మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వాడకం మానవ వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీస్తోందని.. తల్లిదండ్రులు & పిల్లల మధ్య కూడా దూరాన్ని పెంచేస్తోందని.. వివో నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.
తల్లిదండ్రులు సగటున రోజుకి.. ఐదు గంటల కంటే ఎక్కువ సమయం.. పిల్లలు నాలుగు గంటలకు పైగా స్మార్ట్‌ఫోన్‌లలో గడుపుతున్నారని సర్వేలో వెల్లడైంది. వీరందరూ ఎక్కువగా సోషల్ మీడియా, వినోదం కోసం వీటిని ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.
స్మార్ట్‌ఫోన్ వాడకం వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీస్తోంది. 66 శాతం మంది తల్లిదండ్రులలో.. 56 శాతం మంది పిల్లలలో అధిక స్మార్ట్‌ఫోన్ వినియోగం కారణంగా వారి వ్యక్తిగత సంబంధాలలో ప్రతికూల మార్పులు వస్తున్నాయని సర్వేలో తేలింది. ఈ మార్పులు వారి మధ్య సంఘర్షణకు కూడా కారణమవుతున్నట్లు తెలిసింది.
73 శాతం మంది తల్లిదండ్రులు.. 69 శాతం మంది పిల్లలు తమ మధ్య వివాదానికి కారణం మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగమే అని సర్వేలో తేలింది. స్మార్ట్‌ఫోన్ తల్లిదండ్రులు, పిల్లల జీవితాల్లో అనివార్యమైన భాగంగా మారింది. దీంతో 76 శాతం మంది తల్లిదండ్రులు, 71 శాతం మంది పిల్లలు తమ స్మార్ట్‌ఫోన్‌లు లేకుండా జీవించలేరని అంగీకరిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది.
ఇదీ చదవండి: అందరికీ ఇష్టమైన గేమ్.. ఇప్పుడు నథింగ్ ఫోన్‌లో
64 శాతం మంది పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలుగా మారిపోయినట్లు, ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియా, వినోద కార్యక్రమాలలో గడుపుతున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పూణేలలోనే స్మార్ట్‌ఫోన్ యూజర్లను అధ్యయనం చేసిన తరువాత ఈ విషయాలను వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment