veeram
-
పాతికేళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్‌లోకి వెంకీ.. టైటిల్ ఇదేనా!
టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా మూవీస్ తో దుమ్మురేపుతున్నారు.మరోవైపు అగ్ర హీరోలు కూడా తిరిగి బీటౌన్ పయనమవుతున్నారు. ఇప్పటికే చిరు సైరాతో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చారు. నాగార్జున బ్రహ్మాస్త్రాలో నటిస్తున్నాడు. ఇప్పుడు వెంకీ వంతు వచ్చింది. ఏకంగా సల్మాన్ ఖాన్ తో కలసి మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు విక్టరీ. పాతికేళ్ల క్రితం హిందీ సినీ పరిశ్రమలో వరుసగా సినిమాలు రిలీజ్ చేసాడు వెంకటేశ్. తెలుగులో హిట్టైన చంటి, యమలీల సినిమాలను అక్కడ అనారి, తక్ దీర్ వాలా లాంటి పేర్లతో రీమేక్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ వైపు చూడ లేదు వెంకీ. పాతిక ఏళ్ల తర్వాత వెంకీ దృష్టి ఇప్పుడు సడన్ గా బాలీవుడ్ పై పడింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న కొత్త చిత్రంలో వెంకీ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి భాయ్‌జాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరో విశేషం ఏంటంటే ఈ సినిమా ఓ సూపర్ హిట్ చిత్రానికి అఫీసియల్ రీమేక్. 2014 కోలీవుడ్ సూపర్ హిట్ వీరమ్ కు అఫీషియల్ హిందీ రీమేక్ తెరకెక్కుతోంది భాయ్ జాన్. ఈ సినిమాలోనే సల్మాన్, వెంకీ కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. వీరమ్ తెలుగులో కాటమరాయుడు పేరుతో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఆడియెన్స్ కోసం కథలో మార్పులు చేర్పులు చేశారు. సల్మాన్ కు జోడిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించనుంది. వెంకీ కోసం సౌత్ నుంచి మరో కథానాయికకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. -
‘కాటమరాయుడు’ రీమేక్‌ని పక్కన పెట్టిన సల్మాన్, కారణం ఇదేనా?
సౌత్ సైడ్ ఏదైనా మూవీ హిట్ అయితే చాలు. బాలీవుడ్ లో సల్మాన్ అలెర్ట్ అయిపోతాడు. వెంటనే రీమేక్ రైట్స్ కొనుగోలు చేస్తాడు. అలా సౌత్ లో సూపర్ హిట్టైన వీరమ్ మూవీని, గతంలోనే సల్మాన్ బాలీవుడ్ లోకి రీమేక్ చేయాలనుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నాడట. ఆ సౌత్ రీమేక్ ను పక్కన పెట్టాడట. 2014లో విడుదలైన వీరమ్ చిత్రం కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తమిళ స్టార్ హీరో అజిత్ ఊరమాస్ లుక్ కు కోలీవుడ్ ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. 80 కోట్లకు పైగా వసూళ్లను అందించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో కాటమరాయుడు పేరుతో రీమేక్ అయింది. హిందీలో సల్మాన్ ఖాన్ కభీ ఈద్ కభీ దీవాళి పేరుతో రీమేక్ చేయాలనుకున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కాని ఇప్పుడు ఈ రీమేక్ ఆగిపోయిందని బాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది ఈద్ కానుకగా సల్మాన్ ఓటీటీలో రిలీజ్ చేసిన న్యూ మూవీ రాధే. ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేకపోయింది. దాంతో సల్మాన్ షాక్ కు గురైయ్యాడని సమాచారం. తాను చేస్తున్న, చేయాల్సిన ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టాడట. అందులో భాగంగా అంతిమ్, టైగర్ 3 చిత్రాలు తప్పితే మిగితా ప్రాజెక్ట్స్ అన్నిటినీ హోల్డ్ లో పెట్టాడట. కాటమరాయుడు హిందీ రీమేక్ ను క్యాన్సిల్ చేసాడట. ప్రస్తుతం సల్మాన్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ లో మాస్టర్ రీమేక్, దబాంగ్ 4, కిక్ 2, చిత్రాలు ఉన్నాయి. మరి వీటి సంగతి ఏంటి అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తోంది. ఓటీటీలోకి మరో మూవీ ఈద్ కానుకగా రాధే ను ఇటు ఓటీటీలోను, అటు థియేటర్స్ లోనూ ఒకేసారి రిలీజ్ చేసాడు సల్మాన్. ఇప్పుడు ఇదే ఫార్మాట్ లో అంతిమ్ కూడా విడుదల కానుందట. దేశంలో పూర్తిస్థాయిలో థియేటర్స్ తెరుచుకోకపోవడంతో, సింగిల్ స్క్రీన్స్, జీ5 యాప్ లో అంతిమ్ మూవీ ఒకేసారి విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ మూవీలో సల్మాన్, ఆయన బావమరిది ఆయుష్ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో గ్యాంగ్ స్టర్ రోల్ ను ఆయుష్, అలాగే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ను సల్మాన్ చేస్తున్నాడు. -
మిస్టర్ బచ్చన్ పాండే
నాన్చాక్ పట్టుకుని ‘నేను రెడీ’ అంటున్నారు బచ్చన్ పాండే. అక్షయ్ కుమార్ నటించనున్న తాజా చిత్రానికి ‘బచ్చన్ పాండే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలోని అక్షయ్ లుక్‌తో పాటు సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్కు విడు దల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం అజిత్ నటించిన తమిళ చిత్రం ‘వీరమ్’కి (తెలుగులో ‘కాటమరాయుడు’ గా రీమేక్ అయ్యింది) హిందీ రీమేక్ అని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం లక్ష్మీబాంబ్, సూర్యవన్షీ సినిమాలతో బిజీగా ఉన్నారు అక్షయ్. అలాగే ఆయన నటించిన ‘మిషన్ మంగళ్’ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. -
సీక్వల్ ప్లాన్ లో అజిత్, శివ
వివేగం సక్సెస్ తరువాత గ్యాప్ తీసుకున్న అజిత్ తిరిగి సినిమాలతో బిజీ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు తన తదుపరి చిత్రాన్ని ఎనౌన్స్ చేయని అజిత్, మరోసారి హిట్ కాంబినేషన్ లో పనిచేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారట. గతంలో అజిత్ ఓ చారిత్రక చిత్రంలో నటిస్తారన్న టాక్ వినిపించినా.. ప్రస్తుతం ఆ ప్రయత్నాలు విరమించుకున్నారట. మరోసారి తన లక్కీ డైరెక్టర్ శివ దర్శకత్వంలో నటిచేందుకు అజిత్ ఆసక్తికనబరుస్తున్నారట. అజిత్ హీరోగా శివ తెరకెక్కించిన తొలి సినిమా వీరంకు సీక్వల్ ను రూపొందించే ఆలోచనలో ఉన్నారన్న వార్త ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వీరం, వేదలం, వివేగం లాంటి కమర్షియల్ సక్సెస్ లు వచ్చాయి. ఇప్పుడు మరోసారి తో అదే ఫీట్ రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు అజిత్, శివ. -
అభిమానులకు పవన్ బర్త్ డే గిఫ్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు తీపి కబురు అందింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవన్ కొత్త సినిమా పట్టాలెక్కేసింది. ప్రస్తుతానికి పవన్ షూటింగ్లో పాల్గొనకపోయినా.. త్వరలోనే యూనిట్‌తో జాయిన్ అవుతాడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడట పవన్. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు అదే రోజు సినిమా టైటిల్‌ను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్‌గా రూపొందిస్తున్నారన్న టాక్ వినివిస్తున్నా.. యూనిట్ సభ్యుల నుంచి మాత్రం కన్ఫర్మేషన్ లేదు. సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమాతో నిరాశపరిచిన పవన్ కళ్యాణ్, ఈ సారి ఎలాగైన భారీ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. గోపాల గోపాల ఫేం డాలీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అనుప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. -
ఆ రీమేక్‌లో పవన్ కల్యాణ్?
ఏ సినిమా అయినా పెట్టిన పెట్టుబడికి మూడింతలు వసూలు చేస్తే... తీసినవాళ్లు, కొన్నవాళ్లు పండగ చేసుకుంటారు. ఇక.. ఆ సినిమాలో నటించినవాళ్లు, పనిచేసినవాళ్ల ఆనందం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాదిన్నర క్రితం తమిళ పరిశ్రమలో ఇలాంటి ఒక చిత్రం విడుదలైంది. పేరు ‘వీరమ్’. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో దాదాపు 40 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ చిత్రం 120 కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం. ఇప్పుడీ చిత్రం గురించిన ప్రస్తావన ఎందుకంటే.. ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటించనున్నారట. ఇటీవల ఎస్.జె. సూర్య దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా ఆరంభమైన విషయం తెలిసిందే. దీనికి శరత్ మరార్ నిర్మాత. ఈ చిత్రం ‘వీరమ్’కి రీమేక్ అని సమాచారం. ఇది యాక్షన్ బేస్డ్ లవ్ డ్రామా. కొన్ని నెలల క్రితం ఈ చిత్రబృందం ‘వీరమ్’ హక్కులు తీసుకుందట. అప్పట్నుంచీ తెలుగుకి అనుగుణంగా కథలో మార్పులూ, చేర్పులూ చేయడం మొదలుపెట్టారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘వీరమ్’ని యథాతథంగా తీయరట. జస్ట్ స్టోరీలైన్ మాత్రమే అదనీ, మిగతాదంతా వేరే విధంగా ఉంటుందనీ వినికిడి. వాస్తవానికి పవన్-ఎస్.జె. సూర్యల సినిమా ప్రారంభోత్సవం నాడు ఈ చిత్రానికి ఆకుల శివ కథ అందిస్తున్నారని ప్రకటించారు. మరి.. ‘వీరమ్’ కథనే శివ వర్కవుట్ చేసి ఉంటారా? లేక వేరే కథ అయ్యుంటుందా? ఒకవేళ వేరే కథ అయితే.. ‘వీరమ్’ని వేరే దర్శకుడితో చేయడానికి పవన్ కల్యాణ్ ప్లాన్ చేస్తున్నారా? అనే విషయాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. -
పవర్ స్టార్ కొత్త సినిమా తమిళ్ రీమేకా?
చెన్నై: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు ఎస్జే సూర్య కాంబినేషన్లో గతవారం ప్రారంభమైన కొత్త సినిమా.. ఓ తమిళ చిత్రానికి రీమేకా అంటే అవుననే వినిపిస్తున్నది. సూపర్‌స్టార్ అజిత్ హీరోగా వచ్చిన తమిళ్ బ్లాక్ బస్టర్ 'వీరమ్' రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తున్నది. 'కొన్ని నెలల కిందటే ఈ సినిమా రీమేక్ హక్కుల్ని చిత్రబృందం సొంతం చేసుకుంది. తెలుగు నెటివిటీకి అనుగుణంగా ఈ కథను మార్చేందుకు ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు' అని చిత్రయూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. 'వీరమ్' సినిమా మక్కీమక్కీగా తెలుగులో రీమేక్ చేయబోరని, పవన్ అభిమానులను, తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని.. మూలకథ దెబ్బతినకుండా మార్పులు చేస్తున్నట్టు చిత్రవర్గాలు తెలిపాయి. యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కిన 'వీరమ్'లో అజిత్ పాత్రను పవన్ కల్యాణ్ చేయబోతున్నారు. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు ఎస్‌జె సూర్య కాంబినేషన్లో వచ్చిన 'ఖుషి' బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వీరిద్దరి కలయికలో తాజా సినిమాకు క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. 2001 ఏప్రిల్ 27న 'ఖుషి' విడుదలైంది. ఇప్పుడు సరిగ్గా పదిహేనేళ్ల తర్వాత, 'ఖుషి' విడుదలైన రోజునే గతవారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. -
పవన్ కళ్యాణ్ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు
ప్రస్తుతం సర్థార్ గబ్బర్‌సింగ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, తన నెక్ట్స్ సినిమా విషయంలో అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. స్టార్ హీరోలందరూ వరుస సినిమాలతో హవా చూపిస్తుంటే పవన్ మాత్రం సినిమాకు సినిమాకు మధ్యలో భారీ గ్యాప్ తీసుకుంటూ అభిమానులను నిరాశపరుస్తున్నాడు. ప్రస్తుతం సర్థార్ గబ్బర్‌సింగ్ షూటింగ్ ముగింపు దశలో ఉండటంతో పవర్ స్టార్ చేయబోయే నెక్ట్స్ సినిమాపై టాక్ మొదలైంది. ఇప్పటి వరకు పవన్ టీం నుంచి ఎలాంటి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రాకపోయినా, పవన్‌తో ఖుషి లాంటి బ్లాక్ బస్టర్, కొమరం పులి లాంటి డిజాస్టర్ అందించిన ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడన్న వార్త, ప్రముఖంగా వినిపించింది. అంతేకాదు అజిత్ హీరోగా నటించిన తమిళ సూపర్ హిట్ సినిమా వీరంను పవన్ తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడన్న వార్త తాజాగా వినిపిస్తోంది. వీటికి తోడు గోపాల గోపాల ఫేం కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడట. మరి ఈ మూడు సినిమాలో పవన్, ఏ సినిమాకు కమిట్ అవుతాడో తెలియక అభిమానులు, ఇండస్ట్రీ వర్గాలు తికమక పడుతున్నారు. -
అజిత్ హీరోగా హ్యాట్రిక్ సినిమా
తెలుగు సినిమా 'శౌర్యం'తో దర్శకుడిగా పరిచయం అయి, తర్వాత కోలీవుడ్ స్టార్ స్టేటస్ అందుకున్న దర్శకుడు శివ. సినిమాటోగ్రఫీ నుంచి దర్శకత్వం శాఖలోకి వచ్చిన ఈ డైరెక్టర్ తమిళనాట వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఓ కోలీవుడ్‌లో అజిత్ హీరోగా ఓ సూపర్ హిట్ సినిమాను అందించిన శివ అదే హీరోతో మరో సినిమాకు కమిట్ అయ్యాడు. శివ, అజిత్‌ల కాంభినేషన్ లో రూపొందిన తొలి సినిమా వీరం. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అదే దర్శకుడితో వేదలం సినిమాను చేశాడు అజిత్. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించటంతో ఇప్పుడు అదే కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్న అజిత్ రెండు నెలల పాటు షూటింగులకు దూరంగా ఉంటున్నాడు. దీంతో అజిత్, శివల కాంబినేషన్లో తెరకెక్కనున్న మూడో సినిమాను సంక్రాంతికి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే వీరం, ఎన్నై అరిందాల్, వేదలం సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్ లు సాధించిన అజిత్ మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి. -
అజిత్ లుక్ అదిరింది
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కొత్త సినిమా లుక్ సోషల్ మీడియాలో హవా చూపిస్తోంది. ఇటీవల వరుస బ్లాక్‌బస్టర్స్ తో కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న అజిత్ తన 56వ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు తలా 56గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు 'వేదలం' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు వీరం ఫేం శివ దర్శకుడు. ఈ సినిమా కోసం అజిత్ తన లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. చిన్నగా కట్ చేసిన హెయిర్ స్టైల్, లైట్‌గా గడ్డం, చెవులకు రింగులు, మెడలో, చేతికి స్టీల్ చైన్లు ఇలా మాస్ ఆడియన్స్ కు దేవుడిలా దర్శనమిస్తున్నాడు అజిత్. తమిళనాట మాస్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్.. ఈ రేంజ్ మాస్ లుక్‌లో కనిపించే సరికి సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు 'వి'తో స్టార్ట్ అయిన అజిత్ సినిమాలన్ని బాక్స్‌ఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేశాయి. 'వాలి', 'విలన్', 'వరలరు', 'వీరం' లాంటి సినిమాలు అజిత్ మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేశాయి. ఇప్పుడు అదే బాటలో వేదలం కూడా అజిత్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. -
అజిత్ ''వీరం'' మూవీ మేకింగ్
-
నాలో కూడా కొన్ని లోపాలున్నాయి!
‘‘ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆ విషయాన్ని నేను బాగా నమ్ముతాను. అందుకే, ఆరోగ్యం గురించి బాగా శ్రద్ధ తీసుకుంటాను’’ అన్నారు తమన్నా. అకాల భోజనం, మితిమీరిన ఆహారం కూడదని కూడా సలహా ఇస్తున్నారామె. ఈ మిల్క్ బ్యూటీ సినిమాల్లోకొచ్చి దాదాపు ఏడేళ్లయ్యింది. ఇన్నేళ్లల్లో తమన్నా శరీరాకృతిలో పెద్దగా మార్పు రాలేదు. సన్నగా ఉండటం కోసం ఆల్మోస్ట్ కడుపు మాడ్చేసుకుంటారా? అని అడిగినప్పుడు పై విధంగా స్పందించారామె. బరువు పెరుగుతామని కొంతమంది సరిగ్గా తినరని, అలా చేస్తే ఆరోగ్యం పాడవుతుందని, ఆరోగ్యానికి మంచివి ఎంచుకుని తింటే మంచిదని సూచించారామె. అది మాత్రమే కాదు.. చెడు ఉంటేనే మంచి విలువ తెలుస్తుందని చెబుతూ -‘‘ఈప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఉంటాయి. నాలో కూడా కొన్ని లోపాలున్నాయి. అవి ఎవరికీ హాని చేయని లోపాలు. అందుకే, వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయను. ఎందుకంటే, మంచి పక్కన చెడు ఉంటేనే.. మంచి బాగా ఎలివేట్ అవుతుంది’’ అని తెలిపారు. ప్రస్తుతం హిందీలో ‘ఇట్స్ ఎంటర్టైన్మెంట్’, ‘హమ్ షకల్స్’ చిత్రాల్లో నటిస్తున్నారామె. తెలుగులో ‘ఆగడు’, ‘బాహుబలి’ చిత్రాలు చేస్తున్నారు. ఈ ఏడాది తమిళ చిత్రాలపై కూడా దృష్టి పెట్టాలనుకుంటున్నానని తమన్నా పేర్కొన్నారు. జనరల్‌గా మీకెలాంటి సినిమాలంటే ఇష్టం అనే ప్రశ్న తమన్నా ముందుంచితే -‘‘నాకు పాపులర్ సినిమాల్లో నటించడం ఇష్టం. పాపులర్ సినిమాలంటే అన్ని వర్గాలవారూ చూడదగ్గవి అన్నమాట. ఆ తరహా సినిమాల్లో నటించడంవల్ల ప్రేక్షకులందరికీ దగ్గరవ గలుగుతాం అని నా ఫీలింగ్’’ అని చెప్పారు. -
వీరుడొక్కడే...
అజిత్, తమన్నా కాంబినేషన్లో తమిళంలో ‘వీరం’ చిత్రం రూపొందుతోంది. ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో విజయా ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్రామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కుల్ని ఓమిక్స్ క్రియేషన్స్ సంస్థ చేజిక్కించుకుంది. ‘వీరుడొక్కడే’ పేరుతో తెలుగులో విడుదల చేయబోతున్నారు. నిర్మాత డా.శ్రీనుబాబు .జి మాట్లాడుతూ -‘‘చాలా గట్టి పోటీలో ఈ హక్కుల్ని మేం సొంతం చేసుకున్నాం. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. అజిత్, తమన్నాపై స్విట్జర్లాండ్‌లో తీసిన పాటలు లవ్లీగా వచ్చాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా రాజమండ్రి, అరకులోయ, ఆర్ఎఫ్సీల్లో కూడా చిత్రీకరణ చేశారు. ముఖ్యంగా అరకులో 15 రోజులు తీసిన ట్రెయిన్ ఫైట్ ఈ చిత్రానికి హైలైట్. జనవరి మొదటి వారంలో పాటలు, చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. -
ఒకే రోజు తెరపైకి విజయ్, అజిత్ చిత్రాలు
తాజా పరిణామాలతో సంక్రాంతి చిత్రాల విడుదలలో ఆసక్తి నెలకొంది. అజిత్, విజయ్ చిత్రాలు ఒకే రోజున బరిలోకి దిగనుండటంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. విజయ్ తాజాగా నటిస్తున్న చిత్రం జిల్లా. ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్‌గుడ్ ఫిలింస్ అధినేత ఆర్బి చౌదరి నిర్మిస్తున్న చిత్రం ఇది. నవ దర్శకుడు నేశన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇళయదళపతి సరసన అందాల తార కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. డి.ఇమాన్ సంగీత బాణి లందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది. తుపాకీ చిత్రం విజయంతో రైజింగ్‌లో ఉన్న విజయ్ తదుపరి చిత్రం తలైవా నిరాశపరచింది. దీంతో జిల్లాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అదే విధంగా విజయ్ సూపర్‌గుడ్ ఫిలింస్ బ్యానర్ హిట్ కాంబినేషన్. దాన్ని ఈ చిత్రం రిపీట్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు. అయితే జిల్లా చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతుందనే ప్రచారం జరిగింది. కాదు జనవరి 10నే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత ఆర్బి చౌదరి వెల్లడించారు. ఈ చిత్రాన్ని విదేశాలలోనే 400 థియేటర్లలో రిలీజ్ చేయనున్నామని తెలిపారు. అజిత్ చిత్రం వీరం జనవరి 10న విడుదల చేయనున్నట్లు ఆ చిత్ర నిర్మాతలు ముందుగానే ప్రకటించారు. ప్రఖ్యా త నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్ పతాకంపై నిర్మాతలు వెంకట్రామిరెడ్డి, బి.భారతి రెడ్డి నిర్మిస్తున్న భారీ బడ్జెట్, భారీ తారాగణ చిత్రం వీరం. అజిత్ సరసన నటి తమన్నా తొలిసారిగా జతకడుతున్న ఈ చిత్రానికి చిరుతై ఫేమ్ శివ దర్శకుడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. పల్లెటూరి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ వైవిధ్యభరిత కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అక్రమాలను, అన్యాయాలను ఎదిరించే ధీరోదాత్త పాత్రలో అజిత్ నటించారు. ఈ చిత్రంపై అటు చిత్ర పరిశ్రమలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆడియోలోనూ పోటీనే విశేషం ఏమిటంటే జిల్లా, వీరం చిత్రాలు జనవరి పదిన విడుదలకు సిద్ధం అవుతుండగా చిత్ర ఆడియో విడుదలలోనూ పోటీపడుతున్నాయి. అజిత్ వీరం చిత్ర ఆడియో శుక్రవారం విడుదల కాగా విజయ్ జిల్లా చిత్ర ఆడియో శనివారం విడుదలకు రానుంది. అలాంటి ఈ రెండు చిత్రాల్లో ఏ చిత్రానికి ప్రేక్షకులు ఘన విజయాన్ని చేకూర్చుతారో వేచి చూడాల్సిందే. -
20న ‘వీరం’ ఆడియో ఆవిష్కరణ
వీరం చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం 20వ తేదీన నిర్వహించనున్నారు. ఆరంభం చిత్రం తరువాత అల్టిమేట్ స్టార్ అజిత్ నటిస్తున్న చిత్రం వీరం. ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.వెంకట్రామిరెడ్డి, బి.భారతి రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి చిరువై శివా దర్శకుడు. నటి తమన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో విధార్థ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. యువ సంగీత తరంగం దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. యువతను అలరించే విధంగా రూపొందిన ఈ సినిమా పాటలను ఈ నెల 20న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. చిత్రం పాటలే కాదు చిత్రం కూడా జనరంజకంగా రూపొందిందని ముఖ్యంగా అజిత్ పాత్ర చాలా వైవిద్యభరితంగా ఉంటుందని, దర్శకుడు శివ తెలిపారు. -
సంక్రాంతికి ముందే వీరం
నటుడు అజిత్ చిత్రం అంటే అందరిలోనూ ఆసక్తే. ఆయన అభిమానులకు మాత్రం అమితానందం. ఆడంబరాలకు పోవద్దంటారు. నిర్మొహమాటంగా ఉన్నదే మాట్లాడతారు. అభిమానుల్ని పిచ్చి అభిమానం చూపొద్దంటారు. సినిమా కార్యక్రమాలకు దూ రంగా ఉంటారు. మొత్తం మీద అజిత్ వ్యవహారశైలే ప్రత్యేకం. అలాంటి అజిత్ నటిం చిన ఆరంభం సినిమా ఇటీవల విడుదలై విజ యఢంకా మోగించింది. తాజాగా వీరంతో తెరపైకి రానున్నారు. తమన్నా తొలిసారిగా ఈయ న సరసన నటిం చిన చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చిరుతై ఫేమ్ శివ దర్శకత్వం వహిస్తు న్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అలాంటి ఈ చిత్రం సంక్రాంతికి ముందే జనవరి 10న విడుదలవుతూ అజిత్ అభిమానులకు పండుగ కానుంది. 1800 ప్రింట్లు చిత్ర విశేషాలను నిర్మాత వెంకట్రామరెడ్డి తెలుపుతూ వీరం చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1800 ప్రింట్లతో ఏకకాలంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అజిత్ చిత్రాల్లో అత్యధిక ప్రింట్లతో విడుదల కానున్న చిత్రం ఇదేనన్నారు. అజిత్ ఇందులో పూర్తిగా చొక్కా పం చెతో కనిపిస్తున్నారు. పూర్తి గ్రామీణ నేపథ్యం లో తెరకెక్కించిన చిత్రం వీరం అని తెలిపారు. అజిత్‌కు ఇందులో నలుగురు తమ్ముళ్లులుంటారన్నారు. ఆయన్నే నమ్ముకున్న పనివాడు ఐదో తమ్ముడి లాంటివాడని చెప్పారు. అన్యాయాలను ఎదిరించే అజిత్ చిత్ర కథ గురించి చెప్పాలంటే దిండిగల్ సమీపంలోని ఓట్టన్ చత్రంలో జరిగే సంఘటనల సమాహారంగా వీరం చిత్రాన్ని రూపొందిం చినట్లు తెలిపారు. ఆ గ్రామంలో జరిగే అన్యాయాలను అక్రమాలను ఎదిరించే పాత్రలో అజిత్ నటించారని చెప్పారు. ఈ చిత్రం కోసం ఒడిశా రాష్ట్రంలో నయాగర సమీపంలోని వంద ఎకరాల స్థలంలో ఓట్టన్ సత్రం గ్రామాన్ని సెట్ వేసినట్లు తెలిపారు. డూప్ లేకుండానే వీరం చిత్ర నిర్మాణానికి అజిత్ సహకారం మరువలేనిదన్నారు. చిత్రంలో ఎంతో రిస్కుతో కూడిన ట్రైన్ పోరాట దృశ్యాలను ఒడిశాలో ఒక రైలును అద్దెకు తీసుకుని చిత్రీకరించినట్లు వెల్లడించారు. ఈ సన్నివేశాల్లో అజిత్‌కు బదులు డూప్లో చిత్రీకరిద్దామన్నా వద్దంటూ అజిత్ బ్రిడ్జిపై వెళుతున్న రైలును పట్టుకుని వేలాడుతూ ఫైట్స్ చేశారని చెప్పా రు. ఈ పోరాట దృశ్యాలు నాలుగు కెమెరాలతో చిత్రీకరించినట్లు తెలిపారు. అదే విధంగా ఆలయ ఉత్సవాల సన్నివేశాలను ఒడిశాలోని ఒక దేవాలయంలో చిత్రీకరించినట్లు చెప్పారు. స్విట్జర్లాండ్‌లో గీతాలు చిత్రంలోని రెండు యువళగీతాలను స్విట్జర్లాం డ్లో చిత్రీకరించినట్లు చెప్పారు. షూటింగ్‌కు అంతరాయం ఉండకూడదని అజిత్ జ్వరంలోనూ ఒక వర్షం పాటలో నటించారని తెలిపా రు. చిత్రంలో నలుగురు తమ్ముళ్ల అన్నగా ఆయన నటన ఆ బాలగోపాలాన్ని అలరిస్తుందని నిర్మాత బి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. -
వదిన పాత్రలో...
టాలీవుడ్లో సమంత, కోలీవుడ్‌లో హన్సిక చక్రం తిప్పుతుంటే... రెంటికీ చెడ్డ రేవడిగా మారింది తమన్నా పరిస్థితి అంటూ గత కొన్నాళ్లుగా మీడియాలో ఓ రేంజ్ కథనాలు వచ్చాయి. కానీ ఇవేమీ లక్ష్యపెట్టకుండా.. నిదానంగా మళ్లీ బిజీ అయిపోయారు తమన్నా. తెలుగు సినిమాకు కొన్నాళ్లు, తమిళ సినిమాకు కొన్నాళ్లు ప్రాముఖ్యతనిస్తూ ఇన్నాళ్లూ కెరీర్ సాగించిన తమన్నా... ఈ దఫా తన బాణీ మార్చి అన్ని భాషలకూ సమప్రాధాన్యతనిస్తూ తెలివిగా దూసుకెళుతున్నారు. తమిళంలో అజిత్ సరసన ఆమె నటించిన ‘వీరమ్’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సైఫ్ అలీఖాన్‌కు జోడీగా ఆమె నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘హమ్ షకల్స్’ చిత్రం వచ్చే ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తమన్నా, అక్షయ్‌కుమార్ కలిసి నటిస్తున్న ‘ఇట్స్ ఎంటర్టైన్మెంట్’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్‌లో విడుదల చేయడానికి సదరు చిత్ర నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. ఇక తెలుగులో మహేష్ ‘ఆగడు’ ఎలాగూ ఉంది. ఈ విధంగా పక్కా ప్లానింగ్‌తో వెళుతున్నారు తమన్నా. సినిమాల్లో నటించేసి చేతులు దులిపేసుకోకుండా, ఆ సినిమా ప్రమోషన్లో కూడా విరివిగా పాల్గొని నిర్మాతకు అండగా నిలిచే కథానాయికల్లో తమన్నా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అదే పనిలో ఉంది. అమె నటించిన తమిళ చిత్రం ‘వీరమ్’ జనవరి 11న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లో యమ బిజీగా ఉన్నారు తమన్నా. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో తమన్నా మాట్లాడుతూ-‘‘ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నింటికీ కచ్చితంగా భిన్నమైన పాత్ర ఇందులో చేస్తున్నాను. ఇందులో నా పేరు మహాలక్ష్మి. అజిత్ భార్య పాత్ర. కథరీత్యా ఈ సినిమాలో నాకు ముగ్గురు మరుదులు ఉంటారు. చెడుమార్గం పట్టిన ఆ ముగ్గుర్నీ సన్మార్గంలోకి తీసుకొస్తా. ఇంతటి మెచ్యూర్డ్ పాత్ర చేయడం నా కెరీర్లో ఇదే ప్రథమం. అజిత్ సార్ పాత్ర రెబల్‌గా ఉంటుంది. ఆయనతో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభూతి. నా కెరీర్లో నేను పనిచేసిన హీరోలందరిలో సీనియర్ అజిత్‌సార్. దాదాపు 20ఏళ్ల కెరీర్ ఆయనది. ఈ సినిమా టైమ్‌లో ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. వచ్చే ఏడాది మా అందరికీ శుభారంభం ఈ సినిమా’’అని చెప్పారు. -
ఆగిన షూటింగ్
ఆంధ్రా స్టంట్ కళాకారులు అనూహ్యం గా అడ్డుకోవడంతో అజిత్ చిత్రం షూటింగ్ ఆగింది. అజిత్ తాజాగా నటిస్తున్న చిత్రం వీరం. తమన్న హీరోయిన్. ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చిరుతై ఫేం శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. అక్కడ పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. గురువారం ఆంధ్రా స్టంట్ కళాకారులు అనూహ్యంగా షూటింగ్ ప్రదేశానికి వచ్చారు. నిబంధనల ప్రకారం లోకల్ స్టంట్ కళాకారులకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. వారికి చిత్ర దర్శకుడు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగి సమస్య జటిలమైంది. దీంతో షూటింగ్ రద్దు చేయాల్సి వచ్చింది. పోరాట దృశ్యాల చిత్రీకరణను నిలిపి వేసి అజిత్, తమన్నపై సన్నివేశాలను చిత్రీకరించాలని దర్శకుడు నిర్ణయించుకున్నట్టు సమాచారం.