పుష్పకు పోటీగా స్పైడర్ మ్యాన్‌.. మూడో రోజు కలెక్షన్‌ ఎంతంటే ? | Spider Man No Way Home Crosses 100 Crore Mark On Day 3 In India | Sakshi
Sakshi News home page

Spider Man: No Way Home: పుష్పకు పోటీగా స్పైడర్ మ్యాన్‌.. మూడో రోజు కలెక్షన్‌ ఎంతంటే ?

Published Sun, Dec 19 2021 4:43 PM | Last Updated on Sun, Dec 19 2021 5:34 PM

Spider Man No Way Home Crosses 100 Crore Mark On Day 3 In India - Sakshi

Spider Man: No Way Home Crosses 100 Crore Mark On Day 3 In India: హాలీవుడ్‌ సూపర్‌ హీరో స్పైడర్‌ మ్యాన్‌ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా ఫుల్‌ క్రేజ్‌. స్పైడర్‌ మ్యాన్‌ చేసే విన్యాసాలు, విలన్లతో పోరాట సన్నివేశాలు ఆడియెన్స్‌ను మంత్రముగ్ధులను చేస్తాయి. అందుకే ఈ స్పైడీ సినిమా అంటే చాలు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. అలాంటి భారీ హైప్‌తో డిసెంబర్‌ 16న విడుదలైంది స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌. టామ్‌ హాలండ్‌ నటించిన ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్‌ వద్ద విజయ ఢంకా మోగిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ స్పైడీ చిత్రం ఇండియాలో రూ. 100 కోట్ల మార్కును దాటేసింది. అయితే ఆదివారం కూడా ఈ సినిమా భారీ వసూళ్లు నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఇదీ చదవండి: స్పైడర్‌ మ‍్యాన్‌తో స్టెప్పులేయించిన శిల్పా శెట్టి.. ఎందుకో తెలుసా ?

ఎంతగానో ఎదురుచూస్తున్న మార్వెల్‌ సూపర్‌ హీరో యాక్షన్‌ చిత్రం 'స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్' ఇండియాలో గురువారం (డిసెంబర్‌ 16) ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో 3,264 స్క్రీన్‌లలో రిలీజైంది. ఈ చిత్రం శుక్రవారం మాత్రం అంతగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఎందుకంటే అదే రోజున (డిసెంబర్‌ 17) ఐకానిక్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సినిమా 'పుష్ప: ది రైజ్‌' విడుదలే కారణం. అత్యధిక జనం పుష్పకు వెళ్లడంతో స్పైడర్‌ మ్యాన్‌ చిత్రానికి వసూళ్లు తగ్గాయి. పుష్ప సినిమాతో గట్టి పోటీ ఎదుర్కొన్న స్పైడీ శుక్రవారం రూ. 20.37 కోట్లు వసూలు చేయగా.. శనివారం మాత్రం రూ. 26.10 కోట్లు రాబట్టాడు. 

ఇంకా ఈ సినిమా ఆదివారం రోజున భారీ వసూళ్లు రాబట్టనుందని అంచనా వేశారు ప్రముఖ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ ఇండియాలో ఇప్పటివరకు రూ. 100.84 కోట్లకు చేరుకుంది. అలాగే ఈ సినిమా విడుదలైన గురువారం (డిసెంబర్‌ 16) రోజున రూ. 32.76 కోట్లు వసూళ్లు సాధించింది. జాన్ వాట్స్‌ దర్శకత్వం వహించిన ఈ ఎమ్‌సీయూ (Marvel Cinematic Universe) చిత్రంలో పీటర్‌ పార్కర్‌/స్పైడర్‌ మ్యాన్‌గా టామ్‌ హాలండ్‌ నటించాడు. 

ఇదీ చదవండి: స్పైడర్‌ మ్యాన్‌-నో వే హోమ్‌ పోస్టర్‌ విడుదల.. ఇవి గమనించారా..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement