చేసిన ఊరుకోదు. వెంటనే కౌంటర్ ఇస్తుంది ప్రియాంక. ఇందుకు ఉదాహరణ ఇటీవల తనను 'వైఫ్ ఆఫ్ జోనాస్'గా ప్రస్తావించడమే. ప్రస్తుతం ప్రియాంక తన రాబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్ ప్రమోషన్లో బిజీగా ఉంది. 'ది మ్యాట్రిక్స్' ఫ్రాంచైజీ నుంచి 18 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో ప్రియాంక సీత పాత్రను పోషించింది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన టెలివిజన్ హోస్ట్ రాషా గోయెల్‌తో ముచ్చటించింది ప్రియాంక. ఈ క్రమంలోనే ప్రియాంక తన మూలాలను గుర్తు చేసుకుంది. తాను ఇంటికి దూరంగా ఉన్నట్లు ఎప్పుడూ భావించలేదని చెప్పింది. అలాగే 'మీరు నన్ను భారతదేశం నుంచి బయటకు తీసుకురావచ్చు. కానీ భారతదేశాన్ని నా నుంచి వేరు చేయలేరు. నేను ఎక్కడికీ వెళ్లినా నాతోపాటు నా సంస్కృతి కూడా వస్తుంది. అందుకే నేను ఎప్పుడూ ఇంటికు (ఇండియా) దూరంగా ఉన్నట్లు భావించలేదు. నా ఇళ్లు, నా మందిరం, మా అమ్మ, నా ఆచారాలు ఎప్పుడూ నాతోనే ఉంటాయి. కాబట్టి నేను బాగానే ఉన్నాను. ఇలా ఉన్నందుకు నేను ఎప్పుడూ బాధపడను.' అని చెప్పుకొచ్చింది ప్రియాంక జోనాస్. ప్రియాంక, నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న తర్వాత యునైటెడ్ స్టేట్స్ (అమెరికా)లో నివసిస్తోంది. ఇప్పుడు ఇది చాలా వ్యూహాత్మకంగా ఉందని భావిస్తున్నట్లు ప్రియాంక తెలిపింది. అలాగే రెండు పరిశ్రమలను (బాలీవుడ్, హాలీవుడ్) బ్యాలెన్స్ చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. ఎందుకంటే అలా చేయగలిగే నటులు ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ మంది ఉన్నారని ప్రియాంక అభిప్రాయపడింది. So much love for @priyankachopra and seeing her be a part of this franchise. not often South Asian actors get booked in these parts. Talked about her exp on set and how the Indian culture is always with her. ❤️Always fearless in her endeavors. #southasian #PriyankaChopraJonas pic.twitter.com/slRA0fbCfd — Rasha Goel (@RashaGoel) December 16, 2021 ఇదీ చదవండి: 'నిక్ జోనాస్ వైఫ్' అన్నందుకు ప్రియాంక చోప్రా ఫైర్.. -
అమెరికా కంటే ముందుగా భారత్‌లో విడుదల.. ఏంటో తెలుసా?
Spider Man No Way Home Release In India Before The US: విపరీతమైన క్రేజ్ సంపాందించుకన్న హాలీవుడ్ చిత్రాలలో స్పైడర్ మ్యాన్ సిరీస్ ఒకటి. స్పైడర్ మ్యాన్ సిరీస్, అమెజింగ్ స్పైడర్ మ్యాన్ సిరీస్, మార్వెల్ స్పైడర్ మ్యాన్ సిరీస్‌ల్లోని అన్ని చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో వండర్ విజువల్స్‌తో వస్తోన్న చిత్రం స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. ఈ చిత్రానికి మొదటి నుంచే అంచనాలు పెరిగాయి. సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ బజ్ క్రియేట్ చేస్తోంది. తాజాగా సోనీ పిక్చర్స్ ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ ట్వీట్ చేసింది. టామ్ హాలండ్, జెండయా నటించిన ఈ స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ చిత్రాన్ని అమెరికాలో కంటే ఒకరోజు ముందే భారతదేశంలో విడుదల చేస్తున్నారు. 'స్పైడర్ మ్యాన్, మార్వెల్ అభిమానులందరికీ మేము కొన్ని ఆసక్తికర వార్తలు ఇవ్వనున్నాం. మన అభిమాన సూపర్ హీరో యూఎస్ కంటే ఒకరోజు ముందుగానే స్వింగ్ చేయనున్నాడ. డిసెంబర్ 16న స్పైడ్ మ్యాన్: నో వే హోమ్ చిత్రాన్ని ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో చూడండి.' అని 'సోనీ పిక్చర్స్ ఇండియా' పోస్ట్ చేసింది. అంటే దీని అర్థం అమెరికాలో కంటే ముందే ఇండియాలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో ప్రపంచానికి స్పైడర్ మ్యాన్ ఎవరో తెలిసిపోతుంది. అది సమస్యగా మారుతుంది. దీంతో తాను స్పైడర్ మ్యాన్ అని తెలీకుండా ఉండేందుకు డాక్టర్ స్ట్రేంజ్ సహాయం కోరుతాడు స్పైడీ. ఇందులో నలుగురు విలన్లతో స్పైడీ పోరాడనున్నట్లు సమాచారం. We have some exciting news for all the Spider-Man & Marvel fans! Our favourite superhero will be swinging in one day earlier than the US! Catch #SpiderManNoWayHome on December 16 in English, Hindi, Tamil & Telugu. pic.twitter.com/uUNQNJ7e3h — Sony Pictures India (@SonyPicsIndia) November 29, 2021 ఇది చదవండి: విజువల్ వండర్‌గా స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ ట్రైలర్.. -
ప్రియాంక మీరెక్కడున్నారు.. ఓ యూజర్ కామెంట్
Priyanka Chopra Shares The Matrix Resurrections New Poster: హాలీవుడ్ 'మ్యాట్రిక్స్' మూవీ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిత్రం విడుదల కోసం ఇండియన్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా 'ది మ్యాట్రిక్స్: రిసరెక్షన్స్' కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్లో హాలీవుడ్ స్టార్ కీన్ రీవ్స్‌తో పాటు క్యారీ-అన్నె మోస్, జడా పింకెట్ స్మిత్, యహ్యా అబ్దుల్ మాటీన్ 2, జోనాథన్ గ్రోఫ్ ఉన్నారు. ఈ పోస్టర్ షేర్ చేస్తూ ప్రియాంక 'ఈ మ్యాట్రిక్స్ రిసరెక్షన్ కొత్త పోస్టర్‌తో తిరిగి మ్యాట్రిక్స్‌లోకి అడుగు పెట్టండి. ఈ క్రిస్మస్కి థియేటర్లలో, హెచ్‌బీవో మ్యాక్స్‌లో చూడండి.' అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) భారతీయ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ఈ సినిమా పోస్టర్లో ప్రియాంక కనిపించకపోయేసరికి ప్రశ్నలు కురిపించిసాగారు. 'పోస్టర్లో మీరు ఎక్కడ ఉన్నారు' అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. 'మిమ్మల్ని చూసేందుకు ఎంతో ఎదురుచూస్తున్నాం' అని మరోకరు రాశారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. అందులో ప్రియాంక నల్లటి షేడ్స్ ధరించి రెప్పపాటు క్షణంలో కనిపిస్తారు. మ్యాట్రిక్స్ ఫ్రాంచైజీలో వస్తున్న ఈ నాల్గో సినిమాను లానా వాచోస్కీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిసెబంర్ 22న థియేటర్స్, హెచ్‌బీవో (HBO) మ్యాక్స్‌లో విడుదల కానుంది. -
అది తెలిసినవాళ్లెవరూ నన్ను ప్రేమించరు!
‘‘భారతదేశంలో పుట్టడం నా అదృష్టం’’ అంటున్నారు శ్రుతీహాసన్. ఆమె అలా అనడానికి కారణం ఉంది. విదేశాల్లో పుట్టి, ఏ హాలీవుడ్ సినిమాలోనో చేస్తే ఆంగ్ల భాషకు మాత్రమే పరిమితం అవ్వాల్సి వచ్చేదని, భారతదేశంలో పుట్టడం వల్ల పలు భాషల్లో నటించడానికి కుదురు తోందని అంటున్నారు శ్రుతి. తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు ఈ బ్యూటీ. ఇంకా అంగీకరించాల్సిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. వాటిల్లో మణిరత్నం దర్శకత్వం వహించనున్న భారీ మల్టీస్టారర్ ఒకటి. ఇందులో తనను నాయికగా అడిగారని శ్రుతి పేర్కొన్నారు. కానీ, ఇంకా డేట్స్ కేటాయించలేదని, ఇలాంటి ఓ భారీ అవకాశానికి అడగడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ చిత్రానికి డేట్స్ కేటాయించడానికి డైరీ తిరగేస్తున్నారట. అది సరే.. సినిమాల్లో హీరోలతో ప్రేమలో పడుతుంటారు కదా.. మరి, నిజజీవితం సంగతేంటి? అనే ప్రశ్న శ్రుతీహాసన్ ముందుంచితే -‘‘నేను సింగిల్‌గానే ఉన్నా. సినిమాల పరంగా నా బిజీ షెడ్యూల్ గురించి తెలిసినవాళ్లెవరూ నన్ను ప్రేమించరు. ప్రస్తుతం సినిమాల మీదే పూర్తి దృష్టి సారించాను. కష్టపడి పని చేయాలన్నదే నా ధ్యేయం. ప్రతి శుక్రవారం ఏదో ఓ సినిమా వస్తుంది.. పోతుంది. కానీ, చేసిన కృషి మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతుంది’’ అని చెప్పారు.