వేదలం రీమేక్లో బాలయ్య..? | vedhalam movie remake on bala krishna court | Sakshi
Sakshi News home page

వేదలం రీమేక్లో బాలయ్య..?

Published Wed, Dec 23 2015 3:58 PM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

వేదలం రీమేక్లో బాలయ్య..?

వేదలం రీమేక్లో బాలయ్య..?

తమిళ స్టార్ అజిత్ హీరోగా ఇటీవల ఘనవిజయం సాధించిన సినిమా వేదలం. సిస్టర్ సెంటిమెంట్తో మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా వరదల సమయంలో రిలీజ్ అయినా, భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ముఖ్యంగా దర్శకుడు శివ టేకింగ్కు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

తెలుగులో ఈ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి రీమేక్ సినిమాల మీద పెద్దగా ఇంట్రస్ట్ చూపించని జూనియర్.. ఈ ప్రాజెక్ట్ను కూడా పక్కన పెట్టేశాడు. దీంతో బాలకృష్ణ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఇప్పటికే బాలయ్యను కలిసిన వేదలం నిర్మాతలు ఆయన అంగీకారం కోసం వెయిట్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement