మౌనం మారణాయుధంతో సమానం | Krish and Balakrishna's 'NTR Mahanayakudu' trailer released! | Sakshi
Sakshi News home page

మౌనం మారణాయుధంతో సమానం

Published Sun, Feb 17 2019 2:10 AM | Last Updated on Sun, Feb 17 2019 2:10 AM

Krish and Balakrishna's 'NTR Mahanayakudu' trailer released! - Sakshi

బాలకృష్ణ

ప్రముఖ దివంగత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్‌ ‘యన్‌.టి.ఆర్‌’. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ ‘యన్‌.టి.ఆర్‌: కథానాయకుడు’ పేరుతో జనవరి 9న విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ రాజకీయ నేపథ్యంలో రూపొందిన ‘యన్‌.టి.ఆర్‌: మహానాయకుడు’ ఈ నెల 22న విడుదల కానుంది. ఎన్టీఆర్‌ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటించి, నిర్మించారు.

సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సహ నిర్మాతలు. క్రిష్‌ దర్శకత్వం వహించారు. ‘యన్‌.టి.ఆర్‌: మహానాయకుడు’ సెన్సార్‌ పూర్తయింది. ఈ చిత్రం నిడివి 2 గంటల 8 నిమిషాలు. ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ‘‘నిశ్శబ్దాన్ని చేతకానితనం అనుకోవద్దు. మౌనం మరాణాయుధంతో సమానమని మర్చిపోకు’, ‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ గడపలకు పసుపునై బతకడానికొచ్చాను’ అనే డైలాగ్స్‌తో ట్రైలర్‌ సాగింది. కల్యాణ్‌ రామ్, రానా, విద్యాబలన్‌ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి కీరవాణి స్వరకర్త.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement