relationships
-
బంధాలను ప్రభావితం చేసే బాల్యానుభవాలు
రాహుల్, పూజ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. ఇద్దరికీ ఆఫీసులో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లపాటు వాళ్ల కాపురం అందంగా, ఆనందంగా సాగింది. ఆ తర్వాత అవగాహనలో సమస్యలు ఏర్పడ్డాయి, విభేదాలు పెరిగాయి. రాహుల్ తనకు తగినంత సమయం ఇవ్వడం లేదని పూజ భావిస్తోంది. ఆమె అవసరాలు తీర్చడాన్ని ఒత్తిడిగా రాహుల్ భావిస్తున్నాడు. ఈ విషయమై తరచూ గొడవలు పడుతున్నారు. ఆ గొడవలను వారికి వారు పరిష్కరించుకోలేక కౌన్సెలింగ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.మూలాలు బాల్యానుభవాల్లో..మొదటి సెషన్లో విడివిడిగా రాహుల్, పూజలు తమ చిన్ననాటి అనుభవాలను వివరించారు. రాహుల్ చిన్నప్పుడు తన తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా ఎమోషనల్ సపోర్ట్ పొందలేకపోయాడు. ఫలితంగా అతనిలో అవాయిడెంట్ అటాచ్మెంట్ ఏర్పడింది. దీంతో బంధాలలో సాన్నిహిత్యం కంటే స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటున్నాడు. పూజ బాల్యంలో తల్లిదండ్రుల నుంచి అనిశ్చితమైన ప్రేమను పొందింది. పూజ తల్లిదండ్రులు ఆమె ఎమోషనల్ అవసరాలను కొన్నిసార్లు తీర్చేవారు, మరికొన్నిసార్లు విస్మరించేవారు. ఫలితంగా ఆమెలో యాంగ్షియస్ అటాచ్మెంట్ ఏర్పడింది. తన భాగస్వామి కాస్త దూరంగా ఉంటే చాలు అభద్రతను, భయాన్ని అనుభవిస్తోంది. దాంతో నిత్యం తనతోనే ఉండాలని రాహుల్ పై ఒత్తిడి పెంచుతోంది. ఈ వ్యత్యాసాల కారణంగా చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారాయి. ఒకరినొకరు తీవ్రంగా ప్రేమిస్తున్నప్పటికీ అపార్థాలకు దారితీశాయి.రెండు నెలల్లో సమస్యలు దూరం.. ఇద్దరితో మాట్లాడి, వారి అటాచ్మెంట్ స్టయిల్స్ గురించి, వాటివల్ల ఏర్పడుతున్న సమస్యల గురించి అర్థం చేసుకున్నాక, వాటిని బ్యాలెన్స్ చేయడానికి వారికి సూచించిన వ్యూహాలు కొన్ని..1. రాహుల్ తన స్వేచ్ఛ కోసం చేసే పనులు ప్రేమను తిరస్కరించడం కాదని పూజ గుర్తించాలి. అలాగే తన నిరంతర ధ్రువీకరణ అవసరాన్ని పరిమితం చేసుకోవాలి. 2. ఇద్దరూ తమ భావోద్వేగాలను, అవసరాలను స్పష్టంగా, నిర్మాణాత్మకంగా కమ్యూనికేట్ చేయడం ప్రారంభించారు. ఉదాహరణకు, పూజకు ధ్రువీకరణ అవసరం ఉన్నప్పుడు, ఆమె ప్రశ్నల ద్వారా కాకుండా తన భావాలను చెప్పడం నేర్చుకుంది.3. పూజకు ఇవ్వాల్సిన ఎమోషనల్ సపోర్ట్ ప్రాధాన్యాన్ని గుర్తించి రాహుల్.. ఆమెకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాడు. అదే సమయంలో పూజ కూడా రాహుల్ స్వేచ్ఛకు గౌరవం ఇవ్వడం తెలుసుకుంది.4. ఇరువురూ తమ రోజువారీ జీవనంలో పరస్పర సహకారం, చిన్నచిన్న ఆనందాలను ఆస్వాదించేందుకు సమయం కేటాయించటం మొదలుపెట్టారు. ఉదాహరణకు, వారాంతాల్లో కలిసి వాకింగ్ చేయడం లేదా ఒక కొత్త హాబీని ఆరంభించడం లాంటివి.రెండు నెలల కౌన్సెలింగ్ తర్వాత వారి సంబంధంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. దాంతో, వారి మధ్య గొడవలు తగ్గి, ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ పెరిగాయి.అటాచ్మెంట్ థియరీ మన చిన్ననాటి అనుభవాలు, పెంపకం విధానాలు మన ప్రస్తుత సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరించే సిద్ధాంతమే అటాచ్మెంట్ థియరీ. బాల్యంలో తల్లిదండ్రులతో ఏర్పడే అనుబంధం, మన వ్యక్తిత్వానికి, భావోద్వేగ వ్యవహారానికి, ముఖ్యంగా ప్రేమ సంబంధాలకు మూలస్తంభం అవుతుంది. అయితే, ఈ అటాచ్మెంట్ శైలులు స్థిరమైనవి కావు, వాటిని మార్చుకోవచ్చు. ఇందులో మూడు రకాలున్నాయి. సెక్యూర్ అటాచ్మెంట్సెక్యూర్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తులు ప్రేమ, నమ్మకం, అనుబంధానికి ప్రాధాన్యమిస్తారు. ఇతరులతో సంబంధాలను బలంగా, స్వతంత్రంగా, అనురాగపూర్వకంగా నిర్వహించగలుగుతారు. ఉదాహరణకు ఒక సెక్యూర్ వ్యక్తి తన భాగస్వామి కొంత సమయం స్వతంత్రంగా గడపాలని కోరితే, దాన్ని సానుకూలంగా అర్థం చేసుకుంటాడు.యాంగ్షియస్ అటాచ్మెంట్యాంగ్షియస్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తులు సంబంధాల్లో ఎక్కువ భయాన్ని, అస్థిరతను అనుభవిస్తారు. వీరు ఎక్కువగా భావోద్వేగ ధ్రువీకరణ కోసం భాగస్వామిపై ఆధారపడతారు. ఉదాహరణకు భాగస్వామి తక్షణమే ఫోన్ కాల్కి ప్రతిస్పందించకపోతే, తనపై ప్రేమ లేదా శ్రద్ధ తగ్గిందని అనుమానపడతారు.అవాయిడెంట్ అటాచ్మెంట్అవాయిడెంట్ అటాచ్మెంట్ కలిగిన వ్యక్తులు స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యమిస్తారు. అనుబంధం, సాన్నిహిత్యాన్ని నివారించడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకు ఈ అటాచ్మెంట్ శైలి ఉన్న వ్యక్తి.. భాగస్వామి తనతో ఎక్కువ సమయం గడపాలని కోరితే.. తన స్వేచ్ఛను లాగేసుకుంటున్నట్లు భావిస్తాడు, ప్రతిఘటిస్తాడు. -
సహోద్యోగులతో పంచుకోకూడని అంశాలు..
పని ప్రదేశాల్లో స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవడం మంచిదే. అంతమాత్రానా సహోద్యోగులతో అన్ని విషయాలు పంచుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత వివరాలు, విశ్వాసాలు, ఆరోగ్య విషయాలు..వంటి కొన్ని అంశాలను తోటి ఉద్యోగులతో చర్చించకపోవడమే మేలని సూచిస్తున్నారు. ఒకవేళ వారితో ఆయా విషయాలను చర్చిస్తే వృత్తిపరంగా, వ్యక్తిగతంగా జరిగే మేలు కంటే చేటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తోటి ఉద్యోగులతో పంచుకోకూడని కొన్ని అంశాలను నిపుణులు తమ మాటల్లో తెలియజేస్తున్నారు.వ్యక్తిగత, ఆర్థిక సమాచారంమీ వ్యక్తిగత, ఆర్థిక పరిస్థితిని గోప్యంగా ఉంచాలి. మీరు పొందుతున్న జీతం, అప్పులు, పెట్టుబడులు కార్యాలయంలో అనవసరమైన ఒత్తిడి, పోటీని సృష్టిస్తాయి. మీ జీవనశైలిని ప్రభావితం చేసే అంశాలపై తోటి ఉద్యోగులు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల వృత్తిపరంగా నష్టం జరగవచ్చు.ఆరోగ్య సమస్యలుసెలవులు తీసుకోవడానికి, టార్గెట్లు తప్పించుకోవడానికి తరచూ చాలామంది ఆఫీస్‌లో ఆరోగ్య సమస్యలున్నట్లు చెబుతారు. అందుకు బదులుగా మీకు నిజంగా ఏదైనా సమస్యలుంటే దాన్ని ఎలా అధిగమిస్తున్నారో హెచ్ఆర్, మేనేజర్‌కు మాత్రమే చెప్పండి. భవిష్యత్తులో మీరు సెలవు అడిగినప్పుడు మీ సమస్యపై వారికి అవగాహన ఉంది కాబట్టి అనుమతించే అవకాశం ఉంటుంది. తోటి ఉద్యోగులకు చెప్పడం వల్ల మీరు టార్గెట్లు తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేయవచ్చు.రాజకీయ, మత విశ్వాసాలుపని ప్రదేశంలో విభిన్న విశ్వాసాలు కలిగిన వారు ఉంటారు. మీ రాజకీయ, మత విశ్వాసాలను వారిపై రుద్దడం కంటే అసలు ఆ ప్రస్తావన లేకుండా వృత్తి జీవితం సాఫీగా సాగేలా జాగ్రత్త పడాలి.సహోద్యోగులు, మేనేజ్మెంట్పై కామెంట్లుసహచరులు / మేనేజ్మెంట్ గురించి తోటి ఉద్యోగులతో చెడుగా మాట్లాడటం లేదా గాసిప్‌లు క్రియేట్ చేయడం ఆపేయాలి. సంస్థకు సంబంధించిన మీ అభిప్రాయాలు సరైనవే అయినా ఇతరులతో పంచుకోకూడదు. మీ విమర్శలు ఏవైనా ఉంటే నేరుగా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లడం మంచిది.ఇదీ చదవండి: బ్యాంకులపై ఆధారపడొద్దు: ఐఆర్డీఏఐభవిష్యత్ ఉద్యోగ ప్రణాళికలుమీరు అధికారిక ప్రకటన చేయకుండా కంపెనీ మారే ఆలోచనను ఎవరితోనూ పంచుకోకూడదు. మీ భవిష్యత్ ఉద్యోగ ప్రణాళికలను గోప్యంగా ఉంచడం ఉత్తమం. ఈ విషయాన్ని ముందుగానే చెబితే ప్రస్తుత మీ స్థానానికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది. -
సంబంధాల్లో నిప్పులు పోస్తున్న స్మార్ట్‌ఫోన్.. సర్వేలో భయంకర నిజాలు
మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వాడకం మానవ వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీస్తోందని.. తల్లిదండ్రులు & పిల్లల మధ్య కూడా దూరాన్ని పెంచేస్తోందని.. వివో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.తల్లిదండ్రులు సగటున రోజుకి.. ఐదు గంటల కంటే ఎక్కువ సమయం.. పిల్లలు నాలుగు గంటలకు పైగా స్మార్ట్ఫోన్లలో గడుపుతున్నారని సర్వేలో వెల్లడైంది. వీరందరూ ఎక్కువగా సోషల్ మీడియా, వినోదం కోసం వీటిని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.స్మార్ట్‌ఫోన్ వాడకం వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీస్తోంది. 66 శాతం మంది తల్లిదండ్రులలో.. 56 శాతం మంది పిల్లలలో అధిక స్మార్ట్‌ఫోన్ వినియోగం కారణంగా వారి వ్యక్తిగత సంబంధాలలో ప్రతికూల మార్పులు వస్తున్నాయని సర్వేలో తేలింది. ఈ మార్పులు వారి మధ్య సంఘర్షణకు కూడా కారణమవుతున్నట్లు తెలిసింది.73 శాతం మంది తల్లిదండ్రులు.. 69 శాతం మంది పిల్లలు తమ మధ్య వివాదానికి కారణం మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగమే అని సర్వేలో తేలింది. స్మార్ట్‌ఫోన్ తల్లిదండ్రులు, పిల్లల జీవితాల్లో అనివార్యమైన భాగంగా మారింది. దీంతో 76 శాతం మంది తల్లిదండ్రులు, 71 శాతం మంది పిల్లలు తమ స్మార్ట్ఫోన్లు లేకుండా జీవించలేరని అంగీకరిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.ఇదీ చదవండి: అందరికీ ఇష్టమైన గేమ్.. ఇప్పుడు నథింగ్ ఫోన్లో64 శాతం మంది పిల్లలు స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోయినట్లు, ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియా, వినోద కార్యక్రమాలలో గడుపుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పూణేలలోనే స్మార్ట్‌ఫోన్ యూజర్లను అధ్యయనం చేసిన తరువాత ఈ విషయాలను వెల్లడించారు. -
తల్లిదండ్రులు... పొరుగువారు
మీరంతా తల్లిదండ్రుల యెడల సద్భావంతో మెలగండి. బంధువులు, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. పొరుగున ఉన్న బంధువులు, అపరిచితులైన పొరుగువారు, పక్కనున్న మిత్రులు, బాటసారులు, మీ అధీనంలో ఉన్న దాసదాసీ జనం పట్ల ఉదార బుద్ధితో వ్యవహరించండి. గర్వాతిశయంతో కన్నూ మిన్నూ కానని వారు, తమ గొప్పతనం గురించి విర్రవీగే వారిని అల్లాహ్ ఇష్టపడడు (దివ్య ఖుర్ ఆన్: 4:36) బంధువులు: నానమ్మ, తాతయ్య, పెదనాన్న, బాబాయి, మేనత్త, అమ్మమ్మ, తాతయ్య, మామయ్యలు, పిన్నమ్మలు, వారి సంతానంతో మనం కలిసి మెలిసి ఉండాలి. పరస్పరం ఆదుకుంటూ... సహకరించు కుంటూ ... సేవ చేసుకుంటూ ఉండాలి. పోరపొచ్చాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమ, అభిమానం, ఆ΄్యాయతలు కలిగి బంధుత్వాలను పటిష్టపరుచుకోవాలి. అనాథులు: వీరికి శాపనార్థాలు పెట్టకూడదు. తిట్ట కూడదు. కోపగించుకోకూడదు. ప్రేమగా, లాలనగా చూడాలి. మీరు మీ పిల్లల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటారో అంత ప్రేమతో గనుక ఈ అనాథ తల నిమిరితే మీ చేతికి ఎన్ని వెంట్రుకలయితే తగులుతాయో అన్నిపాపాలు క్షమించబడతాయి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం.∙నిరుపేదలు: ఎవరైతే పేదరికంతో ఉండి కూడా అభిమానం వల్ల ఎవరి ముందూ చేయి చాపకుండా ఎవరి వద్ద బాకీ తీసుకోకుండా అంతలోనే ఇబ్బంది పడుతూ గడుపుతూ ఉంటారో అలాంటి వారిని నిరుపేదలు అంటారు. వారికి కుడి చేతితో ఇస్తే ఎడమ చేతికి తెలియకుండా ఇస్తామనే సామెతలా మసులుకోవాలి. పొరుగున ఉన్న బంధువులు: పొరుగున నిజంగా మన బంధువులు లేక బంధువులు కాని వారు ఉన్నా వారిని కూడా బంధువులు గానే పరిగణించాలి. అన్నారు మహనీయ ప్రవక్త.అపరిచితులైన పొరుగువారు: అంటే మనం ప్రయాణిస్తున్న సందర్భంగా పరిచయం లేని వారు. మన పక్కన కూర్చుంటారు. వారికి ఇబ్బంది కలిగించకూడదు. పోగ తాగుతూ, గుట్కా నములుతూ, జర్దా ΄ాన్ వేసుకుంటూ ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదు. వారికి కూర్చోవడంలో ఇబ్బంది కలగకుండా చూడాలి. అదేవిధంగా మనం బజారులో సరుకులు కొనడానికి వెళ్లినప్పుడు మన పొరుగున నిలబడిన వాళ్ళు సరుకులు కొంటూ ఉంటారు, వారు కూడా పొరుగువారే. వారు మంచి వస్తువులు ఏరుకుంటున్న సందర్భంగా మనం వారితో పోటీపడకుండా వారికే ప్రాధాన్యమిస్తే మనకు మంచే జరుగుతుంది.– అబ్దుల్ రషీద్ -
సీబీఎస్ఈ 9వ తరగతి పుస్తకాల్లో... డేటింగ్, రిలేషన్షిప్ పాఠాలు
న్యూఢిల్లీ: టీనేజీ విద్యార్థులకు ఏదైనా ఒక విషయాన్ని సమాజం.. తప్పుడు కోణంలో చెప్పేలోపే దానిని స్పష్టమైన భావనతో, సహేతుకమైన విధానంలో పాఠంగా చెప్పడం మంచిదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సీబీఎస్ఈ నిర్ణయించుకుంది. పిల్లలతో తల్లిదండ్రులు చర్చించడానికి విముఖత చూపే డేటింగ్, రిలేషన్షిప్ వంటి సున్నితమైన అంశాలపై టీనేజీ విద్యార్థుల్లో సుస్పష్టమైన ఆలోచనను పాదుకొల్పే సదుద్దేశంతో సీబీఎస్ఈ ముందడుగు వేసింది. ఇందులో భాగంగా డేటింగ్, రిలేషన్షిప్ వంటి ఛాప్టర్లను తమ 9వ తరగతి ‘వాల్యూ ఎడిషన్’ పాఠ్యపుస్తకాల్లో చేర్చింది. టీనేజీ విద్యార్థుల్లో హార్మోన్ల ప్రభావంతో తోటి వయసు వారిపై ఇష్టం, కలిసి మెలసి ఉండటం వంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో సవివరంగా చెబుతూ ప్రత్యేకంగా పాఠాలను జతచేశారు. ‘డేటింగ్ అండ్ రిలేషన్షిప్స్: అండర్స్టాండింగ్ యువర్సెల్ఫ్ అండ్ ది అదర్ పర్సన్’ పేరుతో ఉన్న ఒక పాఠం, కొన్ని పదాలకు అర్ధాలు, ఇంకొన్ని భావనలపై మీ అభిప్రాయాలేంటి? అనే ఎక్సర్సైజ్ సంబంధ పేజీలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఫొటోలవంటి ఇతరుల సమాచారాన్ని దొంగతనంగా సేకరించి వాటితో ఇంకొకరిని ఆకర్షించే ‘క్యాట్‌ఫిషింగ్’, సంజాయిషీ లేకుండా బంధాన్ని హఠాత్తుగా తెగతెంపులు చేసుకునే ‘ఘోస్టింగ్’, ‘సైబర్ బులీయింగ్’ పదాలకు అర్ధాలను వివరిస్తూ చాప్టర్లను పొందుపరిచారు. ‘క్రష్’, ‘స్పెషల్’ ఫ్రెండ్ భావనలను చిన్న చిన్న కథలతో వివరించారు. -
కుటుంబాలు కూలిపోయి.. బంధాలు కాలిపోయి! అమ్మా నాన్న మీకోసం.......
నేను బాగుంటే చాలు అనుకోవడంతోనే రోజు మొదలవుతోంది. తోడబుట్టిన వాళ్లు.. బంధువులు కూడా డబ్బు ముందు కానివారవుతున్నారు. ఆస్తులు అంతస్తులు.. పిల్లలు సాధించిన విజయాలు.. గడుపుతున్న విలాసవంతమైన జీవితం.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ. వ్యక్తిత్వం ఎక్కడో ఒక మూలన మాత్రమే కనిపిస్తుంది. ఆప్యాయత కరువవుతోంది. బంధాలు పలుచన కాగా.. అసూయ పెరిగిపోతుంది. తనకు కష్టం వచ్చినా, ఇతరులు బాధపడినా కన్నీళ్లే వస్తాయనే విషయం బోధపడితే కానీ తెలియని పరిస్థితి. పెద్దగా ఆస్తులు లేకపోయినా.. ఆదాయ వనరులు అంతంత మాత్రమే ఉన్నా.. అప్పట్లో ఉమ్మడి కుటుంబం కష్టసుఖాల్లో తోడు నిలిచింది. ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉండటం.. అరమరికలు లేని జీవనం ఉన్నంతలో సంతృప్తి నిచ్చింది. కానీ ఆధునిక ప్రపంచం గుండెలో గోడలు కట్టుకోవడం బంధాలను పలుచన చేస్తోంది. – సాక్షి, కర్నూలు డెస్క్ 29.05.2023 మెడికల్ షాపు నిర్వహణతో భార్యాభర్తలు ఏ లోటు లేకుండా జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాగా చదివించారు.. ఉద్యోగం రావడం.. పెళ్లి చేయడంతో రెక్కలొచ్చి ఎవరి దారిని వాళ్లు ఎగిరిపోయారు. కుటుంబ యజమాని మంచం పట్టడంతో ఆయన బాగోగులు చూసుకోవడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. చివరకు భర్త మరణం ఆమెను కలచివేసింది. ఇంట్లో ఓదార్చే దిక్కులోదు.. ధైర్యం చెప్పే మనుషుల్లేరు. కొడుకులు వస్తారంటే ఒకరు సప్త సముద్రాల ఆవల.. మరొకరు వందల కిలోమీటర్ల దూరం.. ఎవరికీ చెప్పుకోలేక ఇంట్లోనే దహన సంస్కారాలు పూర్తి చేసింది. .. పత్తికొండలో చోటు చేసుకున్న ఈ ఘటన మాయమవుతున్న బంధాలకు అద్దం పట్టింది. చిన్నటేకూరుకు చెందిన రంగయ్య విశ్రాంత ఆర్టీసీ మెకానిక్. భార్య, కుమార్తెలు పట్టించుకోకపోవడంతో ఐదేళ్లుగా అనాథాశ్రమంలో కడుపు నింపుకుంటున్నాడు. చివరకు తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించాడు. ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కేందుకు ఆరోగ్యం కూడా సహకరించక నీరసించాడు. కర్నూలులోని అశోక్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన తండ్రి ఆస్తిని దాన విక్రయంగా పొంది తల్లి, సోదరిని ఇంటి నుంచి గెంటేశాడు. కనీసం చట్ట ప్రకారం ఆస్తి ఇవ్వాలని కోరినా దిక్కున్న చోట చెప్పుకోమంటున్నాడు. కోర్టును ఆశ్రయించినా న్యాయం జరిగేందుకు సమయం పట్టే అవకాశం ఉండటంతో బతికేందుకు ఆర్థిక వనరులు లేక దిక్కులు చూస్తున్నారు. ప్రపంచం వేగంగా అడుగులు వేస్తుండటంతో ఎవరికి వారు జీవితంలో స్థిరపడాలనే ఉరుకులు పరుగుల జీవనానికి అలవాటుపడ్డారు. చదువు.. ఉద్యోగం.. ఈ రెండింటికి ప్రాధాన్యత పెరుగుతోంది. ఆ తర్వాత ఇల్లు, పిల్లలు వీటితోనే జీవితం గడిచిపోతుంది. డబ్బు.. డబ్బు.. ఈ కరెన్సీ నోట్ల మధ్య సమయం నలిగిపోతుంది. మానవత్వం ఎప్పుడో కానీ ఉనికి చాటుకోలేకపోతుంది. సౌకర్యాలు.. విలాసాలు పెరిగిపోవడంతో వీటి ముందు వ్యక్తిత్వం చిన్నబోతుంది. కుటుంబం అన్న మాటే కానీ.. ఎవరికి వారుగా జీవిస్తున్నారు. చాలా కుటుంబాలు ఇప్పటికే బాగా పలుచబడ్డాయి. విద్య.. ఉద్యోగం.. ఉపాధి.. కారణం ఏదైనా ఇంటికి దూరంగా బతకడం అలవాటైపోయింది. ఇక అక్కడో ఇక్కడో కొంతమంది కలసిమెలసి ఉంటున్నా.. అరమరికలతో తుమ్మితే ఊడిపోయే బంధంగా మారుతోంది. పెద్దల పట్ల గౌరవం తగ్గిపోతుండటంతో ఒకే ఇంట్లో జీవిస్తున్నా ఆత్మీయతలు కనుమరుగవుతున్నాయి. రాక, పోక ఇష్టానుసారం కాగా.. విలువలు గాలికి కొట్టుకుపోయి బంధాలు ఒంటరిగా మిగిలిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎవరికి వారే భోజనం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో అందరూ కలసి భోజనం చేయడం పరిపాటి. ఆ తర్వాత సంఖ్య కాస్త పలుచబడినా రోజులో ఏదో ఒక పూట భోజనం చేయనిదే తృప్తి కలగని పరిస్థితి. ఇప్పుడు ఎవరు ఏ సమయంలో తింటారో తెలియదు, ఏం తింటున్నారో కూడా అడిగేందుకు సమయం ఉండకపోవడం కుటుంబంలో అనారోగ్య వాతావరణానికి కారణమవుతోంది. అందరూ కలసి కూర్చొని భోజనం చేయడం ద్వారా కష్టసుఖాలు పాల్పంచుకునే అవకాశం ఉంటుంది. దీని వెనుక ఉద్దేశం మారిపోయి.. ఆకలి అయినప్పుడు తింటామనో, బయట తిని వచ్చామనే మాటలు వినిపించడం సర్వసాధారణమైంది. హాస్టళ్లలో చదువు ఇది పోటీ ప్రపంచం. మా పిల్లాడు అందరికంటే ముందుండాలనే భావన ప్రతి ఒక్క తల్లిదండ్రిలో కనిపిస్తుంది. ఈ కారణంగా పిల్లలను ఇంట్లో ఉంచుకోకుండా కార్పొరేట్ హాస్టళ్లలో ఉంచి చదివించడం ఫ్యాషన్ అయిపోయింది. అగ్గి పెట్టెల్లాంటి రూముల్లో.. మంచీచెడు తెలియకుండా రోజులు గడిచిపోతున్నాయి. అమ్మానాన్నల ఆప్యాయతకు దూరమవుతూ.. బంధాల విలువ తెలియకుండా ర్యాంకుల వెంట పరుగులు తీయడంతోనే బాల్యం దాటిపోతుంది, యవ్వనం చేజారిపోతుంది. ఆ తర్వాత కూడా ఇంటికి చుట్టపుచూపుగానే వస్తుండటంతో విలువలు వీధిపాలవుతున్నాయి. పండగలూ పబ్బాలకే.. గతంలో శుభకార్యమైనా, చావుకైనా పది మంది కలిసేవాళ్లు. మంచీచెడు చెప్పి వెళ్లేవాళ్లు. రాత్రి పూట ఆరుబయట మంచాలు వేసుకొని పొద్దుపోయే దాకా కబుర్లు చెప్పుకుంటూ కష్టసుఖాలు పంచుకునేవాళ్లు. ఇప్పుడు ఎవరైనా చనిపోతే కనీసం ఖర్మకాండలు ఎలా చేయాలనే విషయం కూడా తెలియక తికమకపడుతున్నారు. పెళ్లిళ్లు.. శుభకార్యాలంటే ప్రతి ఒక్కరి అడుగు ‘బ్రాహ్మణుల’ ఇంటి వైపునకే పడుతోంది తప్పితే ఒక్కటంటే ఒక్కటీ సొంతంగా చేసుకోలేకపోవడం ఆధునికత ఏ పరిస్థితికి దారితీస్తుందో అర్థమవుతోంది. ఆహా్వనాలు, హాజరు కూడా మొక్కుబడిగానే ఉండటం చూస్తే మనిషికి, బంధాలకు మధ్య దూరం ఏ స్థాయిలో పెరుగుతుందో తెలుస్తోంది. సెల్ఫోన్లతో సరి.. సర్దుబాటు ధోరణి మచ్చుకైనా కనిపించడం లేదు. పక్కోడి నీడను కూడా సహించలేని పరిస్థితి. వయస్సు పెరిగే కొద్దీ సహనం, ఓర్పు కనిపించాల్సి ఉండగా.. అసూయ ద్వేషాలకు పెద్దపీట వేస్తున్నారు. చిన్న చిన్న మాటలకు పట్టింపులకు పోయి బంధాలనే వదులుకోవడం, అసలు వాళ్లతో ఏమి అవసరం ఉందనే భావన అధికమైంది. ఇందుకు సెల్ఫోన్లతో కాలం గడపటం, గంటల కొద్దీ వాటితోనే సావాసం చేయడం ప్రధాన కారణం. ఇంట్లోనే ఉంటున్నా ఎవరూ మాట్లాడుకోకుండా సెల్‌ఫోన్‌పై చేతులు కదుపుతున్నారు. ఫ్రెండ్స్ కలిశామన్న మాటే కానీ చూపంతా సెల్‌ఫోన్ పైనే ఉంటోంది. ఒక్కరు మరణించినా.. పిల్లలు మంచి హోదాలో ఉండాలని తల్లిదండ్రులు ఎంతగానో తపిస్తున్నారు. ఇందుకోసం తమ జీవితాలను ఫణంగా పెడుతున్నారు. పైసాపైసా కూడబెట్టి మరీ భవితకు బాటలు వేస్తున్నారు. తీరా లక్ష్యం చేరుకోగానే.. పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా బతుకుతున్నారు. పిల్లోడు బాగుపడితే చాలనుకొని కొంత కాలం దంపతులు ఇద్దరూ నెట్టుకొస్తున్నా.. వృద్ధాప్యంలో మనోవేదనతో మంచం పడుతున్నారు. ఈ సమయంలో ఇద్దరిలో ఒకరు మరణించిన మరొకరి జీవనం దుర్భరంగా మారుతోంది. మరీ ముఖ్యంగా భార్య మరణిస్తే.. ఆ వెంటనే భర్త కన్నుమూయడం చూస్తే.. పిల్లలు దూరమైతే ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్థమవుతుంది. పిల్లలకు సమయం కేటాయించాలి తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతగా మెలగాలి. మరీ ముఖ్యంగా వారితో గడిపేందుకు సమయం కేటాయించాలి. ప్రతి ఒక్కరూ ఐదు టీలు(టైం, టాక్, ట్రీట్, టచ్, ట్రస్ట్) పాటించాలి. అప్పుడే పిల్లలతో బంధం బలపడుతుంది. తల్లిదండ్రుల స్పర్శ పిల్లలకు సరికొత్త అనుభూతితో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది. నమ్మకం పెంపొందింనప్పుడే కుటుంబ వ్యవస్థ బలపడుతుంది. – సి.జ్యోతిర్మయి, ఫ్యామిలీ కౌన్సిలర్, బిహేవియర్ థెరపిస్ట్, కర్నూలు -
పార్టీలో నువ్వు 5 నిమిషాలు కనబడలేదు.. వాడిని రమ్మన్నావు కదూ! ఈ పెనుభూతం వల్లే
అనుమానం పెనుభూతం. అకారణ అనుమానం ఎదుటివారికి ప్రాణాంతకం. భర్త మంచివాడే.. ఉద్యోగం చేస్తాడు.. కష్టపడతాడు. ఇంటిని పోషించాలనుకుంటాడు. కాని అతనికి తీవ్రమైన అనుమానం ఉంటే? భార్యను విసిగిస్తూ ఉంటే? అదొక మానసిక అవస్థ అని తక్షణమే గుర్తించాలి. ఆత్మీయుల సాయం పొందాలి. వైద్యం అందించాలి. ఇటీవల పత్రికలలో ఈ మానసిక అవస్థతో జరుగుతున్న దుర్ఘటనలు ఇంటిని, ఇంటి మనిషిని కాపాడుకోమని అప్రమత్తం చేస్తున్నాయి. కేస్‌స్టడీ 1: మధు ఆఫీస్ నుంచి హఠాత్తుగా ఇంటికి వచ్చాడు. అప్పటికి ఆమె వంటపనిలో ఉంది. తలుపు తట్టి నేరుగా లోపలికి దూసుకువచ్చాడు. బెడ్రూమ్ అంతా కలియతిరిగాడు. బాత్రూమ్ చూశాడు. కప్‌బోర్డులు వెతికాడు. ‘ఎక్కడ దాచి పెట్టావ్ వాణ్ణి’ అన్నాడు. ఆమె హతాశురాలు కాలేదు. అలా అతణ్ణి చూస్తూ ఉంది. ఈ మధ్య అలాగే చేస్తున్నాడు. ‘చెప్తాను నీ సంగతి’ అని పళ్లు కొరుకుతూ వెళ్లిపోయాడు. ఆమెకు ఏడుపొచ్చింది. కాని ఎన్నిసార్లని ఏడుస్తుంది. ఈ అనుమానం మొగుణ్ణి గతంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు. ఇతను ఇలా తయారవుతాడని కలగందా? ఏం చేయాలి? ఇంటి నుంచి బయటపడి కుటుంబాన్ని డిస్ట్రబ్ చేయడమా? లేదా అతణ్ణి భరించడమా? కేస్ స్టడీ 2: బర్త్‌డే పార్టీ నుంచి ఇంటికి తిరిగొస్తున్నప్పుడు ముభావంగా మారిపోయాడు శివ. భార్య గతుక్కుమంది. అలా మారాడంటే ఏదో అయ్యిందన్నమాటే. ‘ఏమైందండీ’ అడిగింది బైక్ వెనుక నుంచి. ‘పార్టీలో నువ్వు ఐదు నిమిషాలు కనిపించలేదు. ఎవరితో మాట్లాడటానికి వెళ్లావ్’ అన్నాడు. ‘అయ్యో. వాష్‌రూమ్‌కు వెళ్లానండీ’. ‘అంటే వాష్‌రూమ్ దగ్గరకు వాణ్ణి రమ్మన్నావా?’. ‘దేవుడా.. వాడెవడండీ’. ‘అదే... ఆ శ్రీనివాస్గాడు. భోజనాల దగ్గర నీతో మాట్లాడుతున్నాడు కదా’. ‘అయ్యో. నాతో ఏం మాట్లాడలేదండీ. ప్లేట్ అందించాడంతే’. కాని శివ ఏమిటే మిటో అంటున్నాడు. ఇల్లు చేరేవరకూ అంటూనే ఉన్నాడు. చేరాక అన్నాడు. తెల్లార్లూ అన్నాడు. కేస్‌స్టడీ 3: ఆమెకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. భర్త మంచం మీద లేడు. కంగారుగా లేచి చూసింది. హాల్లో ఒక్కడే పడుకుని శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు. ‘ఏంటండీ... ఇక్కడ ఏం చేస్తున్నారు’.... ‘నాకు చచ్చిపోవాలని ఉంది. నేనంటే నీకు ఇష్టం లేదు. అది తెలిసిపోయాక నిన్నేదైనా చేస్తానేమోనని భయంగా ఉంది’ చెప్పి భోరుమన్నాడు. ఆమె భయంతో ఆందోళనతో సతమతమైపోయింది. ‘మీరంటే ఇష్టం లేదని ఎవరు చెప్పారు’. ‘ఒకరు చెప్పాలా... నాకు తెలుసు’. ఆమె నెత్తి కొట్టుకుంది. ∙∙ పారనోయ ‘పారనోయ’ అనేది ఒక మానసిక అనారోగ్యం. ఈ అనారోగ్యం ఉన్నవారికి అనుమానం, అపనమ్మకం, అక్కసు, భ్రాంతి... వంటి రకరకాల భావాలు ఉంటాయి. వీరు అందరిలా నార్మల్‌గానే ఉంటారు. నార్మల్‌గా జీవిస్తున్నట్టుగానే కనపడుతుంటారు కాని ఈ సమస్య ఉంటుంది. వారు ఎవరిని ఆ సమస్యతో ఇబ్బంది పెడుతున్నారో వారికే అది తెలుస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరు చేసే ఆరోపణలు ‘ఏనుగు గాల్లో ఎగురుతుంది’ లాంటివి కావు. ‘ఏవి జరగడానికి ఆస్కారం ఉంటుందో ఆ విషయాల పట్ల వారికి అనుమానం ఉంటుంది’. అంటే ‘భార్యకు మరొకరితో బంధం ఉండే ఆస్కారం ఉంటుంది కనుక అనుమానం ఉంటుంది’. ‘కొలీగ్ తన డెస్క్‌ను చెక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కనుక అనుమానం ఉంటుంది’. ‘పక్కింటివారు తనకు ఏదో హాని చేసే అవకాశం ఉంటుంది కనుక అనుమానం ఉంటుంది’. అంటే జరగగలిగిన వాటి గురించే వీరు వర్రీ అవుతూ ఉంటారు. కాని వాటికి వారి దగ్గర ఆధారాలు ఉండవు. కాని గట్టిగా నమ్ముతుంటారు. ‘నీకు పక్కింటి వ్యక్తితో సంబంధం ఉంది’ అని భార్యతో వాదిస్తారు. ‘లేదు’ అని భార్య వాదించే కొద్దీ వారి అనుమానం బలపడుతుంది. దీనిని నసగా, చాదస్తంగా, పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కానట్టుగా, భరించక తప్పదు అని లోలోపల కుళ్లే విషయంగా చాలామంది భార్యలు భావిస్తుంటారు. అది ప్రమాదం. ఇది ‘మానసిక అనారోగ్యం’ అని గుర్తించాలి. అలా ఎప్పుడైతే గుర్తిస్తామో పరిష్కారం వైపు అడుగులు వేసినట్టు. ప్రమాదం నుంచి దూరం జరుగుతున్నట్టు. లేకపోతే ఈ అవస్థ ముదిరితే నూటికి ఇద్దరు తమకు తాము హాని చేసుకోవడమో ఎదుటివారికి హాని తలపెట్టడమో చేస్తారు. పేపర్లలో ఇప్పుడు చూస్తున్నవి అలాంటి వారి వల్ల జరుగుతున్న ఉత్పాతాలే. ఏం చేయాలి? ►మొదట ఆత్మీయుల మద్దతు తీసుకోవాలి. వైద్యానికి ఒప్పించాలి. ఇలాంటి వ్యక్తులతో ఎలా వ్యవహరించాలో సైకియాట్రిస్ట్‌ల సలహా తీసుకోవాలి. భర్తతో ఈ ఇబ్బంది తప్ప వేరే సమస్య లేదు కనక అతణ్ణి కాపాడుకోవాలి (భార్యల్లో కూడా ఇదే సమస్య ఉంటుంది. ఆమె గురించి కూడా ఇదే వర్తిస్తుంది). ►వాదించకూడదు. భర్త చేసే ఆరోపణలను వాదించవద్దు. ఖండించవద్దు. విని ఊరుకుంటూ ఉండాలి. ►స్నేహంగా, ఓర్పుగా వారితో మాట్లాడాలి. ►ఈ సమస్య ఉన్నవారితో వేగాలంటే ముందు మన మానసిక, శారీరక ఆరోగ్యం దృఢంగా ఉండాలి. ►అందువల్ల మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏమిటి వైద్యం? ►సైకోథెరపీ, బిహేవియరల్ థెరపీ, కాగ్నిటివ్ థెరపీ లాంటివి ఉన్నాయి. ఇరవై ఏళ్ల క్రితం నుంచే మందులూ వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ డ్రగ్స్ ఉన్నాయి. అయితే కొన్ని మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి గమనించుకుంటూ వైద్యుణ్ణి సంప్రదిస్తూ సరైన మందులు ఇస్తూ ఈ అనుమాన భూతాన్ని అదుపులోకి తేవాలి. ►సమస్యను అయినవారితో చెప్పకుండా దాచడం మంచిది కాదు. చెప్తే నవ్వుతారేమో అనుకోకూడదు. ప్రమాదం వచ్చాక అందరూ ఏడ్వడం కన్నా ఇప్పుడు ఒకరిద్దరు నవ్వినా నష్టం లేదు. పరిష్కారం వైపు అడుగు ముందుకు పడటమే ముఖ్యం. చదవండి: Health Tips: పదే పదే గర్భస్రావం కావడానికి అది కూడా ఓ కారణమే! పార్ట్నర్కు సంబంధించి Sitterwizing: పిల్లలతో కూచోండి.. దగ్గరగా చూడండి -
జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022: పిల్లలకు బంధాలు కావాలి
‘ప్రేమలో ఉన్నప్పుడు మనం ఎవ్వరి మాటా వినం. కాని పిల్లలు పుట్టాక అన్నీ మెల్లగా అర్థమవుతాయి. పిల్లలకు బంధాలు కావాలి. తల్లీ తండ్రీ ఇద్దరూ కావాలి. తల్లి తరఫు ఉన్నవారూ తండ్రి తరఫు ఉన్నవారూ అందరూ కావాలి. బంధాలు లేని పిల్లలు చాలా సఫర్ అవుతారు’ అంది నీనాగుప్తా. జీవితం ఎవరికైనా ఒక్కో దశలో ఒక్కోలా అర్థం అవుతుంది. క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో కుమార్తెను కన్న నీనా పిల్లల గురించి చెబుతున్న మాటలు వినదగ్గవి. ఆమె తన ఆత్మకథ ‘సచ్ కహూ తో’ గురించి జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్లో మాట్లాడింది. ‘వివ్ రిచర్డ్స్ (క్రికెటర్)తో నేను ప్రేమలో ఉన్నాను. పెళ్లితో సంబంధం లేకుండా బిడ్డను కనాలని నిశ్చయించుకున్నాను. అప్పుడు ఎందరో మిత్రులు ఎన్నో రకాలుగా నాకు సలహాలు ఇచ్చారు. కాని నేను ఎవ్వరి మాటా వినలేదు. ముందుకే వెళ్లాను. మసాబా పుట్టింది. కాని సింగల్ పేరెంట్‌గా పిల్లల్ని పెంచడం చాలా చాలా కష్టం. ఆ విధంగా నేను మసాబాకు అన్యాయం చేశాను అని ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తూ ఉంటుంది. పిల్లలకు బంధాలు కావాలి. తల్లిదండ్రులు ఇద్దరూ కావాలి. వారి వైపు ఉన్న అమ్మమ్మలు, తాతయ్యలు, బంధువులు అందరూ కావాలి. మసాబాకు ఆ విధంగా తండ్రి వైపు నుంచి పెద్ద లోటును మిగిల్చాను’ అంది నటి నీనా గుప్తా. ఆమె రాసిన ‘సచ్ కహూ తో’ ఆత్మకథ మార్కెట్లో ఉంది. దాని గురించి మాట్లాడటానికి ఆమె ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’కు హాజరయ్యింది. ‘మాది తిండికి హాయిగా గడిచే కుటుంబం. కాని మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. దాని వల్ల పిల్లలుగా మేము ఎదుర్కొన్న ఇబ్బంది పెద్దగా లేకపోయినా మా అమ్మ చాలా సతమతమయ్యేది. ఆమె బాధ చూసి నాకు చాలా బాధ కలిగేది. బాల్యంలో అలాంటి ప్రభావాలు గాఢమైన ముద్ర వేస్తాయి’ అందామె. నీనా గుప్తా నటిగా పూర్తిగా నిలదొక్కుకోని రోజులవి. హటాత్తుగా వివ్ రిచర్డ్స్‌తో గర్భం దాల్చాను అని పత్రికలకు చెప్పి సంచలనం సృష్టించింది. 1989లో కుమార్తె మసాబాకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె ప్రస్థానం ఎలా ఉంటుందో అని చాలా మంది ఆందోళనగా, కుతూహలంగా గమనించారు. ఇప్పుడు ఆమె నటిగా, కుమార్తె ఫ్యాషన్ డిజైనర్‌గా సక్సెస్‌ను చూస్తున్నారు. కాని ఈలోపు ఎన్నో జీవితానుభవాలు. ‘మసాబాను నెలల బిడ్డగా ఇంట్లో వదిలి నేను పనికి వెళ్లాల్సి వచ్చేది. ఒక్కోసారి షూటింగ్‌కి కూడా తీసుకెళ్లి షాట్‌కు షాట్‌కు మధ్యలో పాలు ఇచ్చేదాన్ని. ఆమె రంగు, రూపం... వీటిని చూసి పిల్లలు కామెంట్లు చేసేవారు. తండ్రి కనిపించేవాడు కాదు. నా కూతురుకు ఏది ఎలా ఉన్నా ‘యూ ఆర్ ది బెస్ట్’ అని చెప్తూ పెంచుకుంటూ వచ్చాను. కాని మనం ఎంత బాగా పెంచినా బంధాలు లేకుండా పిల్లలు పెరగడం ఏమాత్రం మంచిది కాదని చెప్పదలుచుకున్నాను’ అందామె. అలాగే ఒంటరి స్త్రీని సమాజం ఎంత అభద్రతగా చూస్తుందో కూడా ఆమె వివరించింది. ‘సింగిల్ ఉమెన్‌గా ఉండటం వల్ల నేను ఇబ్బంది పడలేదు కానీ నా వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. ఏదైనా పార్టీకి వెళ్లి ఏ మగాడితోనైనా ఐదు నిమిషాలు మాట్లాడితే ఆ మగాడి భార్య తుర్రున పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వచ్చేసేది. సింగిల్ ఉమెన్ అంటే పురుషులను వల్లో వేసుకునేవారు అనే ఈ ధోరణి అన్యాయం’ అని నవ్వుతుందామె. స్త్రీలను వారి దుస్తులను బట్టి జడ్జ్ చేయడం అనే మూస నుంచి బయడపడాలని నీనా గట్టిగా చెబుతుంది. ‘నేను ఢిల్లీలో ఎం.ఏ సంస్కృతం చదివాను. కాలేజ్‌కు చాలా మోడ్రన్ బట్టలు వేసుకుని వెళ్లేదాన్ని. సంస్కృతం చదువుతూ ఇలాంటి బట్టలు వేసుకుని వస్తుంది ఏమిటి అని ఏ ఆడపిల్లా నాతో మాట్లాడేది కాదు. నేను ఆ పక్కనే ఉండే మరో కాలేజ్‌కు వెళ్లి క్యారెమ్స్ ఆడుతూ కూచునేదాన్ని. చివరకు ఫస్ట్ ఇయర్లో నాకు మంచి మార్కులు రావడం చూసి అందరూ నాకు ఫ్రెండ్స్ అయ్యారు’ అందామె. ఇంకో ఉదాహరణ కూడా చెప్పింది. ‘ముంబైలో నా కెరీర్ మొదలులో రచయిత గుల్జార్, నేను రోజూ బాడ్మింటన్ ఆడటానికి కారులో వెళ్లేవాళ్లం. ఇద్దరం షార్ట్స్ వేసుకుని పక్కపక్కన కూచుని వెళ్లేవాళ్లం. ఇన్నేళ్ల తర్వాత మొన్న నేను షార్ట్స్‌లో ఆయన ఇంటికి వెళ్లి నా ఆత్మకథ కాపీ అందించాను. అది నెట్లో చూసి ‘హవ్వ.. గుల్జార్ గారిని కలవడానికి వెళ్లి ఈ వయసులో షార్ట్స్ వేసుకుంటావా’ అని ట్రోలింగ్. అరె.. ఏమిటిది? ఎండగా ఉంది వేసుకున్నాను... లేదా కాళ్లు బాగున్నాయని వేసుకున్నాను. మీకేంటి నొప్పి’ అంటుందామె. నీనా గుప్తాకు నటిగా ఎంత ప్రతిభ ఉన్నా ఆమెకు కమర్షియల్ సినిమాల్లోకాని పార్లల్ సినిమాల్లో కాని లీడ్ రోల్స్ రాలేదు. ‘షబానా ఆజ్మీ తన సినిమాల్లో వేసిన పాత్రలన్నీ వేయాలని నాకు ఉంటుంది. ఆర్ట్ సినిమాల్లో కూడా అన్నీ హీరోయిన్ పాత్రలు షబానా, స్మితా పాటిల్, దీప్తికి దక్కాయి. అది నాకు బాధే. కాని ఇప్పుడు నేను లీడ్ రోల్స్ చేసి హిట్స్ కొడుతున్నాను. అది ఆనందం’ అంటుందామె. నీనా గుప్తా అమెరికాలో తీస్తున్న ఒక బాలీవుడ్ సినిమాలో తెలుగు పనిమనిషిగా నటిస్తోంది. ఆమె నటించిన ‘పంచాయత్’ వెబ్ సిరీస్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ‘స్త్రీలుగా మీరు ఏ విషయంలోనూ చిన్నబుచ్చుకోకండి. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. అది గమనించుకుని యూ ఆర్ ది బెస్ట్ అనుకోండి. అదే మీ సక్సెస్‌మంత్ర’ అందామె. ఆమె నిజమే చెబుతోంది. అందుకే ఆమె పుస్తకం పేరు ‘సచ్ కహూ తో’. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
అతడు ఆమె ఫోన్
స్త్రీ పురుష సంబంధాలు ఎంత ఆకర్షణీయమైనవో అంత లోతైనవి. సామాజిక సూత్రాలకు, నైతిక విలువలకు ఎడంగా జరిగి స్త్రీ పురుషుల మధ్య బంధం ఏర్పడితే అది ఏ ఒడ్డుకు చేరుస్తుందో చెప్పలేము. ఆగి, ఆలోచించుకునే వాస్తవిక స్పృహ ఇవ్వకుండా స్త్రీ పురుషుల అనంగీకార అనుబంధాలకు ఎడతెగని వాహికగా ఉంటున్న స్మార్ట్ ఫోన్ మన జీవితాలను ఎటు తీసుకెళుతోంది అని కూడా ఆలోచింపచేస్తున్న సినిమా ‘గెహరాయియా’. అమేజాన్‌లో తాజా విడుదల. స్త్రీ, పురుషులు ఒకరికొకరు కట్టుబడి ఉండటం ఈ సమాజం కొన్ని వందల ఏళ్లుగా ఏర్పరుచుకున్న విలువ. ఆ విలువకు బయట జరిగి ‘అనంగీకార’ అనుబంధాలకు వెళ్లిన జంటలు ఎక్కువగా కష్టాలనే ఎదుర్కొన్నారు, సమాజపు దృష్టిలో దోషులుగానే నిలుచున్నారు. భారతీయ సమాజంలో అయితే ప్రేమలోగాని, వివాహంలోగాని జీవిత భాగస్వామిని వంచన చేసి మరొకరితో బంధంలో ఉండటం పూర్తి అనైతికంగా పరిగణించబడుతుంది. కాని ఎల్లకాలం ఎల్లవేళలా ఇరుపక్షాల మనసు అన్ని రకాల కట్టుబాట్లకు లొంగదు. అది ఒక్కోసారి ‘ఇదే నాకు కావలసింది’ అనుకుంటుంది. ‘ఉన్నది సరి కాదు... ఇది సరిౖయెనది’ అనుకుంటుంది. ‘ఉన్నది ఉండగా... ఇది కూడా ఉంటే ఏమవుతుంది?’ అనుకోనూవచ్చు. ‘ఇది ఒక చిన్న సరదా... ఎవరికి తెలుస్తుందిలే’ అని భావించవచ్చు. స్త్రీ, పురుషుల అంచనాలు కేవలం అంచనాలు మాత్రమే. ఒకసారి రంగంలోకి దిగాక పరిణామాలు అంచనాలకు తగినట్టుగా ఉండవు. సంక్షోభాలు తెచ్చిపెడతాయి. అశాంతి, ప్రమాదం, హింస, పగ, పరారీ... ఏమైనా జరగొచ్చు. ఒకప్పుడు ఈ పరిణామాలు వేగంగా జరిగే అవకాశం తక్కువ కమ్యూనికేషన్ పరిమితుల వల్ల. ఇవాళ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. అది అనుక్షణ ప్రసారానికి సంభాషణకి వీలు కల్పిస్తోంది. దీని వల్ల ఎలాంటి మంచి జరుగుతున్నదో కాని పత్రికలలో చెడు పరిణామాల వార్తలే చూస్తూ ఉంటాం. ఈ సినిమా కథ ఏమిటి? రెండు జంటలు. దీపికా పడుకోన్– ధైర్య కరవా... సిద్ధాంత్ చతుర్వేది– అనన్యా పాండే. రెండు జంటలూ లివ్ ఇన్ రిలేషన్లో ఉంటాయి. రెండు జంటలూ పెళ్లి ఆలోచనల్లో కూడా ఉంటాయి. దీపికా యోగా ఇన్స్ట్రక్టర్. ఆమె బాయ్‌ఫ్రెండ్ ధైర్య కరవా రచయితగా స్ట్రగుల్ అవుతుంటాడు. అనన్యా పాండే శ్రీమంతురాలు. ఆమె బోయ్‌ఫ్రెండ్ సిద్ధాంత్ చతుర్వేది కార్పొరేట్ దిగ్గజం. దీపికా, అనన్యా కజిన్స్ అవుతారు కనుక ఈ నలుగురూ చాలా రోజుల తర్వాత కలుస్తారు. అది కూడా అత్యంత విలాసవంతమైన చిన్న పడవ మీద... సముద్రంలో ప్రయాణిస్తూ. కాని దీపికా పట్ల సిద్ధాంత్ ఆకర్షితుడవుతాడు. ఇద్దరూ తమ లివ్ ఇన్ పార్ట్నర్లను చీట్ చేస్తూ రిలేషన్లోకి వెళతారు. తాను చేస్తున్న వెంచర్ పూర్తయితే దానికి అందాకా ఆర్థికంగా మద్దతుగా ఉంటున్న అనన్యతో తెగదెంపులు చేసుకుని నిన్ను పెళ్లి చేసుకుంటాను అని దీపికతో చెబుతాడు సిద్ధాంత్. వారిద్దరూ అలాంటి అంచనాతో తమ రహస్య బంధాన్ని కొనసాగిస్తారు. కాని అంచనా తప్పుతుంది. సిద్ధాంత్ వెంచర్ నిధుల గోల్‌మాల్‌లో మునుగుతుంది. మరోవైపు దీపిక గర్భవతి అవుతుంది. ఇంకో వైపు అనన్యకు తన బోయ్‌ఫ్రెండ్ ఎవరితోనైనా అఫైర్‌లో ఉన్నాడా అని అనుమానం వస్తుంది. ప్రేమ, రిలేషన్ ఉండాల్సిన చోట ఊపిరాడనితనం, అసహనం, దీని నుంచి ఎలాగైనా బయటపడాలన్న క్రైమ్ ఆలోచనలు... అన్నీ ఈ ‘రహస్యం’గా ఉంచాల్సిన ‘బంధం’ వల్ల ఏర్పడతాయి. స్త్రీ పురుషులు తమ పాత బంధాల నుంచి ఓపెన్‌గా, చట్టబద్ధంగా విడిపోయి కొత్త బంధాల్లోకి వెళ్లొచ్చు. కాని ఉన్న బంధాల్లో ఉంటూ రహస్య బంధం కొనసాగించాల్సి వచ్చినప్పుడు, లేదా ఉన్న బంధాన్ని సరిగ్గా ముగించకుండా కొత్త బంధాల్లో మునిగినప్పుడు పరిణామాలు భయానకం అవుతాయి. ఈ సినిమా కూడా అలాగే ముగుస్తుంది. పైపై ఆకర్షణల లోతు ఎంత అగాధంగా ఉంటుందో ‘గెహరాయియా’ (అగాధాలు) చెబుతుంది. ఫోన్ ఒక పాత్రధారి ఫోన్ ఒక కమ్యూనికేషన్ మాధ్యమం. అదే సమయంలో ఇవాళ స్త్రీ,పురుష బంధాలకు ఒక ప్రధాన వాహిక. ఒకప్పుడు అబ్బాయి. అమ్మాయిల ప్రేమ దగ్గరి నుంచి వివాహేతర రహస్య బంధాల వరకూ కమ్యూనికేషన్ ఒక దుస్సాధ్యంగా ఉండేది. కాని స్మార్ట్‌ఫోన్ వల్ల ఆ సమస్య అవసరమైన దాని కంటే ఎక్కువే అయిందని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. ఇందులో సినిమా అంతా పాత్రలు మాట్లాడినంత ఫోన్ మాట్లాడుతుంది. దీపిక, సిద్ధాంత్‌ల మధ్య రహస్య బంధం పూర్తిగా వాట్సప్ చాట్ వల్ల బలపడుతుంది... ముందుకు పోతుంది... చివరకు విషాద పరిణామమూ తీసుకుంటుంది. బంధం ఏర్పడేంత వరకూ ‘కిక్’ ఇచ్చే వాట్సప్ సంభాషణలు బంధం ఏర్పడ్డాక ‘అనుక్షణం వెంటాడే’ సంభాషణలుగా మారతాయి. స్త్రీగాని, పురుషుడు గాని ఇంట్లో ఉన్నా, ఆఫీస్‌లో ఉన్న ఈ ఎడతెగని చాటింగ్ ‘మతి’ని గతి తప్పేలా చేస్తున్నదేమోనని ఈ సినిమా చూస్తే అనిపిస్తుంది. డిస్ట్రబ్ చేసే మూవీ వివాహేతర బంధాలు ఎంత డిస్ట్రబ్ చేస్తాయో అంత డిస్ట్రబ్ చేసే మూడ్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. దర్శకుడు షకున్ బాత్ర ఆ జాగ్రత్త తీసుకున్నాడు. కాని ఒక విలువను ఆపాదించడం లేదా ఆరోగ్యకరమైన అర్థవంతమైన ముగింపును ఇవ్వకపోవడంతో ప్రేక్షకుడికి ఒక డిస్ట్రబెన్స్ భావన మాత్రమే కలుగుతుంది. ఉన్న బంధాలు అన్నీ ఏవో కొద్ది ఇష్టాయిష్టాలతోనే ఉంటాయి. సమస్యలు లేని బంధాలు ఉండవు. అవి మరీ ఘోరంగా ఉంటే కొత్తబంధాల్లోకి వెళ్లడం పట్ల సమాజానికి అభ్యంతరం ఉండదు. కాని దూరపు కొండలు నునుపు అనే భావనతో బాధ్యతలు అధిగమించే ఆకర్షణల్లో పడటం పట్ల మాత్రం ఈ సినిమా కచ్చితంగా ఒక హెచ్చరికే. దీపిక మంచి నటనకు ఈ సినిమా చూడొచ్చు. లేదంటే చదివిన ఈ రివ్యూ సరిపోతుంది. -
నీ అనురాగం... ఎన్నో జన్మల పుణ్యఫలం
‘ఓ అన్నా... నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం’... ఈ పాట ప్రతి రాఖీ పండక్కీ వినిపిస్తుంది. ఇళ్లల్లో అన్నదమ్ములకు జరక్కపోయినా చెల్లెళ్లకు ముద్దు మురిపాలు జరుగుతాయి. తండ్రో లేకుంటే అన్నయ్యలో ఆమెను భుజాల మీదకు ఎక్కించుకుని ఆడిస్తారు. తల్లి కోపగించాలని చూసినా గారం చేసి వెనకేసుకు వస్తారు. తండ్రి, అన్నదమ్ముల ప్రేమ పొందిన చెల్లెలు తన జీవితంలో భర్తగా వచ్చే పురుషుడి నుంచి కూడా అలాంటి ప్రేమనే ఆశిస్తుంది. అక్కడ ఏదైనా లోటు జరిగితే అన్నదమ్ముల తోడ ఆ లోటును పూడ్చుకుందామని చూసుకుంటుంది. ఒకప్పటి కాలంలో ఆమె పురుషుల మీద ఆధారపడే స్త్రీ అయినా నేడు ఆర్థికంగా, వ్యక్తిత్వపరంగా స్వతంత్రతను, ఉనికిని చాటుతున్నా అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే అనురాగంలో ఎటువంటి మార్పూ ఉండదు. ఉండబోదు. వారు కలిసి పెరిగారు. కలసి బాల్యం పంచుకున్నారు. వారు ఒకరికొకరు తెలిసినట్టుగా మరొకరికి తెలియరు. అందుకే ఆపద వస్తే చెల్లెలు ‘అన్నా’ అంటుంది. అన్న ఉలికిపాటుకు గురైతే చెల్లెలు హాజరవుతుంది. మేనమామ, మేనత్తలుగా ఈ అన్నాచెల్లెళ్లు పిల్లలకు ప్రియ బంధువులవుతారు. అపురూపమైన మానవ బంధాల నిర్మాణం ఇది. చందురుని మించు అందమొలికించు ఎన్టీఆర్, సావిత్రి అన్నాచెల్లెళ్లా అని జనం అనుకున్నారుగాని వారిద్దరూ ‘రక్తసంబంధం’లో అన్నాచెల్లెళ్లుగా చిరకాలం గుర్తుండిపోయే నటనను ప్రదర్శించారు. ఆ అన్నకు చెల్లెలి కోసం సర్వస్వం వదులుకునేంత ప్రేమ. ఆ చెల్లెలికి ఆ అన్న కోసం ప్రాణమే ఇచ్చే పాశం. అబ్బ... ఆ అవినాభావ బంధం చాలా ఉద్వేగపూరితమైనది. ఇదే ఎన్.టి.ఆర్ ‘చిట్టిచెల్లెలు’లో వాణిశ్రీ కోసం ఏడ్చి ఏడ్చి మనకు ఏడుపు తెప్పిస్తాడు. ‘అందాల పసిపాప అన్నయ్యకు కనుపాప’.. అన్నాచెల్లెళ్ల పాటల్లో కంటిపాప వంటి పాట. అక్కినేని ‘బంగారు గాజులు’లో విజయనిర్మలతో ఈ అనుబంధాన్ని గొప్పగా పండించాడు. ‘అన్నయ్య సన్నిధి... అదే నాకు పెన్నిధి’ పాటలో అన్నగా ఆయనను చూడాలి. శోభన్‌బాబు ‘చెల్లెలి కాపురం’ సినిమా చెల్లెలి సెంటిమెంట్ వల్లే హిట్. ఆయన నటించిన ‘శారద’ సినిమాలో శారదకు అన్నయ్యగా కైకాల సత్యనారాయణ నటించి విలన్ నుంచి పూర్తి స్థాయి కేరెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. ‘కానిస్టేబుల్ కూతురు’లో జగ్గయ్య, కృష్ణకుమారి అన్నాచెల్లెళ్లుగా నటించారు. చెల్లెల్ని ఆట పట్టిస్తూ జగ్గయ్య పి.బి.శ్రీనివాస్ గొంతుతో పాడే ‘చిగురాకుల ఊయలలో ఇల మరచిన ఓ చిలుకా’ చాలా బాగుంటుంది. పగ–ప్రతీకారాల దశాబ్దం 1980లు వచ్చే సరికి తెలుగు సినిమాలో చెల్లెలి పాత్ర పరమ స్టీరియోటైప్‌గా మారింది. హీరోకు చెల్లెలు ఉంటే చాలు ఆమె విలన్ బాధలకు బలి అవనున్నదని ప్రేక్షకులకు తెలిసిపోయేది. ఈ పిచ్చి సినిమాల మధ్య కూడా ‘చట్టానికి కళ్లులేవు’లాంటి చిత్రాలు వచ్చాయి. ఇందులో అక్కగా లక్ష్మి, తమ్ముడిగా చిరంజీవి ఘర్షణతో కూడిన బంధంలో కనిపిస్తారు. ఎన్.టి.ఆర్ ‘డ్రైవర్ రాముడు’లో అంధురాలైన తన చెల్లి రోజా రమణితో ‘ఏమని వర్ణించను’ పాట పాడతాడు. తమిళం నుంచి బాపు రీమేక్ చేసిన ‘సీతమ్మ పెళ్లి’లో మోహన్‌బాబు బహుశా తన గొప్ప పెర్ఫార్మెన్స్లలో ఒకటిగా నటించాడు. ఇందులోనే ‘తల్లివైనా చెల్లివైనా’ పాట ఉంది. కొంచెం కాలం ముందుకు నడిస్తే చిరంజీవి తన ‘లంకేశ్వరుడు’లో చెల్లెలి సెంటిమెంట్‌ను చూపడానికి ప్రయత్నించాడు. ఆ సినిమా పని చేయకపోయినా నలుగురు చెల్లెళ్లతో ఆ తర్వాత నటించిన ‘హిట్లర్’ సెకండ్ ఇన్నింగ్స్‌ను చాన్స్ ఇచ్చింది. బాలకృష్ణ ‘ముద్దుల మావయ్య’ సినిమాలో ‘మావయ్య అన్న పిలుపు’ పాట పాడి పెద్ద ఎత్తున హిట్ కొట్టాడు. కృష్ణంరాజు, రాధిక అన్నాచెల్లెళ్లుగా నటించిన ‘పల్నాటి పౌరుషం’ గట్టి కథాంశమే అయినా అంతగా ఆడలేదు. పూర్ణిమ, శివకృష్ణలతో వచ్చిన పరుచూరి రచన ‘ఆడపడుచు’ పెద్ద హిట్ అయ్యింది. నీ పాదం మీద పుట్టుమచ్చనై... ఆ సమయంలోనే గద్దర్ రాసిన ‘మల్లెతీగకు పందిరివోలే’ పాట ‘ఒరేయ్ రిక్షా’ సూపర్‌హిట్ కావడానికి ముఖ్యకారణంగా మారింది. 1995లో వచ్చిన ఈ సినిమా ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా... తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’ అనే గొప్ప లైన్‌ను ఇచ్చింది. అయితే ఈ సమయంలోనే వచ్చిన ‘తొలిప్రేమ’ సినిమా చెల్లెలి పాత్రను చాలా కొత్తగా చూపించింది. ఇందులో పవన్‌కల్యాణ్, వాసుకి మధ్య సన్నివేశాలు గొప్పగా పండాయి. 2000 సంవత్సరం తర్వాత కాలం మారినా చెల్లెలి బంధం మారదు. సినిమాలూ ఆ కథను ఎంచుకోక మానలేదు. ‘పుట్టింటికిరా చెల్లి’ వంటి పాతవాసన వేసే టైటిల్ పెట్టి సినిమా తీస్తే సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. అర్జున్, స్వప్నమాధురి అద్భుతంగా నటించారు. మహేశ్‌బాబు ‘అర్జున్’లో అక్క కీర్తి రెడ్డిని కాపాడుకునే తమ్ముడిగా గొప్పగా నటించాడు. పవన్ కల్యాణ్ ‘అన్నవరం’ చెల్లెలి రక్షణకు వేట కొడవలి పట్టిన అన్నను చూపిస్తుంది. కృష్ణవంశీ ‘రాఖీ’ అనే టైటిల్ పెట్టి మరీ ప్రతి మగవాడు స్త్రీలను సోదరుడిలా చూసుకోవాలనే సందేశంతో హిట్ కొట్టాడు. జూనియర్ ఎన్.టి.ఆర్కు ఆ సమయంలో అవసరమైన హిట్ అది. ఇక రాజశేఖర్, మీరా జాస్మిన్ నటించిన ‘గోరింటాకు’ గొప్ప కరుణరసం పండించి అన్నాచెల్లెళ్ల బంధానికి తిరుగులేదని నిరూపించింది. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకునే ఈ రాఖీ పండగ నాడు ఆ సెంటిమెంట్‌ను పండిస్తూ తీసిన, నటించిన తెలుగు సినిమా వారికి కూడా శుభాకాంక్షలు చెబుదాం. చెల్లెలి క్షేమం కోరుకోని అన్న అన్న శ్రేయస్సు కాంక్షించని చెల్లెలు ఉండరు. తల్లిదండ్రులు ఉన్నా గతించినా తల్లి అంశ చెల్లిలో తండ్రి అంశ అన్నలో చూసుకుంటారు పరస్పరం అన్నాచెల్లెళ్లు. అది రక్తసంబంధం. యుగాలుగా ఏర్పడింది. యుగాంతం వరకూ ఉంటుంది. అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే భావోద్వేగాలు ఎన్నో సినిమా కథలయ్యాయి. పాటలయ్యాయి. అవుతూనే ఉంటాయి. రాఖీ సందర్భంగా కొన్నింటిని గుర్తు చేసే ప్రయత్నం ఇది. -
డబ్ల్యూహెచ్ఓతో అమెరికా కటీఫ్
వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)తో తెగదెంపులు చేసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచాన్ని ఆ సంస్థ తప్పుదోవ పట్టించిందనీ, వైరస్ విషయంలో చైనాను బాధ్యునిగా చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ‘కోవిడ్ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని మేం చేసిన వినతిని డబ్ల్యూహెచ్ఓ పట్టించుకోలేదు. డబ్ల్యూహెచ్ఓకు అత్యధికంగా 45కోట్ల డాలర్ల నిధులు సమకూర్చుతుండగా చైనా 4కోట్ల డాలర్లిచ్చి పెత్తనంచేస్తోంది. డబ్ల్యూహెచ్ఓ ముందుగానే అప్రమత్తం చేసి ఉంటే, చైనా నుంచి ప్రయాణాలపై నిషేధం విధించి ఉండేవాడిని. చైనా ఒత్తిడి వల్లే అలా చేయలేదు. అందుకే ఆ సంస్థతో సంబంధాలు తెంచుకుంటున్నాం’అని తెలిపారు. ‘కోవిడ్‌తో అమెరికాలో లక్ష ప్రాణాలు బలయ్యాయి. వైరస్ తీవ్రతను చైనా దాచిపెట్టడంతో అది ప్రపంచంలో లక్షలమరణాలకు కారణమైంది’అంటూ చైనాపై మండిపడ్డారు. కొందరు చైనా జాతీయుల ప్రవేశంపై నిషేధంతోపాటు చైనీయులు పెట్టుబడులపై ఆంక్షలను మరింత కఠినతరం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. హాంకాంగ్‌పై పట్టు సాధించేందుకు ఇటీవల చైనా తీసుకువచ్చిన చట్టంపై ఆయన మండిపడ్డారు. దశాబ్దాలుగా ఏ దేశమూ చేయనంతగా అమెరికాను చైనా దోచుకుందని తీవ్రంగా ఆరోపించారు. చైనాతో సంబంధాల విషయంలో జరుగుతున్న పరిణామాలు తీవ్ర విచారం కలిగిస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘కరోనా పుట్టుక విషయంలో దర్యాప్తునకు సహకరించాలని చైనాను కోరాం. కానీ, తిరస్కరించింది. తమ దేశంలో కోవిడ్‌ను కట్టడి చేసుకున్న చైనా.. ఇతర దేశాలకు పాకకుండా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రపంచమంతా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది’అని విమర్శించారు. -
ఆల్రెడీ పెళ్లైన వారితో ప్రేమలో పడకండి: నటి
ఒక మహిళ.. అమ్మ అని పిలుపుకై పడే ఆరాటం వర్ణనాతీతం. కానీ పెళ్లయ్యాక అమ్మ అని పిలిపించుకోవడం వేరు. పెళ్లికి ముందే తల్లి కావడం వేరు. అలా పెళ్లికి ముందే తల్లై సమాజంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు బాలీవుడ్ నటి నీనా గుప్తా. డేటింగ్ అంటే ఏంటో తెలియని రోజుల్లోనే వెస్ట్ ఇండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగారు. ఫలితంగా పెళ్లి కాకుండానే 1989లో కూతురికి జన్మనిచ్చారు. ఆమే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా. కానీ కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయి వేర్వేరుగా వివాహాలు చేసుకున్నారు. (ఆ విషయం విని షాక్ అయ్యా!) తాజాగా ఆమె తన జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకున్న గుణపాఠాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఏదేమైనా సరే కానీ, వివాహితుడితో మాత్రం ఎలాంటి సంబంధం పెట్టుకోకండని సూచించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘అతను తన భార్య అంటే ఇష్టం లేదంటాడు. ఇంకా ఎంతోకాలం కలిసి ఉండలేం అని చెప్తాడు. అది నిజమేనని నమ్మి నువ్వు అతన్ని గాఢంగా ప్రేమిస్తావు. నీ భార్యతో ఇంకెప్పుడు విడిపోతావని పోరాడితే దానికింకా సమయం ఉందని చెప్పి దాటవేస్తాడు. ఎప్పటికైనా నీవాడే అవుతాడని కలలు కంటూ అతన్ని రహస్యంగా కలుస్తూ, షికార్లకు తిరుగుతూ, రాత్రిళ్లు ఏకాంతంగా గడుపుతూ ఇలా అన్నింటికీ ఒప్పుకుంటావు. అలా చాలారోజులు గడిచిపోతాయి. మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చి.. త్వరగా నీ భార్యకు విడాకులిచ్చేస్తే మనం పెళ్లిపీటలెక్కవచ్చు అని ఆతృతగా చెప్తావు. ('అది నీ సినిమా అని ఎలా చెప్పుకుంటావ్?') కానీ ఈసారి అతను కాస్త కటువుగా.. తర్వాత చూద్దాంలే, అయినా విడాకులు అంత సులువు కాదు అంటూ ఏవేవో కుంటిసాకులు చెప్తూ మాట మార్చేస్తాడు. అప్పుడు అసలు నిజం ఏంటో నీకు గోచరిస్తుంది. కానీ ఆ సమయానికి నువ్వు ఏకాకిగా మారుతావు, ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో చిక్కుకుంటావు. చివరాఖరకు అన్ని విధాలా ఆలోచించి నువ్వు ప్రేమించిన వ్యక్తికి దూరమయ్యేందుకే సిద్ధపడుతావు. నా జీవితంలోనూ సరిగ్గా ఇలాంటిదే జరిగింది. ఆ సమయంలో ఎంతో వేదన అనుభవించా. అందుకే చెప్తున్నా.. దయచేసి ఎవరూ అలాంటి పిచ్చిపనులు చేయకండి. పెళ్లైన వ్యక్తితో అస్సలు ప్రేమలో పడకండి’ అంటూ సలహా ఇచ్చారు. (టాలెంట్‌కు వయసుతో సంబంధమేముంది : నీనా గుప్తా) View this post on Instagram #sachkahoontoe A post shared by Neena ‘Zyada’ Gupta (@neena_gupta) on Mar 2, 2020 at 1:51am PST -
మీ బంధం కలకాలం నిలబడాలంటే..
ప్రేమ, పెళ్లి.. ఏదైనా కావచ్చు! ఇష్టంతో ఓ ఇద్దరు వ్యక్తులు బంధంలో అడుగుపెట్టడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. కానీ, ఆ బంధాన్ని కలకాలం నిలబెట్టుకోవటానికి మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. వేరువేరు మనస్తత్వాల్తో, ఆలోచనల్తో బంధాన్ని ఏ గొడవల్లేకుండా కొనసాగించటం మామూలు విషయం కాదు. ఏదో ఒక చిన్న విషయానికి నిత్యం తగాదా పడే జంటలు కోకొల్లలు. వారు తమ అహాలను సంతృప్తి పరుచుకోవటానికి దెబ్బకు దెబ్బ అన్నట్లు ఆలోచిస్తారే తప్ప ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాల గురించి ఆలోచించరు. అయితే అలాంటి వారు కొన్ని సూత్రాలను పాటిస్తే బంధానికేమీ బీటలు బారవు. 1) భావోద్వేగపూరిత బంధం బంధం కలకాలం కలతలు లేకుండా కొనసాగటానికి వ్యక్తుల మధ్య నిరంతరం భావోద్వేగాలు కొనసాగుతుండాలి. కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్లుగా ప్రేమ ఉండకూడదు. రోజులు గడుస్తున్న కొద్ది ప్రేమ బలహీన పడకుండా మరింత బలపడాలి. ఎమోషనల్‌గా వ్యక్తులు దగ్గరగా లేనపుడు వారి మధ్య భౌతికంగా కూడా దూరం పెరుగుతుంది. 2) పాజిటివ్ ఆలోచనలు జంట మధ్య ఎల్లప్పుడు అనుకూల వాతవరణం ఉండాలి. అలాలేని జంటల బంధం తొందరగా బలహీనపడుతుంది. గొడవలు జరిగినపుడు వెంటనే సర్దుకుపోగలగాలి. అహాలను పక్కన పెట్టి ముందకు సాగాలి. గొడవలకు గల కారణాలను అన్వేషించాలి. తరచూ తగాదాలకు దారి తీస్తున్న విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో మనం ఇచ్చే కాంప్లిమెంట్స్ కూడా ఎదుటి వ్యక్తికి ఎంతో ఉత్సాహాన్నిస్తాయి. అవి మనకు వారిపై ఉన్న ప్రేమను, ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తాయి. 3) మనసు కాదు బుద్ధి ముఖ్యం మనసుతో కాకుండా బుద్ధితో ఆలోచించగలిగే జంటలే ఎక్కువ సంతోషంగా ఉంటున్నాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఇందులో ఒకర్ని ఒకరు అర్థం చేసుకోవటం అన్న విషయానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ సృష్టిలో లోపాలు లేని మనిషంటూ ఉండడు. భాగస్వామిలో కూడా మనకు నచ్చని గుణాలు ఉండవచ్చు. అయితే వాటి విషయంలో సర్దుకు పోవటం అన్నది చాలా అవసరం. భాగస్వామిలోని కొన్ని అవలక్షణాల గురించి పట్టించుకోకపోటమే మన మనసుకు, శరీరానికి, బంధానికి మంచిది. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
మీ పార్టనర్‌తో గొడవ పడ్డారా ?
రిలేషన్షిప్లో ఉన్నపుడు గొడవలు రావడం సర్వసాధారణం. అయితే ఈ చిన్న గొడవలు బంధాన్ని మరింతగా పటిష్టం చేస్తాయని అమెరికాలో చేసిన తాజా సర్వేలో వెల్లడైంది. అదే నిజమట.... నమ్మలేకపోతున్నారా ? గొడవ పడేవారే సంతోషంగా ఉన్నారు... క్రూషియల్ కన్వెర్జేషన్ అనే పుస్తక సహ రచయిత జోసెఫ్ గ్రెన్నీ ఈ విషయాన్ని కనుగొన్నారు. దీనికై రిలేషన్షిప్లో ఉన్న 1000 మందిని ఆయన ఎంచుకొని సర్వే నిర్వహించారు. గొడవ పడే జంటలు ఇతరులతో పోలిస్తే పది రెట్లు ఆనందంగా ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. వీరు తమ పార్ట్నర్లో నచ్చని విషయాలను వెంటనే చెబుతారని అందుకే తరచూ గొడవ పడతారని ఆయన అన్నారు. సెన్సిటివ్ విషయాలను సైతం వారు పంచుకొని చర్చించుకుంటున్నారని, మిగిలిన జంటలు తమ సమస్యలను పార్ట్నర్కు తెలియకూడదు అనుకుంటున్నారని అందుకే సంతోషంగా లేరని సర్వేలో వెల్లడైంది. అలాగే తమ రిలేషన్షిప్ ముగిసి పోకూడదని కొన్ని విషయాలలో మౌనంగా ఉండడం వల్ల సంతోషం దూరమౌతోందని తేలింది. పొరపాటు ఎక్కడ జరుగుతోంది... తమను ఇబ్బందికి గురిచేస్తున్న, తమకు నచ్చని విషయాలను పార్టనర్‌తో పంచుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోందని గ్రెన్నీ అభిప్రాయపడ్డారు. ఏదైనా విషయం సడెన్‌గా చెబితే అది ఎదుటి వారు తట్టుకోలేకపోతే రిలేషన్షిప్ ఎక్కడ దెబ్బ తింటుందో అని మౌనంగా ఉండిపోతున్నారని ఆ సర్వే స్పష్టం చేసింది. కమ్యూనికేషనే అసలు సమస్య... సర్వేలో పాల్గొన్న ప్రతీ అయిదుగురిలో నలుగురు తాము కమ్యూనికేషన్ సరిగా చేయలేకపోతున్నామని అందుకే సంతోషంగా ఉండలేకపోతున్నామని తెలిపారు. తమ భావాలను సరిగా వ్యక్తీకరించడంలో ఎదురయ్యే సమస్యలతోనే జంటలు ఇబ్బంది పడుతున్నారని గ్రెన్నీ అన్నారు. తమ మనోభావాన్ని భయం లేకుండా చెప్పేవారే రిలేషన్‌షిప్‌ను ఎంజాయ్ చేయగలుగుతున్నారు. గొడవలకు కారణమవుతున్న అంశాలు... రిలేషన్షిప్లో ఉన్న వారి మధ్య గొడవలకు కారణమవుతున్న అంశాలను ఈ సర్వేలో తెలుసుకున్నారు. డబ్బు, సెక్స్, చెడు అలవాట్ల గురించి వచ్చే చర్చలే గొడవలకు ప్రధాన కారణాలని ఈ సర్వే తేల్చింది. ఓపెన్‌గా చెప్పడమే మేలు సమస్య ఏదైనా, విషయం ఏదైనా సూటిగా చెప్పి గొడవ పడడమే ఉత్తమమని, అదే రిలేషన్షిప్ విజయానికి దోహదం చేస్తుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. నిజమైన ప్రేమ గొడవలు జరుగుతాయని భయపడదని, నిజం చెప్పడానికే ప్రయత్నిస్తుందని గ్రెన్నీ వివరించారు. -
విషయం చెప్పకపోతే వివాహం నిలవదు
ఇప్పుడు అందరూ మాట్లాడుతున్న సమస్య ప్రైవసీ. అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు ఏ వ్యవహారాల నయినా రికార్డు చేసి జనం ముందుకు తేవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరి రహస్యాలు బయటపడే అవకాశాలు పెరిగాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు ఏర్పడుతున్నపుడు తమ వివరాలు తెలపాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. కొనుగోళ్లు, ఇతర ఒప్పందాలకు ముందు అన్ని విషయాలు వెల్లడించడం చట్టపరమైన బాధ్యత. పూర్తి విషయాలు చెప్పకపోయినా, కొన్ని విషయాలు దాచినా, తప్పుడు సమాచారం ఇచ్చినా, మోసం చేసినా ఒప్పందాలు చెల్లవు. భాగస్వామ్య ఒప్పందాలు, సేవలు, వస్తువుల కొనుగోళ్ల సంబంధాలు కూడా పరస్పర సమాచార మార్పిడి మీదనే ఆధారపడి ఉంటాయి. వ్యక్తిగత విషయాలు అనుకునేవి కూడా ఒక్కోసారి పంచుకోకతప్పదు. పెళ్లి, సంతానం, మాతృత్వం, పిల్లలను పెంచడం, వారి చదువులు తదితర అంశాలన్నీ కుటుంబానికి సంబంధించినవి. ఆ విషయాలు ఇతరులకు అనవసరం. ఒకవేళ అవసరం ఉంటే దేనికో చెప్పాలి. ప్రజా ప్రతినిధులు, ప్రజా సేవ కులు, ప్రజలందరికీ తెలిసిన నేతలు, తారలు, క్రీడా కారుల వ్యక్తిగత జీవన పరిధి మిగతా వారి కన్నా తక్కువ. ప్రాథమిక హక్కే అయినా ప్రైవసీకూడా మినహాయింపులకు లోబడి ఉంటుంది. డాక్టర్– పేషెంట్ సంబంధం ప్రైవసీని సృష్టిస్తుంది. అది ఒక కాంట్రాక్టు. సమాచారాన్ని డాక్టరు గోప్యంగా ఉంచాలి. కొన్ని సందర్భాల్లో అవసరాన్ని బట్టి దీనికి మినహాయింపు ఉంటుంది. కాబోయే జీవన భాగ స్వామి ఆరోగ్య లేదా రోగనిర్ధారిత సమాచారం భాగస్వామికి తెలియాలి. హిందూ, ముస్లిం, క్రైస్తవ వివాహ చట్టాల్లో ఆరోగ్య సమాచార మార్పిడి అవసరమనే నియ మం ఉంది. పెళ్లయిన తరువాత జంటలో ఒకరికి ఎయిడ్స్ వంటి జబ్బు లేదా ఏదయినా తీవ్రమైన అంటురోగం ఉందని తేలితే వివాహాన్ని రద్దుచేసుకునే అవకాశం చట్టాలు కల్పిం చాయి. హిందూ వివాహ చట్టం సెక్షన్ 13, ముస్లిం వివాహాల రద్దు–1939 చట్టం సెక్షన్ 2, పార్సీ వివాహం, విడాకుల చట్టం 1936, ప్రత్యేక వివాహాల చట్టం సెక్షన్ 27 ప్రకారం భాగస్వామికి వ్యాప్తిచెందే సుఖ రోగం ఉందనే కారణంపై విడాకులు కోర వచ్చు. తనద్వారా మరొకరికి అంటువ్యాధిని నిర్లక్ష్యంగా వ్యాపించేట్టు చేస్తే, అది నేరమని, దానికి ఆరు నెలల జైలు శిక్ష విధించే వీలుందని భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 269 చెబుతోంది. రోగం తెలిసి తెలిసి అంటించేట్టు చేస్తే అందుకు రెండేళ్ల జైలు శిక్షను సెక్షన్ 270 నిర్దేశించింది. అంటే ఒక వ్యక్తికి ఎయిడ్స్ ఉందని తెలిసి, అతడిని ఒక యువతి తెలియక పెళ్లి చేసు కుంటుంటే చూసి మౌనంగా ఉండడం కూడా ఈ సెక్షన్ కింద నేరమే. తాను పరీక్షించిన వ్యక్తికి ఎయిడ్స్ ఉందని తెలిసి, అతడి ప్రేమికురాలు అడిగినా ఆ విష యం చెప్పని డాక్టర్ ఆ తరువాత ఆమెకు ఆ రోగం సోకితే ఈ సెక్షన్ కింద ప్రాసిక్యూషన్‌కు గురి కావ లసి వస్తుంది. నేరం రుజు వైతే డాక్టర్‌కు రెండేళ్ల జైలు శిక్ష తప్పదు. వివాహం చేసుకోవడం ప్రాథమిక హక్కు, ఆ విధంగానే ఆరోగ్యకరమైన జీవి తం కొనసాగించే హక్కు కూడా ప్రాథ మిక హక్కే. ఈ రెండింటి మధ్య సంఘర్షణ వచ్చినపుడు ఈ రెండింటిలో ఏది న్యాయ బద్ధమైందో, నీతివంతమైందో అది గెలు స్తుంది. రోగి అయిన వరుడి వివాహ హక్కుకన్నా వధువు ఆరోగ్యవంతమైన జీవన హక్కుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వ వలసి వస్తుందని సుప్రీంకోర్టు చరిత్రా త్మక తీర్పు చెప్పింది. ప్రతి హక్కు ఒంటరిగా ఉండదు. తగిన బాధ్య తలతో ఉంటుంది. ఒకరి హక్కు మరొకరి బాధ్యతతో ముడిపడి ఉంటుంది. స్నేహబంధమైనా, వ్యాపార సంబంధమైనా, ఉద్యోగ అనుబంధమైనా పూర్తిగా అన్ని విషయాలు తెలియజేస్తేనే నిలుస్తాయి. కుటుం బంలో, భాగస్వామ్య వ్యాపారాలలో దాపరికం, సోమరితనం, చైతన్యరాహిత్యం వల్ల వ్యక్తులు మోస పోతుంటారు. స్నేహం కారణంగా నమ్మామని, ప్రేమవల్ల నమ్మక తప్పలేదని, భర్త కనుక గుడ్డిగా అతని మాటలు విశ్వసించాననే వివరణలు ఇస్తూ ఉంటే అవి మోసపోవడానికి కారణాలు అవుతాయే కాని, నివారణకు పనికి రావు. స్నేహం, ప్రేమ, వివా హం మొదలైన అన్ని బంధాలు నిజాయితీ అనే పునాది మీద ఆధారపడి ఉంటాయి. కుటుంబంలో, కాంట్రాక్టు భాగస్వాముల్లో సమాచార హక్కు ఈ విధంగా కీలక మైనదని అర్థం చేసుకోవాలి. వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com మాడభూషి శ్రీధర్ -
మంట కలుస్తున్న బాంధవ్యాలు
► మనిషిలో పెరుగుతున్న స్వార్థం ► చిన్న వివాదాలతోనే గొడవలు ► హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతున్న వైనం ► కౌన్సెలింగ్ అవసరమంటున్న నిపుణులు రోజులు మారుతున్నాయి.. మనుషులు మారుతున్నారు.. వారి ప్రవర్తనలో మార్పు వస్తోంది.. అనుకున్న వస్తువు, లేదా మరేదైనా దక్కకపోతే దానవులుగా మారిపోతున్నారు. మమతలు, అనురాగాలు, ప్రేమాభిమానాలు మరిచిపోయి కట్టుకున్న పెళ్లాన్ని, కడుపున పుట్టిన బిడ్డను సైతం హత్య చేస్తున్నారు. వ్యక్తిలో పెరుగుతున్న స్వార్థ చింతనే దీనికంతటికీ ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత సమాజంలో ఇది సంక్లిష్ట పరిస్థితిగా మారిపోయింది. ఇక రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశాలు ఉన్నాయని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తిరుపతి క్రైం : కారణాలు ఏవైనా జిల్లాలో హత్యలు పెరిగిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు, వ్యాపార లావా దేవీలు, ఆస్తి గొడవలతో మనుషులన్న విచక్షణను కోల్పోయి హత్యలకు పాల్పడుతున్నారు. ప్రవర్తనలో మార్పును గమనించిన వెంటనే మానసిక నిపుణుల వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగాక తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి నైతిక విలువలు, బంధాలు, బంధుత్వాల గురించి తెలియజేయాల్సి ఉంది. అప్పుడే సమసమాజ నిర్మాణం జరిగి ప్రపంచం నందన వనంగా మారుతుంది. ► రెండు రోజుల క్రితం నలుగురు వ్యక్తులు తమిళనాడు నుంచి వచ్చి గది అద్దె కు తీసుకున్నారు. పూటుగా మద్యం సేవించారు. వారి మధ్య జరిగిందో కాని ముగ్గురు వ్యక్తులు కలిసి ఒకరిని హతమార్చి పరారయ్యారు. ► తనకు తెలియకుండా వ్యవహారం నడుపుతున్నాడనే నెపంతో యువకుడిని కలికిరి మండలంలో అతిక్రూరంగా హింసించి హత్య చేశారు. ► ఐదు రోజుల క్రితం రేణిగుంట ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో బాబు అనే వ్యక్తిని ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేశారు. ► ఈ నెల మొదటి వారంలో ఇద్దరు స్నేహితుల మధ్య డబ్బు వివాదం చోటు చేసుకుంది. దీంతో కలిసి చదువుకున్న స్నేహితుడని కూడా చూడకుండా కిరాతకంగా స్నేహితుడే హత్య చేశాడు. ► మదనపల్లిలో మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్యను కొడుతుండగా అడ్డు వచ్చిన అత్తను అల్లుడు దారుణంగా హత్య చేశాడు. కొరవడిన నిఘా వ్యవస్థ జిల్లాలో ప్రతిరోజూ ఎక్కడో ఒక హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువగా భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలతోనే హత్యలకు పాల్పడుతున్నారు. వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసులు ప్రకటనలకే పరిమితమవుతున్నారు. పేరుకు మాత్రమే ఫ్యామిలీ కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నామని, భార్యాభర్తల మధ్య అనుమానాలు తొలగిస్తున్నామని చెబుతున్నారు. జరిగినా సంఘటన గురించి ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించడంలో విఫలమవుతున్నారు. ఇప్పటికైనా ప్రకటనలు వదలివేసి జరుగుతున్న హత్యలకు కారణాలు తెలుసుకుని ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని చోట్ల మార్పులు రావాలి వ్యక్తుల్లో నేను, నాది అన్న భావన రానురాను బలంగా వేళ్లూనుకుంటోంది. కూర్చుని చర్చించుకుంటే పరిష్కారమయ్యే చిన్న చిన్న సమస్యలపై హత్యలు చేసే స్థాయికి వస్తుండడం వ్యక్తిలో వస్తున్న మార్పులకు అద్దం పడుతోంది. పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచీ చెడ్డ చెప్పాల్సిన తల్లిదండ్రులే సహనం కోల్పోతున్నారు. మనిషి అన్న ఆలోచనలు మరచిపోతున్నారు. చిన్న పిల్లలకు మనిషి ప్రాణాలు, విలువలు తెలియజేయాల్సిన వయస్సులో వారే దారితప్పుతున్నారు. క్షణికావేశానికి లోనై ఆలోచించకలిగే శక్తి ఉన్నా అనాలోచిత నిర్ణయాలతో ప్రాణాలు తీస్తున్నారు. కౌన్సెలింగ్ అవసరం రక్త సంబంధం ఉన్నవారినే హత్య చేస్తున్న వారి ప్రవర్తనను ఒక కోణంలో విశ్లేషించలేం. అన్ని కోణాల్లోనూ పరిశీలించాలి. పాఠశాల వయస్సు నుంచే యుక్త వయస్సు వచ్చే వరకు పెరిగిన విధానాన్ని తెలుసుకోవాలి. ఏదో చిన్న సమస్యకే హత్యలు చేస్తున్నారంటే బంధాలు, బంధుత్వాల గురించి తెలియదు. చిన్నతనం నుం చి తల్లిదండ్రులకు దూరంగా పెరి గిన వారిలో ఈ తరహా భావా లు ఎక్కువగా ఉంటాయి. క్షణికావే శం పడుతున్న వారికి కౌన్సెలింగ్ అవసరం. అప్పుడే ఉద్వేగాలను ని యంత్రించగలం. – డాక్టర్ ఎన్ఎన్ రాజు, మానసిక నిపుణులు -
రాజీ పడితే మంచిది!
ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ కల్చర్. చటుక్కున తినేయాలి.. చిటుక్కున పనుల్లో పడిపోవాలి. అంతా వేగం. బంధాలకు ప్రాధాన్యం ఇవ్వలేనంత బిజీ బిజీగా కొంతమంది ఉంటున్నారు. త్వరగా స్నేహం చేయడం... త్వరగా విడిపోవడం, ఈజీగా లవ్‌లో పడటం... అంతే సులువుగా విడిపోవడం, ఇష్టపడి పెళ్లాడటం... చిన్ని చిన్ని మనస్పర్థలకే విడిపోవడం... మొత్తం మీద బంధాలకు విలువ లేకుండాపోతోంది. బంధాల గురించి ఇంత లెక్చరర్ దేనికీ అనుకుంటున్నారా? ‘రిలేషన్షిప్స్’ గురించి శ్రుతీహాసన్ ఓ మంచి మాట చెప్పారు. అందుకే అన్నమాట. శ్రుతీహాసన్ మాట్లాడుతూ – ‘‘కాంప్రమైజ్ కాకపోతే జీవితం అస్తవ్యస్తమే. ఎక్కడ రాజీపడాలో అక్కడ పడితేనే జీవితం బాగుంటుంది. ముఖ్యంగా బంధాలను కాపాడుకోవాల్సిన విషయంలో రాజీ పడాల్సిందే. అక్కడ లేనిపోని గొప్పలకు పోతే ఆ బంధం తెగిపోతుంది. ఒకప్పుడు స్నేహంలో అయినా, వివాహ బంధంలో అయినా రాజీ అనేది ఉండేది. సర్దుకుపోయేవాళ్లు. ఇప్పుడలా ఇష్టపడటంలేదు. రాజీపడటం తగ్గింది కాబట్టి.. విడిపోవడాలు ఎక్కువైపోయాయి. చిన్నపాటి రాజీవల్ల ఓ బంధం నిలబడుతుందనుకున్నప్పుడు సర్దుకుపోవాలి. ఒకవేళ ఆ బంధం వల్ల జీవితాంతం ఇబ్బందులపాలు కావల్సి వస్తుందనిపిస్తే అప్పుడు రాజీ పడకూడదు’’ అని అన్నారు. -
తప్పుటడుగులు
నెలక్రితం నూతన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకుని లౌకిక, ప్రజాస్వామిక రిపబ్లిక్‌గా ఆవిర్భవించిన నేపాల్‌తో మన సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయని అక్కడి పరిణామాలు సూచిస్తున్నాయి. రిపబ్లిక్ తొలి అధ్యక్షురాలిగా విద్యాదేవి భండారీ ఎన్నికైన బుధవారంనాడే చైనాతో నేపాల్ కుదుర్చుకున్న ఇంధన సరఫరా ఒప్పందం దీన్ని ధ్రువీకరిస్తోంది. దశాబ్దాలుగా నేపాల్ మన దేశంనుంచే ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది. అందులో మనదే గుత్తాధిపత్యం. చైనా-నేపాల్ మధ్య కుదిరిన తాజా ఒప్పందంతో అది కాస్తా బద్దలయింది. అందుకు నేపాల్‌ను నిందించి లాభంలేదు. ఆ దేశంతో సంబంధాలు ఎలా ఉండాలన్న అంశంపై మనలో స్పష్టత లోపించడంవల్లే ఈ పరిస్థితి తలెత్తింది. ఎన్నో ఆటుపోట్లనూ, అస్థిర పరిస్థితులనూ ఎదుర్కొన్న నేపాల్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది. ఇంతలోనే మొన్న ఆగస్టులో రాజ్యాంగం ముసాయిదా వెల్లడయ్యాక మళ్లీ ఆ దేశానికి సమస్యలు తలెత్తాయి. రాజ్యాంగ రచనలో తమకు అన్యాయం జరిగిందని తెరై ప్రాంతంలోని తారూ, మాధేసి వంటి మైనారిటీ జాతులు ఆగ్రహించాయి. రహదార్లను దిగ్బంధించాయి. పర్యవసానంగా భారత్‌నుంచి వెళ్లాల్సిన నిత్యావసర సరుకులు, ఇంధన సరఫరా నిలిచిపోయి నేపాల్ విలవిల్లాడింది. అసంతృప్త వర్గాలు తమ గొంతు వినిపించడం, న్యాయం చేయాలని కోరడంలో వింతేమీ లేదు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటామని, అవసరమైన సవరణలు చేస్తామని అక్కడి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందుకు సంబంధించి వివిధ గ్రూపులతో ఇంకా చర్చలు సాగుతున్నాయి. ఇదంతా నేపాల్ ఆంతరంగిక వ్యవహారం. తారూ, మాధేసి జాతులు ఆందోళన చేస్తున్నప్పుడు వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాజ్యాంగం ముసాయిదాలో అవసరమైన మార్పులు చేయాలని, అందుకోసం అవసరమైతే దాని ఆమోదాన్ని కొద్ది రోజులు వాయిదా వేసుకోవాలని మన దేశం నేపాల్‌కు సూచించింది. అయితే అదేమీ జరగలేదు. నేపాల్ తాను అనుకున్నట్టే రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చింది. ఇది మన దేశానికి కోపం తెప్పించింది. రాజ్యాంగాన్ని ఆమోదించాక ఇతర దేశాలన్నీ దాన్ని హర్షిస్తూ ప్రకటనలు విడుదల చేస్తే మన దేశం మాత్రం 'కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చిన విషయాన్ని గుర్తించామం'టూ స్పందించింది. మన దేశ సరిహద్దుల్లో ఉన్న తెరై ప్రాంతంలోని జనాభాలో 70 శాతం తారూ, మాధేసిలే. అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొంటే దాని ప్రభావం సహజంగా భారత్‌పై కూడా ఉంటుంది. కనుకనే వారి సమస్యలు తీరేలా మార్పులు చేయాలని సూచించామని మన ప్రభుత్వం చెప్పింది. అంతవరకూ బాగానే ఉందనుకున్నా ఆ విషయంలో ప్రతిష్టకు పోయి అలగడం ఎందుకో అర్ధంకాదు. తెరై ప్రాంతంలో జరిగే ఆందోళనలవల్ల మన దేశంనుంచి ఆ దేశానికి వెళ్లే సరుకు రవాణా స్తంభించిపోయింది. సరిహద్దుల్లో వందలాది ట్రక్కులు నిలిచిపోయాయి. ఇంధన ట్యాంకర్లు కూడా వాటిల్లో ఉన్నాయి. మీరు సమస్యను పరిష్కరించుకుంటే తప్ప మేం చేయగలిగేదేమీ లేదని మన దేశం చేతులెత్తేసింది. అయితే, నేపాల్ ప్రభుత్వమూ, ప్రజలూ దాన్ని వేరే రకంగా అర్ధం చేసుకున్నారు. రాజ్యాంగం విషయంలో తాము చెప్పినట్టు నడుచుకోలేదన్న ఆగ్రహంతో భారత్ కావాలనే ఇంధన సరఫరా రాకుండా అడ్డుకుంటున్నదని వారు భావించారు. ఇందుకు ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి లక్ష్మీ ప్రసాద్ ఢాకాల్ సెప్టెంబర్‌లో చేసిన ప్రకటనే సాక్ష్యం. ‘మా కొత్త రాజ్యాంగంతో భారత్ సంతోషంగా లేదు గనుకే ఈ వాణిజ్య దిగ్బంధానికి పూనుకున్నద’ని ఆరోపించారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ నేపాల్ ఉప ప్రధాని కమల్ థాపా పదిరోజుల క్రితం భారత్ వచ్చారు. ఆందోళనల ప్రభావం అంతగాలేని ప్రాంతాల వైపునుంచి ట్రక్కుల్ని పంపే ఏర్పాటు చేయాలని ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కి విన్నవించారు. అందుకు సంబంధించి భారత్‌నుంచి తమకు స్పష్టమైన హామీ లభించిందని కూడా థాపా ప్రకటించారు. కానీ పరిస్థితి మారలేదు. భారత్‌నుంచి దిగుమతులు స్తంభించిపోవడంవల్ల నేపాల్ ఆర్థిక వ్యవస్థ లక్ష కోట్లు నష్టపోయిందని ఈ మధ్యే అక్కడి వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య ప్రకటించింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల కోసమే చైనా కాచుక్కూర్చుంది. భారత్‌పై నేపాల్‌లో అసంతృప్తి ఏర్పడితే సొమ్ము చేసుకోవాలని అది చాన్నాళ్లుగా ఎదురుచూస్తోంది. నేపాల్‌లో రాచరిక వ్యవస్థ రద్దయి మావోయిస్టుల నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ దేశం చైనాకు దగ్గరైంది. ఆ తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వాలు కూడా దాన్ని కొనసాగించాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఎంతో జాగ్రత్తగా అడుగేయాల్సిన మన దేశం సక్రమంగా వ్యవహరించలేదు. యూపీఏ సర్కారు హయాంలో రెండేళ్లక్రితం భూటాన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. కిరోసిన్, వంటగ్యాస్ ఎగుమతుల్లో ఇచ్చే సబ్సిడీలను హఠాత్తుగా నిలిపేయడంతో అక్కడ పెను సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో భూటాన్‌ను ఆదుకోవడానికి చైనా ముందుకొచ్చింది. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక అలాంటి సమస్యలను చక్కదిద్దే పని చేపట్టారు. భూటాన్‌ను తన తొలి విదేశీ పర్యటనకు ఎంచుకోవడమేకాక నేపాల్‌ను రెండుసార్లు సందర్శించారు. అయినా మన దౌత్య వ్యవహారాలు గాడిన పడలేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. చైనాతో 'దీర్ఘకాల వాణిజ్య బంధాని'కి అవసరమైన చర్చలు జరిపామని నేపాల్ చెబుతోంది. ఈ సహకారం త్వరలోనే ఇతర రంగాలకు కూడా విస్తరిస్తుందనడంలో సందేహం లేదు. అప్పుడు మన దేశంపై ఆధారపడే స్థితి దానికి తప్పుతుంది. నేపాల్ విషయంలో సరైన అంచనాలకు రావడంలో మనం విఫలమయ్యామని తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. అక్కడ రాచరికం పోయి చాన్నాళ్లయిందని మన దౌత్య వ్యవహర్తలు గుర్తించడం మంచిది. -
మన జాతీయాలు
లొట్టాభట్టీయం మనుషుల్లో చేతల మనుషులు, మాటల మనుషులు అని రెండు రకాలు. చేతల మనుషులు... తాము చేయదలిచిన పనిని ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా చేసేస్తారు. మాట మీద నిలబడతారు. అతిగా మాట్లాడరు. గొప్పలకు పోరు. అసాధ్యమైన పనిని సైతం ‘నేను చేస్తాను చూడు’ అని డంబాలు పలుకరు. ఇక మాటల మనుషుల తీరు దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఈ కోవకు చెందినవాళ్లు మాటలకు తప్ప చేతలకు ప్రాధాన్యత ఇవ్వరు. పని విషయంలో సాధ్యాసాధ్యాల గురించి విశ్లేషించడం కూడా కనిపించదు. ఏ పని అయినా సరే- ‘‘అదొక లెక్కా... నేను చేసేస్తాను’’ అంటారు. తీరా పనిచేయాల్సి వచ్చేసరికి సాకులు వెదుక్కొని తప్పించుకుంటారు. ఇలాంటి వాళ్లు ఎంతోమంది మనకు నిత్యజీవితంలోనూ తారస పడుతుంటారు. ఈ కోవకు చెందిన వాడే లొట్టాభట్టు. ఈ భట్టుగారు నోరి విప్పితే చాలు... కోతలే కోతలు. ‘ఆకాశంలో చుక్కలు కావాలి’ అని అడిగితే - ‘అదెంత పని’ అనేవాడట వినేవాళ్లు నమ్మేలా. దేనినీ చాతకాదు అనడం ఈయనకు చాత కాదు. ఏదైనా చేసేస్తాను అనడమే ఈయనగారికి వచ్చు. నిజంగా వచ్చా అంటే సమాధానం శూన్యం. అందుకే కోతలు కోయడం, గొప్పలు చెప్పుకోడం లాంటి వాటికి లొట్టాభట్టు పేరు పర్యాయపదం అయిపోయింది. అందుకే ఎవరైనా సాధ్యం కాని పనులను సాధ్యం చేస్తామని చెప్పినా, కోతలు కోసినా - ‘‘ఆయన చెప్పింది నమ్మేవు సుమీ... అదొక లొట్టాభట్టీయం’ అంటుంటారు. దింపుడు కళ్లం ఆశ మనిషిని బతికించేది ఆశ అంటారు. చనిపోయిన మనిషి మళ్లీ బతుకుతాడు అనుకోవడం కూడా ఆశే. కాకపోతే అది తీరే ఆశ కాదు. అయినా కూడా తీరుతుందేమో నని ఆచరించేదే దింపుడు కళ్లం. చనిపోయిన వ్యక్తిని శ్మశానం వరకూ ఊరేగింపుగా తీసుకెళ్తూ, మధ్యలో ఒకచోట శవాన్ని కిందికి దింపి, చెవిలో మూడుసార్లు పేరు పెట్టి పిలుస్తారు. ప్రాణం మిగిలుంటే లేస్తారని ఆ ప్రయత్నం. దీన్ని దింపుడు కళ్లం ఆశ అంటారు. కళ్లం అంటే ప్రదేశం అని అర్థం. గతంలో ఎప్పుడో, చనిపోయాడని నిర్ధారించుకున్న ఓ వ్యక్తి, నిప్పు పెట్టే ముందు చితిమీది నుంచి లేచి కూర్చు న్నాడట. అదెంతవరకూ నిజమో తెలి యదు కానీ, ఆచార వ్యవహారాల ప్రకారం దింపుడు కళ్లం ఆశకు ఎలాంటి అర్థం ఉన్నా, ఒక చిట్టచివరి ఆశ అన్న భావన వచ్చింది. ఒక పని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగ దని తెలిసినా, మనసులో ఏదో మూల చిన్న ఆశ ఉంటుంది. ఆ ఆశ గురించి చెప్పేటప్పుడు ఈ మాటను వాడతారు. చుట్టమై వచ్చి దెయ్యమై పట్టి! పనులు చక్కబెట్టుకోవడానికి లేదా తమ పబ్బం గడుపుకోవడానికి కొంతమంది ఆత్మీయత, స్నేహం, బంధుత్వం అనే ఆయుధాలను వాడుతుంటారు. ఒక పని నెరవేర్చుకోవాలంటే ఎవరి వల్ల అవుతుంది, ఎవరి ద్వారా ఎలాంటి లాభాలు పొందవచ్చు అని కనుక్కొని జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. వారితో వ్యూహాత్మకంగా స్నేహమో, బంధుత్వమో కొని తెచ్చుకుంటారు. వీరి నట ఆత్మీయతను చూసి అవతలి వాళ్లు సులభంగా బుట్టలో పడి పోతారు. కాల క్రమంలో ఈ ఆత్మీయులు కాస్తా గుదిబండల్లా తయారవుతారు. దాంతో వీరిని వదిలించుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అలాంటి వారి విషయంలో వాడే జాతీయం ఇది. ‘‘అలాంటివాడిని ఎందుకు నమ్మావు?’’ అని అడిగితే- ‘‘ఏం చేస్తాం మరి... చుట్టమై వచ్చి దెయ్యమై పట్టాడు’’ అంటారు. ఈగెంతా పేగెంతా! కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలంటారు. వియ్యం సంగతి సరే, కయ్యంలో మాత్రం తరచుగా వినిపించే మాట ఇది. సంపద, జ్ఞానం, వయసు మొదలైన విషయాల్లో పోల్చి చూసే సందర్భాల్లో వాడే జాతీయం ఇది. ‘‘నువ్వెంత, నీ స్థాయి ఎంత? నీ మాటలను నేను లెక్కలోకి తీసుకోను. ఈగెంతా పేగెంతా’ అంటుంటారు. ఈగ అంటేనే చిన్న జీవి. ఇక దాని పేగు ఎంత ఉంటుంది! మరీ చిన్నగా ఉండదూ! తక్కువలో తక్కువ, అల్పంలో అల్పం అని చెప్పడానికి ‘ఈగ’ను ప్రతీకగా వాడుకొని ఇలా చెబుతుంటారన్నమాట. -
సీపీఐ నిర్మాణం భ్రష్టుపట్టింది...
పోటీ చేసి ఉండాల్సింది కాదు.. నారాయణపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు సాక్షి, విజయవాడ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ వ్యవహారశైలి వల్ల పార్టీ నిర్మాణం భ్రష్టుపట్టిపోయిందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కె.సుబ్బరాజు ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శి వ్యవహారశైలిని నిరసిస్తూ ఆయన నారాయణకు నాలుగు పేజీల లేఖ రాశారు. బూర్జువా పార్టీలతో నేస్తం, వాణిజ్య, పారిశ్రామిక, బడా కాంట్రాక్టు సంస్థలతో సంబంధాలు, నాయకుల ఆర్థిక అరాచకానికి తోడ్పాటు వల్లే గత ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పార్టీ వైఫల్యం చెందిందని ఆరోపించారు. పార్టీ ఎన్నడూ ఎరుగని రీతిలో డిపాజిట్లు కోల్పోవడమే కాకుండా ఘోరమైన రీతిలో లభించిన ఓట్లు పార్టీ దిగజారుడుకు అద్దం పడుతోందన్నారు. దీన్ని రాజకీయ అంశాలపై జరిగిన నష్టం భావిస్తే పార్టీకి మరింత నష్టం చేసినవారవుతామని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ అధినేతగా నిర్మాణ బాధ్యతలు నిర్వహించి, ప్రజల్లో సత్సంబంధాలు ఉన్న చోట పోటీ చేయడం అవసరమే అయినా, రాష్ట్రవ్యాప్త సమన్వయంతోపాటు చాలెంజ్‌గా కేంద్రీకరించాల్సిన నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడం ఏమాత్రం సరికాదన్నారు. రెండు రాష్ట్రాల పార్టీ శ్రేణులు, ప్రజల్లో విభిన్న ధోరణులు మరిచిపోక ముందే ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా ఉండి ఒక రాష్ట్రంలో పోటీ చేయడం బాగోలేదని, కృష్ణాజిల్లాతో పాటు పలు జిల్లాల సమావేశాల నుంచి వచ్చిన సూచనలు పట్టించుకోకపోవడం సరికాదని పేర్కొన్నారు. బహిరంగ విమర్శలు వచ్చినప్పుడైనా పార్టీ పదవికి రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొని ఉంటే రాష్ట్రవ్యాపితంగా కూడా పార్టీ గౌరవం పొంది కొంత నిలబడి ఉండేదన్నారు. ఎన్నికల తర్వాత ఖమ్మం పార్లమెంట్ స్థానంలో సీపీఎం నాయకుడిపై చేసిన ఆర్థిక ఆరోపణలు తొందరపాటు చర్య అన్నారు. తొందరపాటు, ఆ తర్వాత పశ్చాత్తాపాలు మీకు సహజం కాని, పార్టీ పట్ల ఏర్పడిన చులకన మరింత పెరుగుతోందన్నారు. కిందిస్థాయి సీపీఎం నాయకులు ప్రత్యారోపణలకు అవకాశం ఇచ్చినట్లయిందన్నారు. తెలంగాణలో కేంద్ర పార్టీ విధానానికి విరుద్ధంగా ప్రత్యేక పరిస్థితుల పేరుతో దేశమంతా ఛీకొట్టిన కాంగ్రెస్‌తో జత కట్టినా మనకు ఒరిగింది లేకపోగా పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిందన్నారు. వామపక్ష ఉద్యమ కేంద్రం, సీపీఐకి గుండెకాయ లాంటి విజయవాడలో చారిత్రాత్మక పరాజయానికి నారాయణ కూడా బాధ్యులేనన్నారు. 130 ఏళ్ల విజయవాడ మున్సిపాలిటీ, కార్పొరేషన్ చరిత్రలో పలుసార్లు పాలించిన సీపీఐకి మొదటిసారి ప్రాతినిధ్యం లేకుండా పోవడం, అగ్రనాయకత్వం పోటీ చేసిన డివిజన్లలో కూడా డిపాజిట్లు కోల్పోవడం అవమానకరమన్నారు. నగర కార్యదర్శిగా ఉన్న దోనేపూడి శంకర్ ఏకపక్ష విధానాల వల్ల పార్టీ నష్టపోయిందన్నారు. కౌన్సిల్ సభ్యుడైన తనను ఏనాడు సమావేశాలకు పిలవకపోగా, 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న తనను అభ్యర్థుల ఎంపికలో భాగస్వామిని చేయలేదన్నారు. ఓటు వేసిన గుర్తు చెరగకముందే కార్పొరేటర్‌గా పోటీ చేసిన నగర కార్యదర్శిని ఎమ్మెల్యే స్థానానికి ఎంపిక చేయడం వల్ల పార్టీకి మరెవ్వరూ దిక్కులేదనే భావన కలిగిందన్నారు. ఎంపీ అభ్యర్థులకు ఓట్లు వేయిస్తానని తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. రాష్ట్రస్థాయి నుంచి నగర స్థాయి వరకూ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని సుబ్బరాజు డిమాండ్ చేశారు. -
ప్రేమలు పూసిన తోట!
ఛాయాచిత్రం ‘కవిత్వాన్ని తూచడానికి నా దగ్గర రాళ్లు లేవు’ అన్నారు చలం. ప్రేమను కొలవడానికి మాత్రం ఏమున్నాయి? ‘ఏమీ లేవు’ అనుకుంటాంగానీ...ఒక మంచి కవిత చదివినప్పుడో, ఒక ఛాయాచిత్రాన్ని చూసినప్పుడో ప్రేమ, అనుబంధాలు, ఆప్యాయతలను తూచడానికి...అవి కాస్తో కూస్తో ప్రతిభను చాటుకున్నాయి అని మాత్రం అనిపిస్తుంది. ఇంగ్లండ్‌కు చెందిన ఒక వెబ్సైట్ ‘ఎ హార్మనీ లవ్ క్యాప్చర్డ్ కాంటెస్ట్’కు ఎన్నికైన పది ఫొటోలు గుండెలో పదిల పరుచుకునేలా ఉన్నాయి. నలుగురు సభ్యుల న్యాయనిర్ణేతల బృందం విజేతలను నిర్ణయించింది. ఈ బృందంలో ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్లతో పాటు అనుబంధాల లోతు తెలిసిన మానసిక నిపుణులు కూడా ఉన్నారు. లీ జెఫ్రీ తీసిన ‘వుయ్ హ్యావ్ వాక్డ్ ఏ లాంగ్ వే టుగెదర్’ ఛాయాచిత్రం ‘విన్నింగ్ ఫొటోగ్రాఫ్’గా నిలిచింది. నాలుగో స్థానంలో నిలిచిన సమంతా మిల్లర్ ‘లవ్ టైమ్’లో గొప్ప తమాషా ఉంది. అందుబాటులో ఉండే వస్తువులతో కూడా అపురూపమైన భావాలను చాటవచ్చునని చెప్పిన ఫొటో ఇది. ‘‘ఒక్కమాటలో చెప్పాలంటే ఫొటోగ్రఫీ అనేది నా ప్రపంచం. బహుమతి గెలుచు కోవడం గొప్ప గుర్తింపు అనుకుంటున్నాను’’ అని సంతోషపడుతున్న సమంత... సింపుల్ ఐడియాతో బహుమతి గెలుచుకున్నారు. ఈ ఫొటో షూట్ కోసం తన బాయ్‌ఫ్రెండ్ షూ దొంగిలించి, దానికి తన షూ జత చేసి క్లిక్ అనిపించారట! చెల్లి ప్రేమను ముద్దొచ్చేలా ఫొటో తీశారు జోలంట. ఒలఫ్, ఆస్కార్ అనే సోదరులు తమ చెల్లిని ముద్దాడుతున్న దృశ్యం ఎంత ముద్దొచ్చేలా ఉందో కదా! -
శత్రువులెవరో.. చిన్నారులకూ తెలుసు!!
మాటలు రాకపోయినా.. తమకు మిత్రులెవరో, శత్రువులెవరో చిన్నారులు కూడా సులభంగా గుర్తు పట్టేస్తారట. యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో శిశువుల మీద చేసిన పరిశోధనలో ఈ విషయం తేలింది. చివరకు 9 నెలల పిల్లలు కూడా తమతో ఎవరెలా వ్యవహరిస్తున్నారో ఇట్టే గుర్తుపట్టేస్తారని, ఇతరుల సామాజిక సంబంధాలను వాళ్లు చాలా పక్కాగా గమనిస్తుంటారని పరిశోధనలో పాలుపంచుకున్న సైకాలజీ ప్రొఫెసర్ అమందా ఎల్. వుడ్‌వర్డ్ తెలిపారు. 9 నెలల వయసున్న మొత్తం 64 మంది పిల్లలను బృందాలుగా చేసి, వారికి ఇద్దరు పెద్దవాళ్ల వీడియోలు చూపించారు. వాళ్లు రెండు వేర్వేరు రకాల ఆహారాలు తిన్నారు. అలా తినేటప్పుడు కూడా అయితే పాజిటివ్‌గా, లేకపోతే నెగిటివ్‌గా వారు స్పందించారు. ఈ వీడియోలను పిల్లలకు చూపించారు. అప్పుడు వాళ్లు ఈ ఇద్దరి విషయంలో వేర్వేరుగా తమ భావాలు పలికించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి తినేటప్పుడు శిశువులు వాళ్ల ఆహారపు అలవాట్లను పరిశీలిస్తారని, దాన్ని బట్టే సామాజిక సంబంధాలు నిర్వహిస్తారని పరిశోధనలో పాల్గొన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ కేథరిన్ డి.కింజ్లర్ తెలిపారు.