vedhalam
-
టాలీవుడ్లో వేదలం రీమేక్..?
ప్రజెంట్ టాలీవుడ్ టాప్ హీరోలందరూ రీమేక్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలు వరుసగా రీమేక్ సినిమాలు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమాను కత్తి సినిమా రీమేక్‌గా తెరకెక్కిస్తుండగా, రామ్ చరణ్ ధృవ సినిమాను తనీఒరువన్ రీమేక్‌గా రూపొందిస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రీమేక్ సినిమానే చేస్తున్నాడు. అజిత్ హీరోగా తెరకెక్కిన వీరం సినిమాను తెలుగులో కాటమరాయుడు పేరుతో రీమేక్ చేస్తున్నాడు అజిత్. టాలీవుడ్ రీమేక్ స్పెషలిస్ట్ వెంకటేష్ కూడా మరోసారి రీమేక్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఇటీవల తమిళ, హిందీ భాషల్లో సక్సెస్ సాధించిన సాలాఖద్దూస్ సినిమాను గురు పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ లిస్ట్‌లో మరో తమిళ సినిమా చేరింది. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన వేదలం సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాను సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిచనున్నారు. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమా నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. -
వేదలం రీమేక్‌లో బాలయ్య..?
తమిళ స్టార్ అజిత్ హీరోగా ఇటీవల ఘనవిజయం సాధించిన సినిమా వేదలం. సిస్టర్ సెంటిమెంట్‌తో మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా వరదల సమయంలో రిలీజ్ అయినా, భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ముఖ్యంగా దర్శకుడు శివ టేకింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తెలుగులో ఈ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి రీమేక్ సినిమాల మీద పెద్దగా ఇంట్రస్ట్ చూపించని జూనియర్.. ఈ ప్రాజెక్ట్‌ను కూడా పక్కన పెట్టేశాడు. దీంతో బాలకృష్ణ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఇప్పటికే బాలయ్యను కలిసిన వేదలం నిర్మాతలు ఆయన అంగీకారం కోసం వెయిట్ చేస్తున్నారు. -
అజిత్ లుక్ అదిరింది
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కొత్త సినిమా లుక్ సోషల్ మీడియాలో హవా చూపిస్తోంది. ఇటీవల వరుస బ్లాక్‌బస్టర్స్ తో కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న అజిత్ తన 56వ సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు తలా 56గా ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు 'వేదలం' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు వీరం ఫేం శివ దర్శకుడు. ఈ సినిమా కోసం అజిత్ తన లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. చిన్నగా కట్ చేసిన హెయిర్ స్టైల్, లైట్‌గా గడ్డం, చెవులకు రింగులు, మెడలో, చేతికి స్టీల్ చైన్లు ఇలా మాస్ ఆడియన్స్ కు దేవుడిలా దర్శనమిస్తున్నాడు అజిత్. తమిళనాట మాస్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అజిత్.. ఈ రేంజ్ మాస్ లుక్‌లో కనిపించే సరికి సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. దీనికి తోడు 'వి'తో స్టార్ట్ అయిన అజిత్ సినిమాలన్ని బాక్స్‌ఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేశాయి. 'వాలి', 'విలన్', 'వరలరు', 'వీరం' లాంటి సినిమాలు అజిత్ మార్కెట్ స్టామినాను ప్రూవ్ చేశాయి. ఇప్పుడు అదే బాటలో వేదలం కూడా అజిత్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు ఫ్యాన్స్.