వీరుడొక్కడే... | Veeram will be titled Veerudokkade in Telugu | Sakshi
Sakshi News home page

వీరుడొక్కడే...

Published Tue, Dec 31 2013 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM

అజిత్, తమన్నా

అజిత్, తమన్నా

అజిత్, తమన్నా కాంబినేషన్‌లో తమిళంలో ‘వీరం’ చిత్రం రూపొందుతోంది. ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో విజయా ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్రామిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హక్కుల్ని ఓమిక్స్ క్రియేషన్స్ సంస్థ చేజిక్కించుకుంది. ‘వీరుడొక్కడే’ పేరుతో తెలుగులో విడుదల చేయబోతున్నారు. నిర్మాత డా.శ్రీనుబాబు .జి మాట్లాడుతూ -‘‘చాలా గట్టి పోటీలో ఈ హక్కుల్ని మేం సొంతం చేసుకున్నాం. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. అజిత్, తమన్నాపై స్విట్జర్లాండ్‌లో తీసిన పాటలు లవ్లీగా వచ్చాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా రాజమండ్రి, అరకులోయ, ఆర్‌ఎఫ్‌సీల్లో కూడా చిత్రీకరణ చేశారు. ముఖ్యంగా అరకులో 15 రోజులు తీసిన ట్రెయిన్ ఫైట్ ఈ చిత్రానికి హైలైట్. జనవరి మొదటి వారంలో పాటలు, చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement