రాజీ పడితే మంచిది! | Sruthi hasan about relationships | Sakshi
Sakshi News home page

రాజీ పడితే మంచిది!

Published Sun, Jan 22 2017 10:51 PM | Last Updated on Tue, Sep 5 2017 1:51 AM

రాజీ పడితే మంచిది!

రాజీ పడితే మంచిది!

ఇప్పుడంతా ఫాస్ట్‌ ఫుడ్‌ కల్చర్‌. చటుక్కున తినేయాలి.. చిటుక్కున పనుల్లో పడిపోవాలి. అంతా వేగం. బంధాలకు ప్రాధాన్యం ఇవ్వలేనంత బిజీ బిజీగా కొంతమంది ఉంటున్నారు. త్వరగా స్నేహం చేయడం... త్వరగా విడిపోవడం, ఈజీగా లవ్‌లో పడటం... అంతే సులువుగా విడిపోవడం, ఇష్టపడి పెళ్లాడటం... చిన్ని చిన్ని మనస్పర్థలకే విడిపోవడం... మొత్తం మీద బంధాలకు విలువ లేకుండాపోతోంది. బంధాల గురించి ఇంత లెక్చరర్‌ దేనికీ అనుకుంటున్నారా? ‘రిలేషన్‌షిప్స్‌’ గురించి శ్రుతీహాసన్‌ ఓ మంచి మాట చెప్పారు. అందుకే అన్నమాట.

శ్రుతీహాసన్‌ మాట్లాడుతూ – ‘‘కాంప్రమైజ్‌ కాకపోతే జీవితం అస్తవ్యస్తమే. ఎక్కడ రాజీపడాలో అక్కడ పడితేనే జీవితం బాగుంటుంది. ముఖ్యంగా బంధాలను కాపాడుకోవాల్సిన విషయంలో రాజీ పడాల్సిందే. అక్కడ లేనిపోని గొప్పలకు పోతే ఆ బంధం తెగిపోతుంది. ఒకప్పుడు స్నేహంలో అయినా, వివాహ బంధంలో అయినా రాజీ అనేది ఉండేది. సర్దుకుపోయేవాళ్లు. ఇప్పుడలా ఇష్టపడటంలేదు. రాజీపడటం తగ్గింది కాబట్టి.. విడిపోవడాలు ఎక్కువైపోయాయి. చిన్నపాటి రాజీవల్ల ఓ బంధం నిలబడుతుందనుకున్నప్పుడు సర్దుకుపోవాలి. ఒకవేళ ఆ బంధం వల్ల జీవితాంతం ఇబ్బందులపాలు కావల్సి వస్తుందనిపిస్తే అప్పుడు రాజీ పడకూడదు’’ అని అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement