20న ‘వీరం’ ఆడియో ఆవిష్కరణ
20న ‘వీరం’ ఆడియో ఆవిష్కరణ
Published Mon, Dec 16 2013 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
వీరం చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం 20వ తేదీన నిర్వహించనున్నారు. ఆరంభం చిత్రం తరువాత అల్టిమేట్ స్టార్ అజిత్ నటిస్తున్న చిత్రం వీరం. ప్రముఖ నిర్మాణ సంస్థ విజయ ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.వెంకట్రామిరెడ్డి, బి.భారతి రెడ్డి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి చిరువై శివా దర్శకుడు. నటి తమన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విధార్థ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. యువ సంగీత తరంగం దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. యువతను అలరించే విధంగా రూపొందిన ఈ సినిమా పాటలను ఈ నెల 20న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. చిత్రం పాటలే కాదు చిత్రం కూడా జనరంజకంగా రూపొందిందని ముఖ్యంగా అజిత్ పాత్ర చాలా వైవిద్యభరితంగా ఉంటుందని, దర్శకుడు శివ తెలిపారు.
Advertisement
Advertisement