నాలో కూడా కొన్ని లోపాలున్నాయి! | i also did some mistakes : tamanna | Sakshi
Sakshi News home page

నాలో కూడా కొన్ని లోపాలున్నాయి!

Published Fri, Jan 10 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

నాలో కూడా కొన్ని లోపాలున్నాయి!

నాలో కూడా కొన్ని లోపాలున్నాయి!

  ‘‘ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆ విషయాన్ని నేను బాగా నమ్ముతాను. అందుకే, ఆరోగ్యం గురించి బాగా శ్రద్ధ తీసుకుంటాను’’ అన్నారు తమన్నా. అకాల భోజనం, మితిమీరిన ఆహారం కూడదని కూడా సలహా ఇస్తున్నారామె. ఈ మిల్క్ బ్యూటీ సినిమాల్లోకొచ్చి దాదాపు ఏడేళ్లయ్యింది. ఇన్నేళ్లల్లో తమన్నా శరీరాకృతిలో పెద్దగా మార్పు రాలేదు. సన్నగా ఉండటం కోసం ఆల్‌మోస్ట్ కడుపు మాడ్చేసుకుంటారా? అని అడిగినప్పుడు పై విధంగా స్పందించారామె. బరువు పెరుగుతామని కొంతమంది సరిగ్గా తినరని, అలా చేస్తే ఆరోగ్యం పాడవుతుందని, ఆరోగ్యానికి మంచివి ఎంచుకుని తింటే మంచిదని సూచించారామె. అది మాత్రమే కాదు.. చెడు ఉంటేనే మంచి విలువ తెలుస్తుందని చెబుతూ -‘‘ఈప్రపంచంలో ఎవరూ పర్‌ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరిలోనూ లోపాలు ఉంటాయి. నాలో కూడా కొన్ని లోపాలున్నాయి. అవి ఎవరికీ హాని చేయని లోపాలు. అందుకే, వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయను. ఎందుకంటే, మంచి పక్కన చెడు ఉంటేనే.. మంచి బాగా ఎలివేట్ అవుతుంది’’ అని తెలిపారు.
 
  ప్రస్తుతం హిందీలో ‘ఇట్స్ ఎంటర్‌టైన్‌మెంట్’, ‘హమ్ షకల్స్’ చిత్రాల్లో నటిస్తున్నారామె. తెలుగులో ‘ఆగడు’, ‘బాహుబలి’ చిత్రాలు చేస్తున్నారు. ఈ ఏడాది తమిళ చిత్రాలపై కూడా దృష్టి పెట్టాలనుకుంటున్నానని తమన్నా పేర్కొన్నారు. జనరల్‌గా మీకెలాంటి సినిమాలంటే ఇష్టం అనే ప్రశ్న తమన్నా ముందుంచితే -‘‘నాకు పాపులర్ సినిమాల్లో నటించడం ఇష్టం. పాపులర్ సినిమాలంటే అన్ని వర్గాలవారూ చూడదగ్గవి అన్నమాట. ఆ తరహా సినిమాల్లో నటించడంవల్ల ప్రేక్షకులందరికీ దగ్గరవ గలుగుతాం అని నా ఫీలింగ్’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement