ఆగిన షూటింగ్
ఆగిన షూటింగ్
Published Fri, Oct 25 2013 4:18 AM | Last Updated on Fri, Sep 1 2017 11:56 PM
ఆంధ్రా స్టంట్ కళాకారులు అనూహ్యం గా అడ్డుకోవడంతో అజిత్ చిత్రం షూటింగ్ ఆగింది. అజిత్ తాజాగా నటిస్తున్న చిత్రం వీరం. తమన్న హీరోయిన్. ఈ చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చిరుతై ఫేం శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. అక్కడ పోరాట దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. గురువారం ఆంధ్రా స్టంట్ కళాకారులు అనూహ్యంగా షూటింగ్ ప్రదేశానికి వచ్చారు.
నిబంధనల ప్రకారం లోకల్ స్టంట్ కళాకారులకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. వారికి చిత్ర దర్శకుడు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగి సమస్య జటిలమైంది. దీంతో షూటింగ్ రద్దు చేయాల్సి వచ్చింది. పోరాట దృశ్యాల చిత్రీకరణను నిలిపి వేసి అజిత్, తమన్నపై సన్నివేశాలను చిత్రీకరించాలని దర్శకుడు నిర్ణయించుకున్నట్టు సమాచారం.
Advertisement
Advertisement