సంక్రాంతికి ముందే వీరం
సంక్రాంతికి ముందే వీరం
Published Mon, Dec 9 2013 4:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM
నటుడు అజిత్ చిత్రం అంటే అందరిలోనూ ఆసక్తే. ఆయన అభిమానులకు మాత్రం అమితానందం. ఆడంబరాలకు పోవద్దంటారు. నిర్మొహమాటంగా ఉన్నదే మాట్లాడతారు. అభిమానుల్ని పిచ్చి అభిమానం చూపొద్దంటారు. సినిమా కార్యక్రమాలకు దూ రంగా ఉంటారు. మొత్తం మీద అజిత్ వ్యవహారశైలే ప్రత్యేకం. అలాంటి అజిత్ నటిం చిన ఆరంభం సినిమా ఇటీవల విడుదలై విజ యఢంకా మోగించింది. తాజాగా వీరంతో తెరపైకి రానున్నారు. తమన్నా తొలిసారిగా ఈయ న సరసన నటిం చిన చిత్రాన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ విజయా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. చిరుతై ఫేమ్ శివ దర్శకత్వం వహిస్తు న్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అలాంటి ఈ చిత్రం సంక్రాంతికి ముందే జనవరి 10న విడుదలవుతూ అజిత్ అభిమానులకు పండుగ కానుంది.
1800 ప్రింట్లు
చిత్ర విశేషాలను నిర్మాత వెంకట్రామరెడ్డి తెలుపుతూ వీరం చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1800 ప్రింట్లతో ఏకకాలంలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. అజిత్ చిత్రాల్లో అత్యధిక ప్రింట్లతో విడుదల కానున్న చిత్రం ఇదేనన్నారు. అజిత్ ఇందులో పూర్తిగా చొక్కా పం చెతో కనిపిస్తున్నారు. పూర్తి గ్రామీణ నేపథ్యం లో తెరకెక్కించిన చిత్రం వీరం అని తెలిపారు. అజిత్‌కు ఇందులో నలుగురు తమ్ముళ్లులుంటారన్నారు. ఆయన్నే నమ్ముకున్న పనివాడు ఐదో తమ్ముడి లాంటివాడని చెప్పారు.
అన్యాయాలను ఎదిరించే అజిత్
చిత్ర కథ గురించి చెప్పాలంటే దిండిగల్ సమీపంలోని ఓట్టన్ చత్రంలో జరిగే సంఘటనల సమాహారంగా వీరం చిత్రాన్ని రూపొందిం చినట్లు తెలిపారు. ఆ గ్రామంలో జరిగే అన్యాయాలను అక్రమాలను ఎదిరించే పాత్రలో అజిత్ నటించారని చెప్పారు. ఈ చిత్రం కోసం ఒడిశా రాష్ట్రంలో నయాగర సమీపంలోని వంద ఎకరాల స్థలంలో ఓట్టన్ సత్రం గ్రామాన్ని సెట్ వేసినట్లు తెలిపారు.
డూప్ లేకుండానే
వీరం చిత్ర నిర్మాణానికి అజిత్ సహకారం మరువలేనిదన్నారు. చిత్రంలో ఎంతో రిస్కుతో కూడిన ట్రైన్ పోరాట దృశ్యాలను ఒడిశాలో ఒక రైలును అద్దెకు తీసుకుని చిత్రీకరించినట్లు వెల్లడించారు. ఈ సన్నివేశాల్లో అజిత్‌కు బదులు డూప్‌లో చిత్రీకరిద్దామన్నా వద్దంటూ అజిత్ బ్రిడ్జిపై వెళుతున్న రైలును పట్టుకుని వేలాడుతూ ఫైట్స్ చేశారని చెప్పా రు. ఈ పోరాట దృశ్యాలు నాలుగు కెమెరాలతో చిత్రీకరించినట్లు తెలిపారు. అదే విధంగా ఆలయ ఉత్సవాల సన్నివేశాలను ఒడిశాలోని ఒక దేవాలయంలో చిత్రీకరించినట్లు చెప్పారు.
స్విట్జర్లాండ్‌లో గీతాలు
చిత్రంలోని రెండు యువళగీతాలను స్విట్జర్లాం డ్‌లో చిత్రీకరించినట్లు చెప్పారు. షూటింగ్‌కు అంతరాయం ఉండకూడదని అజిత్ జ్వరంలోనూ ఒక వర్షం పాటలో నటించారని తెలిపా రు. చిత్రంలో నలుగురు తమ్ముళ్ల అన్నగా ఆయన నటన ఆ బాలగోపాలాన్ని అలరిస్తుందని నిర్మాత బి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
Advertisement