అజిత్ లుక్ అదిరింది | Thala Ajith new movie First look released | Sakshi
Sakshi News home page

అజిత్ లుక్ అదిరింది

Published Thu, Sep 24 2015 8:26 AM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

అజిత్ లుక్ అదిరింది

అజిత్ లుక్ అదిరింది

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కొత్త సినిమా లుక్ సోషల్ మీడియాలో హవా చూపిస్తోంది. ఇటీవల వరుస బ్లాక్బస్టర్స్ తో కోలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న అజిత్ తన 56వ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు తలా 56గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు 'వేదలం' అనే టైటిల్ను ఫైనల్ చేశారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు వీరం ఫేం శివ దర్శకుడు.

ఈ సినిమా కోసం అజిత్ తన లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. చిన్నగా కట్ చేసిన హెయిర్ స్టైల్, లైట్గా గడ్డం, చెవులకు రింగులు, మెడలో, చేతికి స్టీల్ చైన్లు ఇలా మాస్ ఆడియన్స్ కు దేవుడిలా దర్శనమిస్తున్నాడు అజిత్. తమిళనాట మాస్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్.. ఈ రేంజ్ మాస్ లుక్లో కనిపించే సరికి సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

దీనికి తోడు 'వి'తో స్టార్ట్ అయిన అజిత్ సినిమాలన్ని బాక్స్ఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేశాయి. 'వాలి', 'విలన్', 'వరలరు', 'వీరం' లాంటి సినిమాలు అజిత్ మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేశాయి. ఇప్పుడు అదే బాటలో వేదలం కూడా అజిత్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement