వదిన పాత్రలో... | Tamanna new roll in Veeram movie | Sakshi
Sakshi News home page

వదిన పాత్రలో...

Dec 9 2013 1:17 AM | Updated on Sep 2 2017 1:24 AM

టాలీవుడ్‌లో సమంత, కోలీవుడ్‌లో హన్సిక చక్రం తిప్పుతుంటే... రెంటికీ చెడ్డ రేవడిగా మారింది తమన్నా పరిస్థితి అంటూ గత కొన్నాళ్లుగా మీడియాలో ఓ రేంజ్ కథనాలు వచ్చాయి.

 టాలీవుడ్‌లో సమంత, కోలీవుడ్‌లో హన్సిక చక్రం తిప్పుతుంటే... రెంటికీ చెడ్డ రేవడిగా మారింది తమన్నా పరిస్థితి అంటూ గత కొన్నాళ్లుగా మీడియాలో ఓ రేంజ్ కథనాలు వచ్చాయి. కానీ ఇవేమీ లక్ష్యపెట్టకుండా.. నిదానంగా మళ్లీ బిజీ అయిపోయారు తమన్నా. తెలుగు సినిమాకు కొన్నాళ్లు, తమిళ సినిమాకు కొన్నాళ్లు ప్రాముఖ్యతనిస్తూ ఇన్నాళ్లూ కెరీర్ సాగించిన తమన్నా... ఈ దఫా తన బాణీ మార్చి అన్ని భాషలకూ సమప్రాధాన్యతనిస్తూ తెలివిగా దూసుకెళుతున్నారు. తమిళంలో అజిత్ సరసన ఆమె నటించిన ‘వీరమ్’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సైఫ్ అలీఖాన్‌కు జోడీగా ఆమె నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘హమ్ షకల్స్’ చిత్రం వచ్చే ఏడాది జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
 
  అలాగే తమన్నా, అక్షయ్‌కుమార్ కలిసి నటిస్తున్న ‘ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్‌లో విడుదల చేయడానికి సదరు చిత్ర నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. ఇక తెలుగులో మహేష్ ‘ఆగడు’ ఎలాగూ ఉంది. ఈ విధంగా పక్కా ప్లానింగ్‌తో వెళుతున్నారు తమన్నా. సినిమాల్లో నటించేసి చేతులు దులిపేసుకోకుండా, ఆ సినిమా ప్రమోషన్‌లో కూడా విరివిగా పాల్గొని నిర్మాతకు అండగా నిలిచే కథానాయికల్లో తమన్నా ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అదే పనిలో ఉంది. అమె నటించిన తమిళ చిత్రం ‘వీరమ్’ జనవరి 11న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో యమ బిజీగా ఉన్నారు తమన్నా.
 
  ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో తమన్నా మాట్లాడుతూ-‘‘ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నింటికీ కచ్చితంగా భిన్నమైన పాత్ర ఇందులో చేస్తున్నాను. ఇందులో నా పేరు మహాలక్ష్మి. అజిత్ భార్య పాత్ర. కథరీత్యా ఈ సినిమాలో నాకు ముగ్గురు మరుదులు ఉంటారు. చెడుమార్గం పట్టిన ఆ ముగ్గుర్నీ సన్మార్గంలోకి తీసుకొస్తా. ఇంతటి మెచ్యూర్డ్ పాత్ర చేయడం నా కెరీర్‌లో ఇదే ప్రథమం. అజిత్ సార్ పాత్ర రెబల్‌గా ఉంటుంది. ఆయనతో కలిసి పనిచేయడం ఓ గొప్ప అనుభూతి. నా కెరీర్‌లో నేను పనిచేసిన హీరోలందరిలో సీనియర్ అజిత్‌సార్. దాదాపు 20ఏళ్ల కెరీర్ ఆయనది. ఈ సినిమా టైమ్‌లో ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. వచ్చే ఏడాది మా అందరికీ శుభారంభం ఈ సినిమా’’అని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement