అక్షయ్ కుమార్
నాన్‌చాక్ పట్టుకుని ‘నేను రెడీ’ అంటున్నారు బచ్చన్ పాండే. అక్షయ్ కుమార్ నటించనున్న తాజా చిత్రానికి ‘బచ్చన్ పాండే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలోని అక్షయ్ లుక్‌తో పాటు సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్‌కు విడు దల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం అజిత్ నటించిన తమిళ చిత్రం ‘వీరమ్’కి (తెలుగులో ‘కాటమరాయుడు’ గా రీమేక్ అయ్యింది) హిందీ రీమేక్ అని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ప్రస్తుతం లక్ష్మీబాంబ్, సూర్యవన్షీ సినిమాలతో బిజీగా ఉన్నారు అక్షయ్. అలాగే ఆయన నటించిన ‘మిషన్ మంగళ్’ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment