ntr biopic movie
-
'మహా నాయకుడు' టిక్కెట్లు ఫ్రీ
-
అది కూడా తెలియని మీరేం ఐటీ మంత్రి లోకేషూ!
సాక్షి, హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ స్వయంగా నటించి, నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ‘మహానాయకడు’ చిత్రం బాక్సాఫిస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నందమూరి హీరో, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నటించి, నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ పేరుతో వచ్చిన పార్ట్-2లో చంద్రబాబు వెన్నుపోటు పొడవలేదు, పార్టీని రక్షించిన హీరో అని చిత్రీకరించారు. భారీ పబ్లిసిటీతో రిలీజ్ చేశారు. చరిత్రను వక్రీకరించారని పసిగట్టిన ప్రేక్షకులు కర్రు కాల్చి వాత పెట్టారు. నరకాసురుడు ఎప్పటికి విలనే, హీరో కాలేడు.’ అంటూ ట్వీట్ చేశారు. మరో సెటైరిక్ ట్వీట్లో సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌ను ఏకీపారేశారు. గెలుస్తామనే ఆత్మ విశ్వాసం ఉన్నవాళ్లు దేనికీ భయపడరని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విజయాన్ని అడ్డుకోలేరని ధైర్యంగా చెప్పుతారని, పతనం తప్పదని గ్రహించిన వాళ్లే ఇతరులపై ఏడుస్తారన్నారు. ‘అదిగో వాళ్లెవరెవరో కలిసి పోయారు. చూశారా ఆయన్నుఈయన తిట్టడం లేదు. కుట్ర పన్నుతున్నారంటూ క్షణక్షణం వణికిపోతుంటారు’ అని పేర్కొన్నారు. ఇక కమీషన్ల కోసం చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మెస్తున్నాడని మండిపడ్డారు. కేజీ బేసిన్ గ్యాస్‌ను ఏపీ గ్యాస్ కార్పోరేషన్‌ను కాదని, రిలయన్స్‌కు అప్పగించి లక్షల కోట్ల నష్టం కల్గించాడని, కాకినాడలో రిఫైనరీ ఏర్పాటుకు ముందుకొచ్చిన ప్రభుత్వ రంగ హెచ్‌పీసీఎల్‌ను కాదని హల్దియా పెట్రో అనే కంపెనీకి 15వేల కోట్ల రాయితీలిస్తున్నాడని తెలిపారు. ఏదీ.. అరెస్ట్ చేయండి? ‘ట్వీట్లు,ఫేస్ బుక్ సాకుగా చూపిస్తూ అరెస్ట్‌లు చేయొద్దంటూ 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా తెలియని మీరేం ఐటీ మంత్రి లోకేషూ!’ అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ‘ఆ రూలు వర్తింపచేస్తే మీ ట్వీట్లకు రోజుకు ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? ముందు మీ డాడీ షాడో నుంచి బైటకు రా.. చింతమనేని దళితులను దూషించే వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి’ అని సవాల్ విసిరారు. -
‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ప్రీమియర్ షో
-
నిజాలను దాచేసే సినిమాలెందుకు?
ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఏ నాటికయినా ఇబ్బంది రాకుండా ఉండటానికే బాలకృష్ణను వియ్యంకుడిని చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలలో ఎన్టీఆర్ ఇమేజ్ అవసరం కాబట్టి బావమరిది చేత రెండు సినిమాలు తీయించ బూనుకున్నారు. బాలకృష్ణ తన తండ్రి ప్రజాజీవిత వ్యక్తిత్వాన్ని నిజాయితీగా చిత్రీకరిస్తే చంద్రబాబును విలన్‌గా చూపిం చాలి. ఎన్టీఆర్ చివరి శ్వాస వరకూ జరిగిన ఘటనలను మహానాయకుడు చిత్రీకరిస్తే మాత్రం చంద్రబాబు పాత్రలో వక్రీకరణలు తప్పవు. ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలో వక్రీకరణలకు ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత రాం గోపాల్ వర్మ నిర్మించబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏమన్నా సమాధానం చెబుతుందేమో చూడాలి. వి డోంట్ నీడ్ ఎన్టీఆర్ (మాకు ఎన్టీఆర్ అవసరం లేదు) అని ఎన్టీరామారావు నుంచి అధికారం లాక్కున్న కొద్ది రోజులకే ఒక స్థానిక ఆంగ్ల దిన పత్రికకు చంద్రబాబు నాయుడు ఇంటర్వూ్య ఇచ్చిన సమయానికి నందమూరి బాలకృష్ణ ఆయనతోనే ఉన్నాడు. బాలకృష్ణ, హరికృష్ణ మొదలయిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా ఆ సమయంలో చంద్రబాబు వెంటనే ఉన్నారు. ఎన్టీ రామారావును దుర్మార్గంగా పదవీచ్యుతుడిని చేసిన తరువాత సచివాలయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో గోడలకు ఉన్న ఫొటోలను తీసి మరుగు దొడ్ల పక్కన పడేస్తే మీడియా వాళ్ళు ఫొటోలు తీసి ప్రచురించిన విషయం ప్రపంచానికి తెలుసు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించిన రసీదు పుస్తకాల మీద పార్టీ ఆవిర్భావం నుంచీ ప్రచురిస్తూ వచ్చిన ఎన్టీఆర్ బొమ్మను తొలగించేసిన చంద్రబాబు తరువాత హరికృష్ణ అలగడంతో తిరిగి ఆ రసీదు పుస్తకాలను మార్చి ఎన్టీఆర్ బొమ్మ ముద్రించిన విషయమూ తెలుసు. ఇప్పుడు ఎన్టీరామారావు స్థాపించిన పార్టీ అని, ఆయన విగ్రహాలకు దండలు వేసినంత మాత్రాన ఆయన మీద చెప్పులు వేయించిన విషయం ఎవరూ మరిచిపోరు. ఎన్నికలలో గెలుపు కోసం ఎన్టీఆర్ భజన తప్ప ఈ బృందం ఆయనను నిజాయితీగా గౌరవించింది ఎప్పుడూ లేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి కాబట్టి ఎన్టీఆర్ స్తోత్ర పారాయణంలో స్వరం పెంచారు చంద్రబాబు. ప్రపంచంలో ప్రతి విషయాన్ని పదవి కోణంలో నుండి చూడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈ అయిదేళ్ళ కాలంలో చంద్రబాబు పరిపాలనను చూసిన జనం మార్పు కోరుతున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్న తరుణంలో మళ్ళీ ఒకసారి ఎన్టీఆర్‌ను ఎన్నికలలో లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం సినిమాల రూపంలో మొదలుపెట్టారు చంద్రబాబు. బాలకృష్ణ తన తండ్రి జీవితాన్ని వెండితెరకు ఎక్కిస్తుంటే చంద్ర బాబును ఎందుకు మధ్యలోకి తేవడం అని ఎవరయినా అనుకోవొచ్చు. చంద్రబాబు అన్నీ అట్లాగే చేస్తారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఏ నాటికయినా ఇబ్బంది రాకుండా ఉండటానికే బాలకృష్ణను వియ్యంకుడిని చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎన్నికలలో ఎన్టీఆర్ ఇమేజ్ అవసరం కాబట్టి బావమరిది చేత రెండు సినిమాలు తీయించ బూనుకున్నారు. మొదటిది ఎన్టీఆర్ కథానాయకుడు ఇప్పటికే విడుదల అయింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ నట జీవితం చివరన రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించే వరకే చూపించారు. ఎన్టీఆర్ రాజకీయాలు, ఎన్నికలు, అధికారంలోకి రావడం ఇట్లాంటివన్నీ ఉండే రెండో భాగం ఎన్టీఆర్ మహా నాయకుడు ఎల్లుండి విడుదల కాబోతున్నది. మొదటి భాగం కథానాయకుడును జనం పెద్దగా ఆదరించలేదు. ఈ రెండో భాగం ఎట్లా ఉండబోతున్నది అన్న ఆసక్తి అందరిలో నెలకొన్నది. దాని గురించి పెద్దగా ఆలోచించడానికి ఏముంది? ఎన్టీరామారావు రాజకీయాల్లో నిలబడటానికి, కొనసాగడానికీ విజయాలు సాధించడానికీ బాబు నిర్వహించిన గొప్ప పాత్ర ప్రముఖంగా ఉంటుందన్నది నిర్వివాదాంశం. ఎన్టీరామారావు కథానాయకుడిగా తీసిన మొదటి భాగం పెద్ద ఇబ్బందికరమైందేమీ కాదు. రెండవ భాగం అట్లా కాదు రెండు ఆగస్టు సంక్షోభాలను ఇందులో తెరకెక్కించాలి. 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కర్‌రావు చేసింది ఎన్టీఆర్‌కు వెన్నుపోటు అయితే, 1995 ఆగస్టులో బాబు చేసింది కూడా ఎన్టీఆర్‌కు వెన్నుపోటే కావాలి, బాబు చేసింది ప్రభుత్వాన్ని, పార్టీని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభీష్టం మేరకు జరిగినదిగా భావిస్తే 84లో నాదెండ్ల చేసిందీ అదే అనుకోవాలి, అయితే నాదెండ్ల విఫలం అయ్యారు, బాబు సఫలం అయ్యారు. ఇవన్నీ ఎట్లా చూపిస్తారు ఈ సినిమాలో, అసలు చూపిస్తారా లేదా? ఆ రెండు ఎపిసోడ్లు లేకుండా ఎన్టీఅర్ రాజ కీయ జీవితాన్ని తెరకు ఎక్కించడం ఎట్లా సాధ్యం? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులనూ, రాజ కీయ పరిశీలకులనూ వేధిస్తూ ఉండవచ్చు. ఈ మధ్యలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి జీవి తంలోని ఒక స్వల్ప ఘట్టం, ఎంతో ముఖ్యమయిన ఘట్టం కూడా, పాదయాత్రను ఆధారం చేసుకుని తీసిన యాత్ర సినిమా అద్భుత ప్రజాదరణ పొందింది. ఈ సినిమా రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి కొంత లాభం చేస్తే చెయ్యొచ్చు కానీ అందుకోసమే తీసిన సినిమా కాదు, ఎందుకంటే ఇందులో ఎన్నికలలో లబ్ధి కోసం ఉద్దేశించిన వక్రీకరణలు లేవు. అటువంటి వక్రీకరణలకు ఈ సినిమాలో అవకాశం కూడా లేదు. యాత్ర తీసిన వాళ్ళు చాలా స్పష్టంగా వైఎస్ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొం టున్న కొన్ని తీవ్ర సమస్యలకు అధికారంలోకి రాగానే కనుగొన్న పరిష్కారాలకు సంబంధించినంత వరకే పరిమితం అయ్యారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రైతు రుణమాఫీ అందులో ప్రధానమైనవి. ఈ పథకాల కారణంగా రాజశేఖరరెడ్డి పరిపాలనలో లాభపడ్డ కోట్లాది మందికి కొత్తగా చెప్పాల్సింది, మెప్పించాల్సింది ఏమీ లేదు. ఇంకెవరికో రాజకీయ లబ్ధి చేకూరేందుకు కాకుండా ప్రజా జీవి తంలో వైఎస్ ఆర్ వ్యక్తిత్వాన్ని చిత్రీకరించడం వరకే పరిమితం అయ్యారు కాబట్టి యాత్ర సినిమా అందరినీ ఆకట్టుకున్నది. మరి ఎన్టీఆర్ రాజకీయ జీవి తాన్ని తెరకు ఎక్కించాలనుకుంటున్న బాలకృష్ణ కేవలం ఆయన ప్రజాజీవిత వ్యక్తిత్వాన్ని నిజాయితీగా చిత్రీకరిస్తారా లేక చంద్రబాబు రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా తీస్తారా అన్నది చూడాలి. నిజాయితీగా తీస్తే చంద్రబాబును విలన్‌గా చూపించాలి. ఎందుకంటే ఎన్టీఆర్ చెప్పిన చివరి మాటలు అవే కదా. జామాతా దశమగ్రహం అన్నాడు ఎన్టీఆర్ చంద్రబాబును ఉద్దేశించి. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అతడిని నమ్మడమే అని కూడా చివరి మాటల్లో బాధపడ్డాడు ఎన్టీఆర్. పోనీ చంద్రబాబు పాత్ర లేకుండా ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని సినిమాగా తీస్తారా, అదెట్లా సాధ్యం? మా నాయకురాలు కోరితే మామ మీద అయినా పోటీ చేస్తాను అన్న దగ్గరి నుంచి వైస్రాయ్ కుట్ర దాకా చంద్రబాబు పాత్ర లేకుండా ఎన్టీఆర్ రాజకీయ సినిమా ఎట్లా తీస్తారు? చంద్రబాబు ఒక్కడే కాదు లక్ష్మీ పార్వతి లేకుండా కూడా ఈ సినిమా సంపూర్ణం కాదు. అయితే తనను గొప్ప రాజకీయ దురంధరుడిగా, లక్ష్మీపార్వతి ఒక చవకబారు స్త్రీగా చిత్రించే విధంగా గతంలో పుస్తకాలు రాయించిన చరిత్ర చంద్రబాబుది. బాలకృష్ణ తీసే సినిమాలో కూడా బావగారి రాజకీయ చతురత, పరిపాలనా సామర్థ్యం ముందు పీఠిన ఉండి మొత్తానికి ఎన్టీఆర్ వ్యక్తిత్వం మరుగున పడే ప్రమాదం ఉంది. ఎన్టీఆర్ చివరి శ్వాస వరకూ ఈ సిన్మా ఉంటే మాత్రం చంద్రబాబు పాత్రలో విపరీతమైన వక్రీకరణలు తప్పవు. ప్రజా జీవితంలో ఎన్టీఆర్ మహనీయతకు మహానాయకుడు సినిమాలో చంద్రగ్రహణం తప్పదు. నా తండ్రి వంగవీటి రంగాను హత్య చేయించింది తెలుగుదేశంవారు కాదు అని ఆయన కుమారుడు రాధా చేత చెప్పించి రాజకీయ నడివీధిలో అతడిని వదిలేయగలిగిన తెలివితేటలూ చంద్రబాబువి. అటువంటి చంద్రబాబు బాలకృష్ణ చేత ఈ సినిమాలో మా బావ బంగారం అనిపించకుండా ఉంటాడని ఎట్లా అనుకుందాం. ఎన్టీఆర్ మరణించిన 23 ఏళ్ళ తరువాత ఇప్పుడెందుకు ఆయన జీవితాన్ని తెరకెక్కించాలని అని పించింది అంటే రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో లబ్ధి కోసమే అనడంలో సందేహం లేదు. మరి రాజశేఖరరెడ్డి మీద సినిమా ఆయన మరణించిన పదేళ్లకు ఎందుకు తీయాల్సి వొచ్చింది అన్న ప్రశ్న కూడా చంద్రబాబు అభిమానులు అడగొచ్చు. రాజశేఖర్ రెడ్డి సినిమా తీసింది ఆయన కొడుకు కాదు, రాజకీయాల్లో కూడా లేడు. ఎన్టీఆర్ సినిమా తీస్తున్నది ఆయన కుమారుడు, రాజకీయంగా తన బావకు, తద్వారా తన అల్లుడికి లాభం చెయ్యాలని అనుకుంటున్న వ్యక్తి. బాలకృష్ణ తీయబోయే ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలో వక్రీకరణలకు ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత రాం గోపాల్ వర్మ నిర్మించబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఏమన్నా సమాధానం చెబుతుందేమో చూడాలి. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనగానే ఇది లక్ష్మీ పార్వతికి అనుకూలంగా ఉంటుందనే భావన వెంటనే కలుగుతుంది, 1989లో ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం ఘోర పరాజయం నుండి ఆయన తుది శ్వాస దాకా ఉండే ఈ సినిమాలో అయినా లక్ష్మీపార్వతి పాత్రకు న్యాయం జరుగుతుందేమో చూడాలి. - దేవులపల్లి అమర్ datelinehyderabad@gmail.com -
సత్యమే గెలిచింది.. జై ఎన్టీఆర్ : వర్మ
సాధారణంగా బయోపిక్ అంటే, జీవితంలోని అన్ని విషయాలూ కాకపోయినా ముఖ్యమైన విషయాల్ని తెరకెక్కించాల్సి ఉంటుంది. అయితే స్వర్గీయ ఎన్టీఆర్‌పై ఏకకాలంలో బయోపిక్‌లు వస్తుండటంతో వీటిల్లో ఏది యధార్థానికి దగ్గరగా ఉంటుంది అనే విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చసాగుతోంది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన లక్ష్మీస్ ఎన్టీఆర్, ఎన్టీఆర్‌పై వస్తున్న మరో చిత్రం మహానాయకుడులో నిజాయితీతో తీసిన ఎన్టీఆర్ బయోపిక్ ఏదంటూ వర్మ ట్విట్టర్లో పోల్ నిర్వహించారు. ఎన్టీఆర్ బయోపిక్‌లలో ఏది నిజాయితీతో, యధార్థ సంఘటనలకు దగ్గరగా ఉన్న చిత్రం అంటూ వర్మపెట్టిన పోల్‌కు నెటిజన్లు భారీగా స్పందించారు. వర్మ పోల్‌కు 41, 734 ఓట్లు రాగా, అందులో 85 శాతం లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు ఓటు వేయగా, కేవలం 15 శాతం నెటిజన్లు మాత్రమే మహానాయకుడుకు బాసటగా నిలిచారు. ఈ పోల్ రిజల్ట్‌ను పోస్ట్ చేస్తూ సత్యమే గెలిచింది.. జై ఎన్టీఆర్ అంటూ వర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి మొదటి వారంలో విడుదల కానుంది. Which film will be more honest and truthful ? — Ram Gopal Varma (@RGVzoomin) February 17, 2019 ఇక ఇప్పటికే వచ్చిన కథా నాయకుడు రిలీజ్ తర్వాత... అది వాస్తవాలకు దూరంగా ఉందని భావించిన ప్రజలు వర్మ మూవీ కోసం ఎదురుచూడటం మొదలుపెట్టారు. మహానాయకుడులో వెన్నుపోటు ఎపిసోడ్‌ని మేనేజ్ చేసి ఉంటారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఎన్టీఆర్ జీవితంలోని అతి ముఖ్యమైన ఆ భాగం చూపించకపోతే, అదసలు అన్నగారి చరిత్రే కాదనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే విడుదలైన ట్రైలర్లో ఓ ఎజెండాతో అసలు విషయాన్ని పక్కన పెట్టినట్టు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
మౌనం మారణాయుధంతో సమానం
ప్రముఖ దివంగత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ‘యన్.టి.ఆర్’. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’ పేరుతో జనవరి 9న విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రాజకీయ నేపథ్యంలో రూపొందిన ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ ఈ నెల 22న విడుదల కానుంది. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటించి, నిర్మించారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సహ నిర్మాతలు. క్రిష్ దర్శకత్వం వహించారు. ‘యన్.టి.ఆర్: మహానాయకుడు’ సెన్సార్ పూర్తయింది. ఈ చిత్రం నిడివి 2 గంటల 8 నిమిషాలు. ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ‘‘నిశ్శబ్దాన్ని చేతకానితనం అనుకోవద్దు. మౌనం మరాణాయుధంతో సమానమని మర్చిపోకు’, ‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ గడపలకు పసుపునై బతకడానికొచ్చాను’ అనే డైలాగ్స్‌తో ట్రైలర్ సాగింది. కల్యాణ్ రామ్, రానా, విద్యాబలన్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి కీరవాణి స్వరకర్త. -
బయోపిక్‌లకు సత్యమే పునాది
ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని, పిల్లనిచ్చిన మామకు, మంత్రిపదవి కట్టబెట్టిన నాయకుడికి ద్రోహం చేసి సీఎం పీఠం నుంచి ఆయన్ని కూలదోసి తాను గద్దెనెక్కిన చంద్రబాబు వెన్నుపోటు చరిత్రను మాత్రమే వర్మ నేటి తరానికి చూపించదల్చుకుంటే ఆయన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కోసం ఇంత కష్టపడవలసిన అవసరం లేదు. ఈ మాత్రం దానికైతే ‘‘జామాతా దశమగ్రహ’’ అనే ఎన్టీఆర్ క్యాసెట్ ఆధారంగా వర్మ ఒక పొలిటికల్ డాక్యుమెంట్‌ని నిర్మిస్తే సరిపోతుంది. చివరిదశలో ఎన్టీఆర్ ఉత్థాన పతనాలకు చెందిన వాస్తవాలను, కారకులైన వ్యక్తులను వాస్తవిక దృక్పథంతో చిత్రించడం అవసరం. బయోపిక్‌లకు వాస్తవాల చిత్రణే ప్రాతిపదిక. ఇటీవల బయోపిక్స్ అంటూ వివిధ రంగాల్లో పేరుప్రతిష్టలు గల వారిని గురించి, వారి జీవి తాల్లో ప్రధాన ఘట్టానికి సంబంధించి చలనచిత్రాలు వచ్చాయి, వస్తున్నాయి. గాంధీ బయోగ్రఫీ ఆంగ్లంలో చాలా కాలం క్రితమే వచ్చింది. ఏ బయోగ్రఫీ కూడా పూర్తిగా చరిత్రగానే ఉండటం సాధ్యం కాదు. గాంధీ చిత్రం గాంధీజీ జీవితాన్ని, ఆయన దేశప్రజలకు చేసిన మేలు ఇచ్చిన సందేశాన్ని ప్రజలకు అందించాల్సిందే. కానీ నాటి అకుంఠిత దేశభక్తుడు భగత్‌సింగ్‌కు బ్రిటిష్ పాలకులు ఉరిశిక్ష విధిస్తే గాంధీజీ స్పందించలేదు. ఆ విషయం ప్రత్యేకించి గాంధీ చిత్రంలో లేదు. అలాగే దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీజీ వ్యవహరించిన తీరు, జాతి వివక్షకు వ్యతిరేకంగా కాకుండా దాన్ని సమర్థించే రీతిలో ఉందని కూడా విమర్శ ఉంది. కానీ గాంధీ చిత్రంలో ఆ విషయం ప్రస్తావన లేదు. అయినా, ఆ చిత్ర దర్శకుడు అటెన్‌బరో స్థూలంగా నిజాయితీగానే గాంధీజీని చిత్రీకరించాడనే చెబుతుంటాము. మన ‘మహానటి’ సావిత్రి జీవిత చరిత్రను అందరూ ఆహ్వానిం చారు. ప్రధానంగా నాటి సావిత్రి, నటిగా తెలుగు ప్రజల ప్రేమాభిమానాలను ఎంతగా చూరగొన్నదో మనకు అర్థం అవుతుంది. కీర్తి నటన వలననే ఆ సినిమా గొప్ప విజయం సాధించిందని చెప్పలేము. ఆమె తన పరిధిలో తాను చక్కగా నటించారు తప్ప, మహానటి పట్ల ప్రజల్లో ఉన్న ఆరాధన, ఆత్మీయభావనలే ఆ చిత్ర విజయానికి ప్రధాన కారణం. ఆ చిత్రంపై కూడా జెమినీ గణేష్ పాత్రకు న్యాయం జరగలేదనీ, సావి త్రిపట్ల ఆ కుటుంబ సభ్యుల నిరాదరణను పక్కన బెట్టారన్న విమర్శలూ లేకపోలేదు. అయితే మహానటి సావిత్రి ప్రధానంగా ఒక నటిగానే జీవిం చారు. వ్యక్తిగతంగా ఆమె సద్గుణాలు ముఖ్యంగా ఆమె దాతృత్వ గుణం, వ్యక్తిత్వం వంటివి ఉన్నా ఆమెకు జయలలితలాగా ప్రముఖ రాజకీయ నాయకురాలుగా, సీఎం వంటి పదవులు అలంకరించిన పరిస్థితి లేదు. కనుక సావిత్రి చిత్రంపై చర్చకు తావులేదు. ఇకపోతే తన ప్రజారంజక పాలనతో తెలుగు ప్రజల హృదయాల్లో ముఖ్యంగా పేద, అణగారిన ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన దివంగత సీఎం వైఎస్సార్ రాజకీయ జీవితం ప్రధాన ఘట్టం ‘యాత్ర’ అన్నపేరుతో సినిమాగా వస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మూడు తరాల ప్రేక్షకులకు ఆరాధనీయ మహానటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాలుగా రానున్నాయి. ప్రథమ భాగం ఇప్పటికే విడుదలైంది కూడా. ఎన్టీఆర్ కేవలం సినిమా నటునిగానే మిగిలిపోతే, ఆయన జీవిత చరిత్రపై చిత్రం ఇంత చర్చనీయాంశం అయి ఉండేది కాదు. నటుడిగా, సంచలన రాజకీయ నేతగా ఆయన జీవిత చరిత్ర ప్రజలకు తెలిసిన చరిత్ర కూడా కనుక ఆ మహనీయుని జీవిత చరిత్ర వీలైనంత వాస్తవికంగా ఉండాలని, చరిత్ర కనుక చరిత్రగానే రాగద్వేషాలకు అతీతంగా నిర్మించాలని కోరుకోవడంలో అసహజం లేదు. అలాగే ఆయన జీవితంలో ఒక ప్రధాన భాగానికే పరిమితమైనప్పుడు కూడా నిజాయితీ చిత్రీకరణను ప్రజలందరూ ఆశిస్తారు. ఎన్టీఆర్ తనయుడు, ప్రముఖ నటుడు బాలకృష్ణ, ఎన్టీఆర్ జీవితచరిత్రను రెండు భాగాలుగా ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ పేరిట నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ నటజీవితం, ఒక పల్లెటూరు నుండి వచ్చి ఆయన మహానటుడిగా ఎదగడానికి ఆయన ప్రదర్శించిన అకుంఠిత దీక్ష ఇవన్నీ ప్రజలను ఉత్తేజపరిచే అంశాలు. అలాగే ఆ చిత్రాల్లో ఎన్టీఆర్ అద్వితీయ జీవితం ప్రధానంగా ఉంటుంది. ఎన్టీఆర్ బయోపిక్ రెండోభాగం ప్రధానంగా ఆయన రాజకీయ జీవితానికి, ప్రజా ప్రస్థానానికి సంబంధించిందని అంటున్నారు. ఈ రెండో భాగంలో ఆయన జీవితం ప్రజలందరికీ తెరిచిన పుస్తకం. ఆయన ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీ కగా, ఆత్మగౌరవం గల తెలుగుజాతి ప్రతి ఒక్కరి ప్రతినిధిగా, ప్రజల మనసులు చూరగొన్నవాడు. నిజానికి, తెలుగుజాతిని కూడా, ద్రవిడ జాతితో కలిపి మద్రాసు వారిగానే ప్రపంచం చూస్తున్నప్పుడు, మన తెలుగువారి అస్తిత్వం నిలపడంలో ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించారు. ఆ మహనీయుని జీవిత చరమాంకంలో.. ఆయన రాజకీయ ఔన్నత్యం విశ్వవ్యాపితమవుతున్న దశలో, తన పార్టీని, తన పదవిని, చివరకి తాను స్థాపించిన పార్టీ పేరును కూడా పోగొట్టుకుని, సొంత అల్లుడు చంద్రబాబు కారణంగా, సొంత పార్టీ ఎంఎల్ఏలే చెప్పులు విసిరిన దుస్థితిలో ఎన్టీఆర్ ఘోర అవమానభారాన్ని మోయవలసి వచ్చింది. ఈ అంశాన్ని సైతం ‘మహానాయకుడు ఎన్టీఆర్’ చలన చిత్రంలో వాస్తవాలకు దగ్గరగా చరిత్రను వక్రీకరించకుండా చిత్రించాలని ఆశించడంలో అసహజం ఏమీ ఉండదు. ఎన్టీఆర్ జీవితాన్ని విషాదాంతం చేయడంలో, నాటి రాజకీయ పరిస్థితికి ప్రధాన కారకులు ఎవరు, ఏం చేశారు? అన్నది కూడా తెలుగు ప్రజలకు తెలియాలి. ఎన్టీఆర్ బయోపిక్‌లో ఎన్టీఆర్ పాత్రను పోషిస్తూ, తన తండ్రి పాత్రలో పరకాయప్రవేశం చేసి తండ్రి రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్న వారసుడు బాలకృష్ణ. ఎన్టీఆర్ బయోపిక్ రెండోభాగం ‘మహానాయకుడు’లో చరిత్రను వక్రీకరించకుండా వీలైనంతవరకు వాస్తవానికి దగ్గరగా నిర్మిస్తారని ఆశించలేము. మరోవైపున పరిచయం అక్కరలేని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. సంచలనాలకు మారుపేరుగా, విలక్షణ దర్శకుడిగా, వార్తల్లో ఉంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరిట ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించినప్పటినుంచి ఎన్టీఆర్ మరణం వరకు ప్రధానమైన, ప్రత్యేకభాగాన్ని చలనచిత్రంగా రూపొందించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఒక పాట కూడా యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఎన్టీఆర్ తాను నమ్మిన వారిచేతే నమ్మకద్రోహానికీ, కుట్రకూ బలైన వాడిగా ఆ పాట ఉంది. ఆ పాట సందర్భంలో ఆనాటి చంద్రబాబు, అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తది తర కుటుంబ సభ్యులను, ఇతరులను ఎన్టీఆర్‌తో విడిగానూ ఉన్న వీడియో క్లిప్పింగులను కూడా జత చేశారు. దానితో నేటి తెలుగుదేశం పార్టీ, కార్యకర్తల నుంచి, నేతల నుంచి రామ్‌గోపాల్ వర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ పాటలో చంద్రబాబును చూపించడంతో, ఆ కుట్రలకు చంద్రబాబే బాధ్యుడు అన్నట్లుందనీ, రాష్ట్రానికి సీఎంగా ఉంటున్న నేతను ఇలా చూపించడం, ఆయన్ని అవమానించడమేననీ, దీన్ని మేం సహించం అంటూ కొందరు వర్మపై స్థానిక పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టారు. వర్మ దిష్టిబొమ్మలు తగులబెట్టారు. ఇది చంద్రబాబు టీడీపీ వారి భుజాలు తడుముకునే నైజానికి, నిజం బయటపడుతుందేమోనన్న భయానికి, ఆనాటి ఘటనపై ఉండిన తీవ్ర వైరుధ్యాలను గూర్చిన అవగాహన లేకపోవడానికి సంబంధించినదిగా నాకు తోచింది. అంతే కాదు. వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలను ఆపడానికో, ఆ సినిమా చూసేందుకు వెళ్లే ప్రేక్షకులను భయపెట్టడానికో ఇలా చేస్తున్నారని అనిపిస్తుంది. ఎవరేమనుకున్నా, ఏదో సినిమాలో అన్నట్లు ‘చరిత్రను చించేస్తే చిరిగిపోదు. చెరిపేస్తే చెరిగిపోదు’. కొంత కాలం చారిత్రక సత్యాన్ని తొక్కిపెట్టవచ్చు. లేదా వక్రీకరించవచ్చు. కానీ సత్యాన్ని సమాధి చేయలేరు. నిజానికి ప్రజలకు ఆనాటి చారిత్రక సత్యమేమిటో తెలియాలి. ఈ సందర్భంగా నాకొక విషయం గుర్తుకొస్తున్నది. ప్రముఖ కమ్యూనిస్టు పుచ్చలపల్లి సుందరయ్య నాటి వీర తెలంగాణ సాయుధ పోరాట రథసారథుల్లో ఒకరిగా ‘వీర తెలంగాణ విప్లవ రైతాంగ పోరాటం–గుణపాఠాలు’ అని రాసిన బృహత్ గ్రంథంలో ‘సీపీఎం వారి కంటే సీపీఐలో ఉన్న వారికే ఎక్కువగా పాత్ర కల్పించారు ఎందుకని’ అని నాటి సీపీఎం నాయకుడు లావు బాలగంగాధరరావు ప్రశ్నించారు. ‘నేను చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టాన్ని మాత్రమే రాస్తున్నాను. ఆ ఘటనలో ఎవరెవరి పాత్ర ఏమిటి? ఈ రోజు వారు ఏ పార్టీలో ఉన్నారు? వారి ప్రస్తుత జీవితాన్ని బట్టి నాటి సాయుధ పోరాటంలో వారి పాత్రను విస్మరించలేను, వక్రీకరించలేను. ఒక చరిత్రకారునిగా అలాంటి పనిచేయరాదు. నాటి భౌతిక వాస్తవికతనే ప్రస్తావించాలి’ అని సుందరయ్య సమాధానమిచ్చారు. బయోపిక్ నిర్మించదలిచిన వారు ఎవరైనా దీన్ని గుర్తించుకోవాలి. ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని, పిల్లనిచ్చిన మామకు, మంత్రిపదవి కట్టబెట్టిన నాయకుడికి ద్రోహం చేసి సీఎం పీఠం నుంచి ఆయన్ని కూలదోసి తాను గద్దెనెక్కిన చంద్రబాబు వెన్నుపోటు చరిత్రను మాత్రమే వర్మ నేటి తరానికి చూపిం చదల్చుకుంటే ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం ఇంత కష్టపడవలసిన అవసరం లేదు. ఈ మాత్రం దానికైతే ఎన్టీఆర్ సీఎం పదవి కోల్పోయిన తర్వాత సొంత అల్లుడు తనకు చేసిన నమ్మకద్రోహం గురించి తన గళంతో వెలువరించిన ‘‘జామాతా దశమగ్రహ’’ అనే క్యాసెట్ ఆధారంగా వర్మ తన వ్యాఖ్యానం జోడించి ఒక పొలిటికల్ డాక్యుమెంట్‌గా నిర్మిస్తే సరిపోతుంది. కేవలం ఈ దృష్టితో మాత్రమే కాకుండా తన మొదటి భార్య బసవతారకం మరణానంతరం, సంతానం ప్రేమాభిమానాలు కరువై ఒంటరిగా జీవిస్తున్న ఎన్టీఆర్ మానసిక పరిస్థితి, ఆ నేపథ్యంలో ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించాక ఎన్టీఆర్ మనస్థితిలో వచ్చిన సానుకూల మార్పు, పార్టీలోని పదవీవ్యామోహపరులు లక్ష్మీపార్వతికి అధికార దాహం ఆపాదించి అధికార దాహం తీర్చుకునేపనిలో సాగించిన ఘాతుకాలను, ఈ క్రమంలో దారుణంగా మారిన మానవ సంబంధాలను వర్మ చిత్రించదల్చుకున్నారేమో! చివరిదశలో ఎన్టీఆర్ ఉత్థాన పతనాలకు చెందిన వాస్తవాలను, కారకులైన వ్యక్తులను వాస్తవిక దృక్పథంతో చిత్రించడం ఈ బయోపిక్‌ల ద్వారా సాధ్యపడుతుందని ఆశిద్దాం. అలాంటప్పుడే ఎన్టీఆర్‌పై బయోపిక్ ప్రయత్నాలు ఆహ్వానించదగినవి. ‘చంద్రోదయం’ పేరుతో చంద్రబాబు బయోపిక్ కూడా తీయనున్నారని తాజావార్త. ఎవరైనా ‘చంద్రగ్రహణం’ అని మరో బయోపిక్ తీస్తే అదీ వివాదాస్పదం కావడం ఖాయమే! వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్ : 98480 69720 డాక్టర్ ఏపీ విఠల్ -
కథే కథకుడిని ఎన్నుకుంటుంది
యన్టీ రామారావు జీవితం ఆధారంగా క్రిష్ తెరకెక్కించిన చిత్రం ‘యన్టీఆర్ : కథానాయకుడు’. యన్టీఆర్ తనయుడు బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించి, నిర్మించారు. ఈ చిత్రం 9న రిలీజైంది. ఈ సందర్భంగా పలు విశేషాలను పంచుకున్నారు క్రిష్. ► ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ చేస్తున్న సమయంలోనే విబ్రీ మీడియా విష్ణుగారు రామారావుగారి మీద సినిమా చేస్తారా? అని అడిగారు. అప్పుడే ఓ బయోపిక్ తీస్తున్నాం మళ్లీ కుదురుతుందో లేదో అనుకున్నాం. కథ తన కథకుడిని వెతుక్కుంటుంది అన్నట్టు ‘యన్టీఆర్’గారి కథ నన్ను ఎంచుకుంది. ఎన్టీఆర్ అంటే నందమూరి తారక రామారావు. తిప్పి చదివితే రామ తారకం. వీళ్లిద్దరి కథ చెబుదాం అని అనిపించింది. ఆ దారం పట్టుకుని వెళ్లిపోయాను. ► ఈ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ నా పదో సినిమా అవుతుంది. చాలా సినిమాలకు సేమ్ టీమ్‌తో వర్క్ చేశాను. రెండు భాగాలు కలిపి ఎనభై రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ‘ఏ పనికైనా పట్టుదల, ప్రణాళిక ముఖ్యం’. ఇదివరకు సినిమాలు ఇలానే తీసేవారు. నా బలం నా టీమే. ► రెస్పాన్స్ చాలా బావుంది. ఎవరు మాట్లాడినా సరే కళ్లలో తడితోనో లేదా గుండెల్లో చెమ్మతోనే మాట్లాడుతున్నారు. ఈ సినిమాకి డైరెక్టర్ని అని ఫిక్స్ అయ్యాక అప్పటి వరకూ రెడీ అయిన కథ రఫ్‌గా విన్నాను. కానీ వాళ్లు చేసిన వెర్షన్ చూడలేదు. మొత్తం నా సొంత స్క్రీన్‌ప్లే రాసుకున్నాను. కథ ఆలోచించడం కష్టం. స్క్రీన్ ప్లే రాయడం అంత కాదేమో. రామారావుగారి గురించి చాలా ఆర్టికల్స్ చదివాను, బయోగ్రఫీలు చదివాను. కేవలం ఈ సినిమా కోసమనే కాదు. సాధారణంగా చరిత్రంటేనే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆ పరిశోధన ఇప్పుడు ఉపయోగపడింది. సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేయకపోయినా ఇదే స్పీడ్‌తో సినిమా పూర్తి చేసేవాణ్ని. ► నేను రచయితను. బుర్రా సాయిమాధవ్‌గారు గొప్ప రచయిత. గొప్ప రచయిత ఉన్నప్పుడు వాళ్లు చెప్పిందే ఫైనల్ అవుతుంది. ఆయన డైలాగ్స్ గొప్పతనమేంటంటే అవి కథను ముందుకు నడిపిస్తుంటాయి. మ్యూజిక్ విషయానికి వస్తే ‘మంచి సినిమా తీశావు. దాన్ని గొప్ప సినిమా చేస్తాను’ అన్నారు కీరవాణిగారు. అలానే చేశారు. కెమెరామేన్ జ్ఙానశేఖర్వి, నావి వేరు వేరు కళ్లయినా ఇద్దరం ఒకటే చూస్తాం. ఆయనో గొప్ప పెయింటర్. మాకిది ఎనిమిదో సినిమా. ► ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్‌లో రామారావుగారికి, బాలకృష్ణగారికి మధ్య నేను గమనించిన లక్షణాలు క్రమశిక్షణ, వృతి పట్ల అంకిత భావం. తెగువ. మంచి సినిమా చేయడానికి వెనుకాడరు. బాలకృష్ణగారి ఆహార్యం చక్కగా కుదిరింది. విద్యా బాలన్ లేకుంటే తారకమ్మగారి పాత్రే లేదు. తారకమ్మగారి గురించి చదవడానికి మెటీరియల్ లేదు. కుటుంబ సభ్యుల ద్వారా విని బాగా పాత్రను పోషించారు. ఎల్వీ ప్రసాద్ పాత్రను బెంగాళీ నటుడు జిష్షుసేన్ గుప్తా చేశారు. మణికర్ణికలో కంగనా భర్తగా నటించారు. బెంగాలీలో ఆయనో సూపర్‌స్టార్. ఎల్వీ ప్రసాద్ బాడీ లాంగ్వేజ్‌ను ఆయన అన్వయించుకున్న తీరు బావుంది. 2,3 నెలలు బ్రేక్ తీసుకోవాలి. లాస్ట్ 215 రోజులు పని చేస్తూనే ఉన్నాను. ► వరుసగా చారిత్రాత్మక నేపథ్యమున్న సినిమాలు చేయడం అనుకోకుండా జరిగింది. ‘శాతకర్ణి’ కథ చెప్పాలని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చేశాను. ‘మణికర్ణిక, యన్టీఆర్’ సినిమాలు అనుకోకుండా వరించిన అదృష్టాలు. ఏదైనా సినిమా చేయాలనుకున్నప్పుడు మూడు విషయాలు ముఖ్యంగా పాటిస్తాను. ఆ కథ వినూత్నంగా, అర్థవంతంగా, వినోదాత్మకంగా ఉందా? మామూలు కథలు చెప్పుకెళ్లడం నాకు నచ్చదు. మహా అయితే 30–40 సినిమాలు చేస్తాం. అందులో అర్థం లేని సినిమాలు ఉండటం నాకిష్టంలేదు. ► ‘మణికర్ణిక’ నుంచి సోనూ సూద్ తప్పుకోవడం వల్ల మళ్లీ షూటింగ్ ఏర్పడింది. నా పాత్ర వరకూ నేను సరిగ్గానే నిర్వహించాను. 10 సినిమాల వయసొచ్చింది. ఇంకా డైరెక్షన్ క్రెడిట్ కంగనాకి వెళుతుందా? నాకా? అని ఆలోచించను. -
పండక్కి ట్రిపుల్ ధమాకా
సంక్రాంతి పండక్కి సినిమాలొస్తాయి. థియేటర్స్‌కి ఆడియన్స్ వస్తారు. ఆకాశంలో గాలిపటాల కంటే స్టార్స్ ఎక్కువ కనపడతారు. రంగుల ముగ్గుల కంటే థియేటర్లో రంగుల కాగితాలు ఎక్కువ ఎగురుతాయి. ఇక స్వీట్ల పంపకాలు, వేడుకలు, డ్యాన్సులు... థియేటర్ల బయట బోలెడంత హంగామా. సంక్రాంతికి ట్రిపుల్ ధమాకాలా వచ్చిన మూడు స్ట్రయిట్ ‘ఫ్యాన్.... టాస్టిక్’ సినిమాల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. సంక్రాంతి సీజన్లో ముందుగా వచ్చిన సినిమా ‘యన్.టి.ఆర్: కథానాయకుడు’. నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ నిర్మించి, నటించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలైంది. క్రిష్ దర్శకత్వం వహించారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి నిర్మాతలు. ‘‘ట్రేడ్ పరంగా బుధవారం రిలీజ్ అంటే అంత మంచిది కాదు. కానీ ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి విడుదలకు ఆ రోజుని ఎంపిక చేసుకున్నాం’’ అని దర్శకుడు క్రిష్ అన్నారు. ఈ చిత్రం వసూళ్ల విషయానికొస్తే... 700 థియేటర్లలో రిలీజైన ‘యన్.టి.ఆర్’ తొలి రోజు 10 కోట్ల పై చిలుకు షేర్ చేసిందని, బుధవారం అయినప్పటికీ ఇంత వసూలు చేయడం మామూలు విషయం కాదని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ‘యన్.టి.ఆర్’ రిలీజ్ తర్వాత ఒక్క రోజు గ్యాప్ (11న విడుదల)తో ‘వినయ విధేయ రామ’ తెరపైకి వచ్చింది. రామ్‌చరణ్ హీరోగా డీవీవీ దానయ్య నిర్మించారు. బోయపాటి మార్క్ మాస్ ఎంటర్టైనర్గా తెరపైకొచ్చింది. దాదాపు 900 థియేటర్లకు పైగా విడుదలైన ఈ చిత్రం తొలి రోజు 30 కోట్ల షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ‘ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ అంటూ వెంకటేశ్, వరుణ్ తేజ్ వీకెండ్లో సందడి చేయడానికి థియేటర్లోకి వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం శనివారం తెరకొచ్చింది. ‘‘మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సంక్రాంతి సీజన్లో ఈ సినిమా కూడా హిట్టే’’ అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. స్ట్రయిట్ చిత్రాల మధ్య వచ్చిన డబ్బింగ్ మూవీ ‘పేట’. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ తమిళ సినిమాని తెలుగులో అశోక్ వల్లభనేని విడుదల చేశారు. మూడు స్ట్రయిట్ చిత్రాల మధ్య రావడంతో థియేటర్లు పెద్దగా దొరకలేదు. రజనీ మార్క్ మాస్ మూవీ అనిపించుకుని, ప్రేక్షకులను థియేటర్స్‌కి రాబట్టుకుంటోందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కియారా, రామ్‌చరణ్ వెంకటేశ్, తమన్నా, మెహరీన్, వరుణ్ తేజ్ రజనీకాంత్, త్రిష -
‘ఎన్టీఆర్ కథానాయకుడు’ కి మోహన్‌బాబు విషెస్
బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో క్రిష్ తెరకెక్కించిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు బయోపిక్ బుధవారం విడులైంది. భారీ స్థాయిలో రిలీజైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఆకాక్షించారు. కొన్ని యాంగిల్స్‌లో బాలయ్య తండ్రి పోలికలతో ఉండడం అద్భుత విషయమని పేర్కొన్నారు. ‘మంచి దర్శకుడి చేతిలో సినిమా రూపొందడం, స్వయంగా నిర్మిస్తూ ప్రధాన పాత్ర పోషించడం కూడా అద్భుతం, అమోఘం’ అని బాలయ్యను ప్రశంసించారు మోహన్‌బాబు. ‘అన్నగారి బయోపిక్ తీయడం.. అందులోనూ మహానటుని కుమారుడు బాలయ్య తండ్రి పాత్ర పోషించడం మామూలు విషయం కాదని’ ట్విటర్లో పేర్కొన్నారు. -
తిరుమలలో ‘యన్‌టిఆర్’ చిత్రబృందం
-
నాగబాబు వ్యాఖ్యలపై నో కామెంట్ : బాలకృష్ణ
సాక్షి, తిరుపతి : తిరుపతి పీజేఆర్ మూవీ ల్యాండ్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 100కు పైగా థియేటర్లలో ఎన్టీఆర్ విగ్రహాలు పెడుతున్నామన్నారు. సీఎంగా మొదటిసారి జనవరి 9న ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేశారని, అదే రోజు ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని యాధృచ్చికంగానే విడుదల చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ స్పూర్తితోనే సినిమాల్లోకి వచ్చానని, ఎన్టీఆర్ బయోపిక్ సినిమాతో తండ్రి రుణం తీర్చుకున్నానని తెలిపారు. ఎన్టీఆర్‌ను అనుకరించడం కాదు.. ఆయన పాత్రలో జీవించానని పేర్కొన్నారు. నాగబాబు వ్యాఖ్యలపై నోకామెంట్ అంటూ ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు బాలయ్య బదులిచ్చారు. కుమారుడు, తండ్రి పాత్ర చేయడం ప్రపంచంలోనే రికార్డు అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అమ్మరుణం కొంతమేర తీర్చుకున్నానని చెప్పారు. ఎన్టీఆర్‌లో చాలామందికి కనిపించని ఎన్నో కోణాలు ఈ సినిమాలో ఉన్నాయన్నారు. క్రిష్ సినిమాను అద్భుతంగా చిత్రీకరించారని, ఫిబ్రవరి 7న రెండో భాగం విడుదలవుతుందన్నారు. నటి విద్యాబాలన్ అమ్మ పాత్రలో అద్భుతంగా నటించారని తెలిపారు. 'పండగకు ముందే తెలుగు వాళ్లు పండగ చేసుకుంటారు. బాలకృష్ణతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. తాత ఏఎన్నార్ పాత్ర నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఎన్టీఆర్ బయోపిక్ ఓ సినిమా మాత్రమే కాదు, ఓ చరిత్రలా మిగిలిపోతుంది' అని హీరో సుమంత్ అన్నారు. ఎన్టీఆర్ మనవడిగా కాకుండా ఓ అభిమానిగా సినిమా కోసం ఎదురు చూస్తున్నానని హీరో నందమూరి కళ్యాణ్ రామ్ అన్నారు. -
తిరుమలలో 'ఎన్టీఆర్' చిత్ర యూనిట్
సాక్షి, తిరుమల : 'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్ర యూనిట్ సభ్యులు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పార్టు ఎన్టీఆర్ కథానాయకుడు రేపు(బుధవారం) రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో హీరో నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్, సుమంత్ తదితరులు ఈ ఉదయం స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చామని హీరో నందమూరి బాలకృష్ణ తెలిపారు. నాన్న గారి సినిమా మంచి విజయం సాధించాలని స్వామివారిని వేడుకున్నామని ఆయన చెప్పారు. నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ బయోపిక్‌ను రెండు భాగాలుగా తెరకెక్కించారు దర్శకుడు క్రిష్. -
బాలీ హామీలు
రాజకీయం ప్రజల కోసం ఉండాలి. ప్రజల కోసం.. ప్రజలచేత.. ప్రజల వలన సాగాలి. రాజకీయం ప్రజలను ఒక్కటి చేయాలి. రాజకీయం ప్రేమను, శాంతిని పెంపొందించాలి. ఇవన్నీ రాజకీయాలకైతే ఓకే. కానీ బాలీవుడ్ రాజకీయాన్ని బ్లాక్‌బస్టర్‌గా మార్చడానికి వాడుకుంటుంది. ఎలా అయితేనేమి ఎలా చెబితేనేమి ప్రజలకు అర్థమయ్యేలా చెబితే చాలు. సినిమాను మించిన మెస్సేజ్ ఉండదేమో! ప్రస్తుత రాజకీయాలను, రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ తెచ్చిన కొన్ని చిత్రాలపై విశ్లేషణ రాజకీయాలు, సినిమాలు ఆర్ ది మోస్ట్ సేలబుల్ సబ్జెక్ట్స్ ఎంటర్టైన్మెంట్ మార్కెట్లో. ఈ రెండూ కలిస్తే చెప్పేదేముంది బంపర్ బొనాంన్జే! 2018 సంవత్సరాంతంలో అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా సినిమాతో రాజకీయాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో కావల్సినంత వినోదాన్ని పంచారు. క్రియేటివిటీకి ఓ న్యూవేవ్ వేశారు ఉత్సాహవంతులు. హిట్ అయిన తెలుగు, హిందీ సినిమాల్లోని హీరో, విలన్లకు అధికార పార్టీ, ప్రత్యర్థి పార్టీ నేతల మొహాలను పెట్టి సృజన తృష్ణతోపాటు విజయకాంక్షనూ తీర్చుకున్నారు. ఇటు సోషల్ మీడియా ఆడియెన్సూ వాటికి విపరీతంగా వ్యూస్ ఇచ్చి, షేర్స్ పెంచి బ్లాక్‌బస్టర్స్‌ను చేశారు. ఆ ట్రెండ్ ఈ యేడు జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకూ స్ట్రెచ్ అయ్యే దృశ్యం కనపడుతోంది. అయితే ఒకరినొకరు తిట్టుకోవడం..మార్ఫింగ్ చేసుకోవడం నేలబారు పోకడ. కొత్త ప్లాన్ ఏంటంటే.. కొన్ని బాలీవుడ్ సినిమాల థీమ్‌ను ఎన్నికల ప్రచార అస్త్రాలుగా.. వాగ్దానాలుగా మలచుకోవడం! మల్టీప్లెక్స్, సింగిల్, స్మాల్, వెబ్ స్క్రీన్(అన్ని వర్గాల) ఓటర్లనూ ఆకర్షించి కమర్షియల్ హిట్ లాంటి ఆల్ టైమ్ ఫేవరేట్ గవర్నమెంట్‌ను ఏర్పాటు చేయడం. అలాంటి సినిమాల ప్రస్తావనతో ఓ చిన్న పొలిటికల్ మూవీ క్రియేటివ్ ఎక్సర్సైజ్... పీప్లీ లైవ్.. ఇది రైతు కథ. కాలంలేక, పంటలు పండక, పెట్టిన పెట్టుబడి రాక ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు పీప్లీ ఊళ్లోని ఓ రైతు. రైతు ఆత్మహత్య చేసుకుంటే ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తుంది ప్రభుత్వం. అందుకని ఆ డబ్బుకోసం ఈ రైతు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఎజెండా: ఇప్పటికే దేశంలో చాలా చోట్ల రైతులకు రుణమాఫీ, మద్దతు ధర వంటి పథకాలను అందచేస్తున్నాయి ప్రభుత్వాలు. అయినా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల రైతుల ఇటీవలి ర్యాలీనీ విస్మరించకూడదు. అన్నం పెట్టే రైతు రుణాల్లో మునగకుండా చూడాలి. టాయ్‌లెట్.. మహిళల బహిర్భూమి సమస్యతో తెరకెక్కిన సినిమా. కనీస అవసరాల్లో ఇంట్లో టాయ్‌లెట్ ముఖ్యమైనది. దాని కోసం పోరాటం చేసి, సాధించిన ఓ కోడలి కథ. ఎజెండా: స్వచ్ఛభారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఇంటింటికీ టాయ్‌లెట్ అనే నినాదంతో ఇప్పటికే వీటి నిర్మాణాన్ని చేపట్టింది. అయినా తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లే లేవు ఇక టాయ్లెట్లు ఎక్కడ ఉంటాయి? చెరువులు, కాల్వల గట్లే ప్రత్యక్ష ఉదాహరణలు. టాయ్‌లెట్ ఉన్న ఇల్లు అంటే ఆడపడచుకి గౌరవమిచ్చే ఇల్లు అని. ఆ క్రెడిట్ ప్రాంతీయ పార్టీల ఖాతాలోనూ చేరాలి. ఓ మై గాడ్.. దేవుడికి, నాస్తికుడికి మధ్య ఉన్న భక్తివిశ్వాసాల సారం ఈ చిత్రం. విశ్వంలో జరిగే ప్రతి కర్మ, క్రియకు కర్త ఆ భగవంతుడే. సర్వమత సారాంశం ఇదే. ఈ సినిమా చర్చా దీని మీదే. ఎజెండా: దేవుడు ఉంటే అందరికీ ఉంటాడు. లేకపోతే ఎవరికీ లేడు. ఉన్నాడనేదే మెజారిటీ నమ్మకం. కనుక ఆడ,మగ, కుల,వర్గ భేదం లేకుండా ఏ గుడిలోకైనా అందరికీ ప్రవేశం కావాలి. దేవుడితో రాజకీయాలు వద్దు. దేవుడి జన్మస్థానం పేరుతో మత యుద్ధాలు వద్దు. హేతుబద్దమైన ఆలోచనాతీరును పెంపొందించే విద్యావిధానానికి శ్రీకారం చుట్టాలి. అత్యున్నత న్యాయస్థానాల తీర్పును గౌరవించే వాతావరణాన్ని కల్పించాలి. రాజ్‌నీతి మహాభారత కథకు ఆధునిక రూపం ఈ సినిమా. కుటుంబ పాలన, అధికారం కోసం రక్తసంబంధీకుల మధ్య కలహాలు, మైనారిటీ ఓట్లకోసం ఆరాటం, ఆధిపత్య పోరాటమే ఈ మూవీ స్టోరీ. ఎజెండా: ప్రజాస్వామ్యం అంటే అధికారం ప్రజలకు బంటు అనే కదా! ఈ నమూనా కుటుంబ పాలనకు ఫక్తు వ్యతిరేకం. మైనారిటీ సంక్షేమం వాళ్ల ఓటు బ్యాంకులో మురగొద్దు. వాళ్ల అభివృదై్ధ కనపడాలి. మసాన్.. సమాజంలో అన్ని రకాల దోపిడీకి గురవుతున్న వర్గాల కథ. బడుగు, బలహీనుల మీద దాడులు కూడదని చూపించే చిత్రం. ఎజెండా: కులాల మధ్య అంతరాలు పోవాలని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలూ సమాజంలో గౌరవ మర్యాదలు అందుకోవాలనే రిజర్వేషన్స్ కల్పించింది. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను తెచ్చింది. కాని పురోగమించాల్సిన మనం తిరోగమనానికి సిద్ధపడ్డాం. దేశంలో దళితులపై దమనకాండలు పరువు హత్యల పేరుతో రూపం మార్చుకున్నాయి. చట్టాలను కాలరాస్తున్నాం. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. బడుగు, బలహీనులకు అండగా ఉన్న చట్టాలను పరిరక్షించే ప్రయత్నం చేయాలి. అయ్యారీ.. రక్షణశాఖలో జరిగిన కుంభకోణానికి సంబంధించిన సినిమా ఇది. దేశానికి కంచెగా ఉన్న డిఫెన్స్ మినిస్ట్రేయే డబ్బుకి ఆశపడి ప్రజల రక్షణను లంచానికి పణంగా పెట్టే కహానీ అయ్యారీ. ఎజెండా: ఓటు అంటే నమ్మకం. గెలుపు అంటే బాధ్యత. ఈ రెండిటినీ సమన్వయం చేసుకునేదే అధికారం. ప్రజల మంచిచెడులకు బాధ్యత వహించడానికి ముందుకు వస్తున్న పార్టీలు ఈ అంశాన్ని విస్మరించకూడదు. దేశ రక్షణకు సంబంధించి గతంలో జరిగినవి, ఇప్పుడు దుమారంలో ఉన్న డిఫెన్స్ డీల్స్ కుంభకోణాలు కావనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించాలి. వారి భద్రతకు తామే కాపలా అన్న భరోసానివ్వాలి. రాజీ.. ‘అయ్యారీ’కి విరుద్ధమైన కథే రాజీ. దేశం కోసం సొంత కూతురి జీవితాన్నే బలిగా పెట్టిన ఓ గూఢచారి కథ. ఎజెండా: జాతీయవాదం అంటే మతం పేరుతో దేశంలోని ప్రజలను విడగొట్టడంకాదు. మతానికి అతీతంగా దేశం కోసం నిలబడ్డం. ప్రజల మధ్య ఐకమత్యాన్ని చాటడం. అంతర్గత భద్రత లేకుండా సరిహద్దు రక్షణ ఎలా సాధ్యం? ‘రాజీ’ని ఇలా స్ఫూర్తిగా తీసుకొని ఐక్యతను ఎజెండాలో భాగం చేసుకోవాలి. కార్యాచరణకు అడుగులు వేయాలి. పింక్.. ‘‘అవునంటే కాదనిలే.. కాదంటే అవుననిలే.. ఆడవారి మాటలకే అర్థాలే వేరులే’’ అన్న ఈ పాదం తప్పు. ‘నో’ అంటే ‘నో’ అనే. దానికి ఇంకా వేరే అర్థాలేం లేవు. ‘వద్దు’ అనే స్ట్రయిట్ మీనింగే. పింక్ సినిమా చెప్పేదీ ఇదే. స్త్రీలను గౌరవించమని. ఇష్టంలేదు అని ఆమె అంటే వినమని. ఆ మాటకు విలువివ్వమని. ఎజెండా: ఆకాశంలో సగం మాట దేవుడెరుగు దేశంలో సగం జనాభా ఉన్న మహిళలకు ఎక్కడా సమాన హక్కులు లేవు. అవకాశాలు అంతకన్నా లేవు. రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ చర్చల్లో వినిపిస్తోంది తప్ప బిల్లుగా కనిపించట్లేదు. ఉద్యోగాల్లో అన్నిరకాల వేధింపులే బోనస్. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు పుట్టకుండా కుట్రలు నూరుతున్నారు. భూమ్మీదున్న వాళ్లనైతే రకరకాల అవమానాలతో చంపేస్తున్నారు. చట్టాలు చేసి ఊరుకోవడం కాదు.. అమలు జరిగేలా, అతిక్రమణ లేకుండా చూడాలి. ప్రతి పార్టీ ప్రాక్టికల్ ఎజెండాలో మహిళ భాగం కావాలి. అప్పుడే ఆమె అభివృద్ధిలో అర్ధభాగంగా, ఉత్పాదక శక్తిగా సముచిత స్థానం పొందుతుంది. రోటీ.. కపడా.. ఔర్ మకాన్.. ఎప్పటిదో ఈ సినిమా. ఇప్పటికీ ఈ మూడు ఉన్న జనాభా చాలా తక్కువ మన దేశంలో. ఎజెండా: ఎన్నిటినో సాధిస్తున్నారు. అంతరిక్షంలోకి వెళ్లడానికీ బడ్జెట్‌ను కూడబెడ్తున్నారు. కాని కూడు, గుడ్డ, గూడుకే కరువు చూపిస్తున్నారు. ఈ కనీస అవసరాలను సమకూర్చుకోలేకపోతున్నాం. ఈసారైనా వీటిని సంపూర్ణంగా సాధిస్తే మిగిలిన పురోభివృద్ధిలో ప్రజలూ పార్ట్నర్స్ అవుతారు. న్యూటన్.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా చూసే ఓ ప్రభుత్వ ఉద్యోగి కథ ఇది. ఎజెండా: పైనవన్నీ సాధించాలన్నా ప్రజాస్వామ్య స్ఫూర్తి సజావుగా సాగాలన్నా ఎన్నికలు సక్రమంగా జరగాలి. బ్యాలెట్ బాక్స్‌లు ఉంటే రిగ్గింగు జరిగే అవకాశం ఎక్కువని ఈవీఎంలకు వెళ్లాం. ఈవీఎంలనూ ట్యాంపర్ చేయొచ్చనే వాదనా వినపడుతోంది. అందుకని ప్రతి పార్టీ తమ ఎజెండాల్లో ముందుగా పోలింగ్‌లో అవినీతికి పాల్పడమనే స్వీయవాగ్దానం చేసుకోవాలి. – సరస్వతి రమ(ది ఎకనమిక్ టైమ్స్ సౌజన్యంతో..) బయోపిక్స్ సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చి నేతలుగా మారిన వాళ్ల లైఫ్ బయోపిక్స్‌గా వస్తున్నాయి . అలాగే జన నేతలుగా పేరుగాంచిన నాయకుల జీవితాలుకూడా సినిమాలుగా తెరకెక్కాయి. అవన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మన్ మోహన్ సింగ్, ఎన్.టి.ఆర్, వై.ఎస్.రాజశేఖరరెడ్డి బయోపిక్స్ ఇందుకు ఉదాహరణ. -
వాళ్లు కర్త.. కర్మ.. నేను క్రియ
యన్టీఆర్ జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించి, నిర్మించిన చిత్రం ‘యన్.టి.ఆర్’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ‘యన్.టి.ఆర్ : కథానాయకుడు’ ఈ నెల 9న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా బాలకృష్ణ పంచుకున్న విశేషాలు. ► ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా ఒక ఎత్తు అనుకుంటారా? చాలెంజ్ అనుకోలేదు. గొప్ప అవకాశం అనుకున్నాను. విధి మనకు ఎలాంటి చాలెంజ్‌లు ఇచ్చినా వాటిని అధిగమించి ముందుకు వెళ్లాలని భావిస్తాను. ఏ సినిమా వచ్చినా అది ఎందుకు నాదాకా వచ్చిందో నాకు నేనే ఆలోచించుకుంటా. ఎక్కువ మందితో చర్చలు ఉండవు. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రాత్ (ఎక్కువ మంది వంటగాళ్లు కూర చెడగొట్టినట్టు) అంటారు కదా అలాగ. అనిపించింది చేసుకుంటూ వెళ్లడమే. ప్రాచీన ఆంధ్ర చరిత్ర సృష్టికర్త గౌతమీపుత్ర శాతకర్ణి, నవీన తెలుగు జాతి సృష్టికర్త ఎన్టీఆర్‌ల కథలను ఒకే దర్శకుడు క్రిష్‌తో చేయడం విశేషం. ► మీ నాన్నగారిలా చేయడం కష్టం అనిపించిందా? కష్టమేం అనిపించలేదు. ఆయన కేవలం నా తండ్రి మాత్రమే కాదు. దైవం, గురువు, మెంటర్ అన్నీ. ఆయన చేసిన పాత్రలన్నీ చేయగలగడం ఈ సినిమాతో కుదిరింది. కర్త, కర్మ అన్నీ అమ్మానాన్నే. నేను కేవలం క్రియ మాత్రమే. ► ఆర్టిస్టుల ఎంపిక ఎలా జరిగింది? బయోపిక్ ఫీల్ రావాలంటే తెలిసిన ముఖాలు ఎక్కువ కనిపించకూడదు. ఎందుకంటే కథ నుంచి డైవర్ట్ అయిపోతారు. కేవలం సినిమా యాక్టర్ అయినప్పటి పోర్షన్లో మాత్రమే యాక్టర్స్ కనిపిస్తారు. మిగతా సీన్స్ కోసం సురభి నాటక కళాకారులను తీసుకున్నాం. యాక్టర్స్ కనిపిస్తే కమర్షియల్ అయిపోతుంది. ఈ సినిమాను అలా చేయదలుచుకోలేదు. ► రెండు భాగాల కథ ఎలా ఉంటుంది? ఫస్ట్ పార్ట్ సినిమాలు, పార్టీని అనౌన్స్ చేయడం. రెండో భాగం పార్టీ స్థాపించడం, పార్టీ క్రైసిస్, అమ్మగారు శివైక్యం అవ్వడం ఉంటాయి. ఇది అమ్మానాన్నల కథ. కేవలం వాళ్లమీదే ఈ సినిమా ఉంటుంది. ► ఈ జర్నీ ఎమోషనల్‌గా సాగిందనుకోవచ్చా? అవును. చాలా వరకు. నాన్నగారి వైఖరి నాకు తెలుసు, అమ్మగారి సెంటిమెంట్సూ నాకు తెలుసు. అమ్మ మాటకు నాన్నగారు ఎంత విలువ ఇచ్చేవారో చెప్పాం. హరి (హరికృష్ణ) అన్నయ్యతో, నాతో మా మేనమామ ‘రామ్ రహీమ్’ పిక్చర్ తీద్దాం అనుకున్నారు. ముందు చదువు పూర్తి కావాలని నాన్నగారు అనేవారు. నాన్నగారిని అమ్మగారు అడిగిన వెంటనే ‘సరే చేసుకోమనండి’ అన్నారు. ఇలాంటి బోలెడన్ని విషయాలు ఉంటాయి సినిమాలో. ► మీ క్యారెక్టర్ (బాలకృష్ణ) ఉంటుందా? నాకో ఐడెంటిఫికేషన్ ఉంది. దాంతో కథ నుంచి డైవర్ట్ అయిపోతారు. అలా అవ్వకూడదు. అయితే నా పాత్ర ఒక్క సీన్లో కనిపిస్తుంది. ► అంటే.. ఏ వయసు పాత్రలో కనిపిస్తారు? లేదు. లేదు. చంటి బిడ్డగా ఉన్నప్పుడు. ఆ పాత్రను నా మనవడు దేవాన్ష్ చేశాడు. బాగా చేశాడు. నాకు నామకరణం చేసే సన్నివేశంలో కనిపిస్తాడు. షూటింగ్ టైమ్‌లో ఏడుస్తాడేమో అని చాలా ఏర్పాటు చేసుకున్నాడు క్రిష్. బొమ్మలు అవీ ఇవీ తెప్పించాడు. కానీ సీన్లో ఎవరు డైలాగ్ చెప్పినా వాళ్లను చూసేవాడు. క్లోజప్ షాట్ కావాలంటే నవ్వాడు. నటన మా బ్లడ్లోఉంది కదా (నవ్వుతూ). ► చిన్న ఎన్టీఆర్, మీ అబ్బాయి మోక్షజ్ఞ పాత్రలు కూడా లేవు కదా? లెంగ్త్ కుదర్లేదు. అంత సమయాభావాన్ని సరిపెట్టలేకపోయాం. నా పాత్రే లేనప్పుడు వాళ్ల పాత్రలు పెట్టించడం కుదరదు కదా. ► క్రిష్ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు? విద్యాబాలన్గారితో మాట్లాడటానికి ముంబై వెళ్లా. అక్కడ ‘మణికర్ణిక’ షూటింగ్ జరుగుతోంది. క్రిష్‌ని కలిశాను. నేను డైరెక్షన్ చేసేయనా? అన్నారు. ‘యస్.. యు ఆర్ మై డైరెక్టర్’ అన్నాను. ► డైలాగ్స్ గురించి? ఏమంటివి ఏమంటివి, ‘బొబ్బిలి పులి’లో డైలాగ్స్ ఉంటాయి. ఊరికే నేను చెప్పగలుగుతాను అని పెట్టినవి కాదు. ప్రతి సీన్‌కు ఓ రీజన్ ఉంది. నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధం కూడా చూపిస్తాం. మా నాన్నగారికి నేనిచ్చే ఘనమైన నివాళి ఈ సినిమా. ► పొలిటికల్ కాంట్రవర్సీలు ఉంటాయా? అవేం ఉండవు. 1983 ఆగస్ట్‌లో పాలిటిక్స్ క్రైసిస్, ఆ తర్వాత అమ్మగారు శివైక్యం అవ్వడంతో సినిమా ముగుస్తుంది. ఇది కేవలం మా అమ్మానాన్నల కథ. ► ఈ సినిమా తర్వాత బోయపాటితో మూవీ అనౌన్స్ చేశారు. రెస్ట్ ఎప్పుడు తీసుకుంటారు? రెస్ట్ ఎందుకు? ప్రతి రోజూ నాన్నగారి సినిమాలో ఏదో సీన్ చూసి పడుకుంటా. పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అభిమానులు మా నుంచి సినిమాలు కోరుకుంటారు. ఆర్టిస్ట్ నిత్యావసర వస్తువు. వాళ్లకు కావాల్సింది అందిస్తుండాలి. ఇచ్చే ధైర్యం మనకుండాలి. -
ఇప్పుడు చాలెంజ్‌లు మానేశాను!
యన్.టి. రామారావు జీవితం ఆధారంగా ఆయన కుమారుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన చిత్రం ‘యన్.టి.ఆర్’. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందింది. మొదటి భాగం ‘యన్.టి.ఆర్ : కథానాయకుడు’ ఈ నెల 9న రిలీజ్ కానుంది. కీరవాణి సంగీత దర్శకుడు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలు. ► సాధారణంగా హీరోస్‌ని లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్‌తో చూపిస్తాం. యన్.టి. రామారావుని ఎలా చూపించారు? ఎగ్జాగిరేషన్ లేకుండా మామూలుగా చూపించాం. ఆయన జీవితం గురించి చెప్పాలంటే 30 గంటలు సినిమా తీసుండాలి. ► సంగీత దర్శకుడిగా ఈ సినిమా ఓ చాలెంజ్ అనుకోవచ్చా? కాదు.. ఎంజాయబుల్. చాలెంజింగ్ అనే పదాన్ని ‘చెత్త సినిమా’కు సంగీతం ఇచ్చినప్పుడు వాడుతుంటాను. మనసుకి నచ్చిన సబ్జెక్ట్స్ చేయడం ఎప్పుడూ చాలెంజ్ కాదు. అలాగే ఇప్పుడు ‘చాలెంజ్‌లు’ స్వీకరించడం మానేశాను. ► ఆ ఉద్దేశంతోనే ఆ మధ్య ‘చెత్త దర్శకులతో పని చేశాను’ అని ట్వీట్ చేశారా? అప్పుడు అలాంటి చాలెంజింగ్ సినిమాలు చేసి ఇప్పుడు ఎందుకు విమర్శించారు? వయసులో ఉన్నప్పుడు చాలా పనులు చేస్తాం. వయసు అయిపోయిన తర్వాత చేయలేం. వయసులో ఉన్నప్పుడు 20 పకోడీలు తింటాం. కానీ వయసైపోయాక తినలేం. అలాంటిదే ఇది కూడా. అలా అని ఆ సినిమాలు చేశానని రిగ్రెట్ అవ్వడం లేదు. ► మన అభిప్రాయాలను మనసులో దాచుకోవాలి. లేదా మాటలకు ఫిల్టర్ వేసుకుని మాట్లాడాలంటారు ఇండస్ట్రీలో.. నా అభిప్రాయాలను బహిరంగంగా చెప్పినా కూడా ఫలానా వ్యక్తి అని చెప్పలేదు కదా. సుబ్బారావు, పుల్లారావు అని పేరు పెట్టి విమర్శించలేదు కదా. సరదాగా ఓ విలేకరి ‘ఈ ప్రాంతంలో సగం మంది మూర్ఖులు అన్నాడట. దాంతో ఒకతను ఇలా అంటావా? మాట వెనక్కి తీసుకో అన్నారట. దానికి అతను ‘సగం మంది మూర్ఖులు కాదు’ అన్నాడట. ఆ సగం మంది ఎవరని ఎవరికీ తెలియదు. వాళ్లకు వాళ్లే ఆలోచించుకోవాలి. ► ‘ఇక రిటైర్ అవుతున్నా’ అని గతంలో ప్రకటించారు. మనసు మార్చుకున్నారా? మనసు ఇప్పుడూ మార్చుకోలేదు. రిటైర్ అయిపోయినట్టే. కానీ ‘చాలెంజింగ్’ సినిమాల నుంచి మాత్రమే. పకోడీలు తినడం లేదు. పెరుగన్నం తింటున్నా. ► మీ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకూ మీరు గమనిస్తే పాట పాటలానే ఉందా? స్టాండర్డ్ అలానే ఉందా? పాటకు పల్లవి ప్రాణం. అప్పుడూ.. ఇప్పుడూ. సో అలానే ఉన్నట్టే. పాట నిడివి 3 నుంచి 5 నిమిషాలు. అది ఉంటే ఉన్నట్టే. సాహిత్యం, సింగర్ ఉన్నారా? వాళ్లు ఉంటే ఉన్నట్లే. స్టాండర్డ్ విషయానికి వస్తే ఈ డిబేట్ అప్పుడు కూడా ఉంది. సో స్టాండర్డ్ మారలేదు అంటాను. పాట చెక్కు చెదరకుండా అలానే ఉంది. ► మీకు రీప్లేస్మెంట్ ఎవ్వరూ రాలేదంటాం. ఏమంటారు? ఆప్షన్ లేదని మీరంటారు. అది మీ భావం. దాసరిగారో పాట రాశారు. ‘ఆగదు ఏ నిమిషము నీ కోసము...’ అని. ఎవరి వల్లా జీవితం ఆగదు. భర్త చనిపోయిన స్త్రీని చూసి ఆయన లోటు తీరనిది అని అంటాం. భర్త చనిపోతే భార్య సతీసహగమనం చేసుకోవాలా? అలా చేయడం తప్పు. తీరని లోటని చచ్చిపోమంటామా? బతికుండమంటావా? వాస్తవాన్ని అంగీకరించమంటాం. ప్రత్యామ్నాయం చూసుకోవాలంటాం కదా. ఇది కూడా అంతే. మీకు రీప్లేస్మెంట్ లేదనేది అపోహ అంటాను. ఎందరో వస్తున్నారు కదా. ► కానీ క్వాలిటీలో తేడాలుంటాయి కదా? దీన్ని కూడా ఏకీభవించను. మీకు ఫలనా రెస్టారెంట్లో బిర్యానీ నచ్చొచ్చు. నాకు వేరే హోటల్లో పూరీ నచ్చొచ్చు. కళలకు, సైన్స్‌కు తేడా అదే. లెక్కలు, సైన్స్‌లో వందకు వంద మార్కులు సాధించొచ్చు. కానీ తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్‌లో వేయరు. అవి ఆర్ట్స్. ఆ తేడాను అలా నిర్ణయించి పెట్టారు. చరిత్రకారులు కూడా చరిత్రను ఒక్కో దృష్టితో చెబుతారు. కొలమానం లేనప్పుడు రీప్లేస్మెంట్, పోలికలు ఉండవు. పని జరుగుతూ ఉంటుంది. ► మ్యూజిక్‌లో మీరు చూసిన మార్పేంటి? ఇది వరకు రికార్డింగ్ అంటే ఓ స్టూడియోలో పేద్ద రికార్డింగ్ ల్యాబ్. ఒక ఇంజనీర్, స్టాఫ్. లోపలకు అడుగుపెడితే సెపరేట్ గదులు, మెషినరీ చాలానే ఉండేవి. ఆరోజుల్లో అలా ఉండేది. ఇప్పుడు.. ఫలనా హోటల్లో ఫలనా రూమ్ నెంబర్లో కంపోజింగ్ అంటారు. పక్క గదిలో ఏదో వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. మరో గదిలో మరోటి.. మరోటి... వీటి మధ్యలో రికార్డింగ్. అక్కడో మైక్ ఉంటుంది. పాడి వెళ్లిపోవడమే. అప్పటికీ ఇప్పటికీ నేను గమనించిన అతి పెద్ద మార్పు అదే. అప్పటికి అది నచ్చింది. ఇప్పుడు ఇది నచ్చింది. నచ్చింది కాబట్టే ఇంకా మ్యూజిక్ చేయగలుగుతున్నాను. ► ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాల్లో పాటలెన్ని ఉన్నాయి? ఫస్ట్ పార్ట్‌లో నాలుగు, సెకండ్ పార్ట్‌లో నాలుగున్నాయి. ► ఈ సినిమాకి పాటలివ్వడంపై మీ అనుభూతి? రామారావుగారి మీద నాకు ప్రత్యేక అభిమానం ఉంది. ఆయన సినిమాకు నన్ను సంగీతం చేయమనడాన్ని గర్వంగా ఫీల్ అవుతాను. -
నాన్న అంటే ఓ ఫీలింగ్
‘‘నాన్నగారి పాత్ర కోసం లుక్ టెస్ట్ జరిగినప్పుడు నేనంత కాన్ఫిడెంట్‌గా లేను. క్రిష్ మాత్రం ‘బావుంది, నన్ను నమ్మండి’ అన్నారు. ఎవరికైనా పంపి ఫీడ్‌బ్యాక్ తీసుకుందామా? నెగటివ్‌గా చెబితే? అని కూడా అనిపించింది. ఆ తర్వాత బాబాయ్ (బాలకృష్ణ) కాల్ చేశారు. ‘సూపర్‌గా ఉన్నావు. ఇరవయ్యో ఏట మా అన్నయ్య ఎలా ఉన్నాడో అలాగే ఉన్నావు’ అన్నారు. ‘హెయిర్ స్టయిల్ ఎలా ఉంటుందో అనుకున్నా. సూపర్‌గా సెట్ అయింది అన్నా’ అని తారక్ అనడంతో కాన్ఫిడెన్స్ వచ్చేసింది’’ అన్నారు కల్యాణ్ రామ్. యన్.టి. రామారావు జీవితం ఆధారంగా ఆయన కుమారుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన చిత్రం ‘యన్.టి.ఆర్’. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందింది. మొదటి భాగం ‘యన్.టి.ఆర్ : కథానాయకుడు’ ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో తండ్రి హరికృష్ణ పాత్రను పోషించిన కల్యాణ్ రామ్ పలు విశేషాలు పంచుకున్నారు. ► ఎన్టీఆర్ బయోపిక్‌లో పార్ట్ అవ్వడం గొప్ప విషయం అనుకుంటాను. తెలుగు సినిమాలకు పోస్టర్‌బాయ్ తాతగారు. తెలుగు సినిమాలు కూడా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తాయని నిరూపించాయి ఆయన సినిమాలు. రాజకీయాల గురించి తెలిసిందే. ► నాన్నగారి పాత్ర పోషించాలనేసరికి కాస్త భయమేసింది. ఫిజికల్ అప్పియరెన్స్ పరంగా ఆయనలా మనం ఉండమే? అప్పటికీ ఈ లుక్ కోసం దాదాపు పది కిలోలు పెరిగా. అయినా సరిపోవడం లేదు. నోట్లో దూది పింజలు పెట్టుకొని యాక్ట్ చేశా. విగ్ పెడితే బాగుండదని నా జుట్టుకే కొంచెం ఎక్స్టెన్షన్ పెట్టాం. దానికోసం గంటా గంటన్నర మేకప్‌కే పట్టేది. ► మా నాన్నగారు భౌతికంగానే మాకు దూరం అయ్యారు. ఎమోషనల్‌గా ఎప్పుడూ మాతోనే ఉంటారు. నాన్నగారు ఓ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఎప్పటికీ నాతోనే ఉంటుంది. ఆ సమయంలో మా ఫ్యామిలీ అంతా మాతో నిలబడ్డారు. అది ఆయన మీద అందరికీ ఉన్న ప్రేమ, గౌరవం. ఇప్పటికీ ఏదో రోజు వస్తూనే ఉన్నారు. మీరు ఒంటరిగా లేరు, మేమున్నాం అనే ధైర్యాన్ని ఇస్తున్నారు. ► ఈ పాత్ర సులువుగా చేయడానికి కారణం బాబాయ్. నాన్నతో కలసి పెరిగారు ఆయన. ‘మీ నాన్న ఎవరికీ భయపడరు, ముక్కుసూటి మనిషి. మీ తాతగారంటే మీ నాన్నగారికి విపరీతమైన ప్రేమ, గౌరవం.. భయం కాదు’ అని బాబాయ్ అన్నారు. ఇలా నాన్నగారికి సంబంధించిన ప్రతీది చెప్పి, చేసి చూపించారు బాబాయ్. ► నాన్నగారు ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు తలను గోక్కుంటూ ఉండేవారట. అది నాకు తెలియదు. నాకు తెలియకుండానే నాన్నగారిని నేను అనుకరించేవాడినంట. నాన్నగారు ఉన్నప్పుడే నేను బయోపిక్‌లో యాక్ట్ చేస్తున్న సంగతి తెలుసు. ‘వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్’ అన్నారు. ఆయన రియాక్షన్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. మరో వారం రోజుల్లో కథ వినాలి. కానీ ఇంతలోనే జరగరానిది జరిగింది. నాన్నగారు, నేనూ ఓ సినిమాలో యాక్ట్ చేయాల్సింది. ఆ కథ ఇంకా మా దగ్గరే ఉంది. చూడాలి ఏమౌవుతుందో. ► తాతగారిని సెలబ్రేట్ చేయడమే బయోపిక్ ఉద్దేశం. మా తాతగారు, నానమ్మ తారకమ్మగారి జీవితాలే ఈ సినిమా. క్రిష్ కాకపోతే ఇంకెవరూ ఈ సినిమా చేయలేరని నా అభిప్రాయం. డాక్యుమెంటరీలా అయిపోకుండా కొన్ని చోట్ల లిబర్టీ తీసుకున్నాం. ► ఈ సినిమాను బాబాయ్ ఓ బాధ్యతగా తీశారు. అలాగే ఈ సినిమా మీద వస్తున్న పొలిటికల్ ఇష్యూస్ నేను పట్టించుకోను. ప్రస్తుతం ‘118’ చేస్తున్నాను. మరో సినిమా సిద్ధంగా ఉంది. మొత్తం ఫైనల్ అయ్యాక అనౌన్స్ చేస్తాను. -
‘యన్.టి.ఆర్’ కథానాయకుడు మూవీ స్టిల్స్
-
అప్పటినుంచి నాకు నచ్చినట్లు నేనుంటున్నాను
నటుడు, మాజీ ముఖ్యమంత్రి యన్.టి. రామారావు జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన చిత్రం ‘యన్.టి.ఆర్’. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు భాగాలుగా (కథానాయకుడు, మహానాయకుడు) రూపొందింది. యన్.టి. రామారావు భార్య బసవతారకం పాత్రను విద్యాబాలన్ పోషించారు. ఈ చిత్రం జనవరి 9న రిలీజ్ కానుంది. నేడు విద్యాబాలన్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె పలు విశేషాలు పంచుకున్నారు. ► బర్త్‌డే స్పెషల్ అంటూ ఏమీ లేదు. ఈసారి తెలుగు సినిమా చేశానంతే. ఇంతకు ముందు కూడా చాలా తెలుగు సినిమాలు ఆఫర్ చేశారు. కొత్త భాషలోకి పరిచయం అవుతున్నాం అంటే ఆ పాత్ర ఎంతో ఎగై్జటింగ్‌గా, చాలెంజింగ్‌గా ఉండాలి. విబ్రీ మీడియా విష్ణుగారు ‘యన్.టి.ఆర్’ సినిమా అవుట్ లైన్ చెప్పినప్పుడు నేనిది కచ్చితంగా చేయాలి అనుకున్నాను. నా 9 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లో మా మామయ్య వాళ్ల ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ రామారావుగారి గురించి విన్నాను. ► ఇంతకు ముందు నేను రియల్ లైఫ్ క్యారెక్టర్స్ పోషించాను. కానీ ఈ పాత్రకు సంబంధించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ బయట లేదు. రామారావుగారి కుటుంబ సభ్యులతో మాట్లాడటమే ఎక్కువ ప్రిపరేషన్. బాలకృష్ణగారితోనూ కథను బాగా డిస్కస్ చేసుకున్నాం. దర్శకుడు క్రిష్‌గారు అన్నీ ఈజీ చేసేశారు. సీన్స్ ఎలా అప్రోచ్ అవ్వాలో చూపించారు. దర్శకుల మీద డిపెండ్ అయ్యాను. దర్శకుల ఇన్పుట్స్, యాక్టర్స్ యాక్టింగ్ కెపాసిటీ విడివిడిగా ఉండవని నా అభిప్రాయం. ఇదంతా ఓ ప్రాసెస్. ► షూటింగ్ టైమ్‌లో నా డైలాగ్స్ నేనే చెప్పుకున్నాను. డబ్బింగ్ చెప్పుకోవాలని ముందే అనుకున్నాను. కానీ నా తెలుగు భాషలో కొంచెం అర్బన్ స్టైల్ కనిపిస్తుంది. తారకమ్మ చాలా స్వచ్ఛమైన, అచ్చ తెలుగు మాట్లాడేవారట. వేరే వాళ్లతో డబ్ చేస్తున్నాం అని నాకు చెప్పి మరీ డబ్బింగ్ చెప్పిచారు క్రిష్. ► ఈ మధ్య ఎక్కువగా బయోపిక్స్ చేస్తున్నాను. కావాలని చేయలేదు. నాకు ఆ ఆఫర్సే వచ్చాయి. అవి చాలా ఎగై్జటింగ్‌గా అనిపించాయి. ఏ పాత్ర గురించైనా విన్నప్పుడు ఈ పాత్ర చేయాలనే ఓ ఫీలింగ్ రావాలి. అది అనిపిస్తేనే సినిమా చేయాలనుకుంటా. ► ఈ జనరేషన్లో యంగ్‌స్టర్స్ అందరూ బావుండటమంటే కేవలం లుక్స్ అనే అనుకుంటున్నారు. గుడ్ లుక్స్, స్లిమ్‌గా ఉండాలని వాటి వెంట పరిగెడుతున్నారు. నాకు బరువు గురించి పెద్దగా పట్టింపులేదు. అయితే హీరోయిన్ ఇంత లావు ఉండకూడదని చెప్పేవారు. మొదట్లో నేను అమాయకంగా వాళ్లు చెప్పింది నమ్మేసి క్రాష్ డైట్లు, అదీ ఇదీ చేసేసి స్లిమ్ అయ్యాను. కానీ లైఫ్లెస్గా (నిస్సారంగా) అనిపించింది. ఆ తర్వాత తెలుసుకున్నాను మనం మనలా ఉంటేనే బాగుంటుందని. అప్పటి నుంచి నాకు నచ్చినట్టు నేనుంటున్నాను. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నామా? లేదా? అన్నది కూడా ముఖ్యమే. ముందు మనల్ని మనం ఇష్టపడాలి. ఎలా ఉన్నామో అలా అంగీకరించగలగాలి. అప్పుడు ఎలా ఉన్నాం అన్నది పెద్ద ప్రశ్న అవ్వదు. దానికి సమాధానం కోసం పరిగెత్తే పని కూడా ఉండదు. ► ఇంతకు ముందు న్యూ ఇయర్‌కు కొత్త నిర్ణయాలు తీసుకునేదాన్ని. ఈరోజుతో నాకు 40ఏళ్లు వస్తాయి. ఈ సంవత్సరం నుంచి కొత్త నిర్ణయాలు తీసుకోను. ఏదో కొత్త నిర్ణయం తీసుకుంటాం. 4,5 తారీఖుల్లో అది పాటించడం మానేస్తే గిల్టీ అనిపిస్తుంది. ఈ ఏడాది నుంచి ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడపాలనుకుంటున్నాను. ఎప్పుడూ కుదరదు కానీ ట్రై చేస్తా.. ► రాజమౌళి దర్శకత్వంలో యాక్ట్ చేయాలనుంది. వీలుంటే మళ్లీ క్రిష్‌తో పని చేస్తా. ఇందిరా గాంధీ బుక్ రైట్స్ తీసుకున్నాను. ఆవిడ గురించి చెప్పడానికి చాలా మెటీరియల్ ఉంది. అందుకే వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. ‘మిషన్ మంగళ్’లోనూ నటిస్తున్నాను. బొద్దుగా ఉన్న హీరోయిన్స్ ఎవ్వరిని అడిగినా ‘మాకు విద్యాబాలన్గారే ప్రేరణ’ అంటుంటారు. మరి మీరు అలా ఉండటానికి ఇన్స్పిరేషన్ ఎవరు? అని అడగ్గా ‘‘ఈ విషయం తెలుసుకోవడం హ్యాపీగా ఉంది. నాకు ఇన్స్పిరేషన్ అంటే చాలామంది ఉన్నారు. ఫస్ట్ నా సిస్టర్ ప్రియా బాలన్. తను ఏ మూమెంట్లో అయినా కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. తనే నా హీరో’’ అన్నారు. -
ఇష్టంతో చేశా.. కష్టమనిపించలేదు
దివంగత నటుడు, రాజకీయ నాయకుడు యన్.టి. రామారావు జీవితం ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన చిత్రం ‘యన్.టి.ఆర్’. రెండు భాగాలుగా రూపొందిన ఈ బయోపిక్కు క్రిష్ దర్శకుడు. మొదటి భాగం ‘కథానాయకుడు’ జనవరి 9న రిలీజ్ కానున్న సందర్భంగా చిత్రమాటల రచయిత సాయి మాధవ్ బుర్రా చెప్పిన విశేషాలు. ► నా చిన్నప్పటినుంచీ యన్.టి. రామారావుగారికి వీరాభిమానిని. ఆయన బయోపిక్కు మాటలందిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చిన్నప్పటి నుంచి రామారావుగారి సినిమాలు చూస్తూ పెరగడమే పెద్ద రీసెర్చ్. ప్రతీ సన్నివేశాన్ని అద్భుతంగా రాయడానికి ప్రయత్నించాను. ► బాలకృష్ణగారు రచయితలను బాగా గౌరవిస్తారు. యన్టీఆర్గా కొన్ని సన్నివేశాల్లో ఆయన నటిస్తుంటే ఎమోషనల్ అయ్యాను. రామారావుగారి గురించి అన్ని సంఘటనలనూ రెండు పార్ట్స్‌లో చూపించడం కష్టం. ఆయన జీవితాన్ని చెప్పాలంటే 10–15 సినిమాల్లో చెప్పాలి. అందుకే సినిమాకు ఏది అవసరమో, సమాజానికి ఏది అవసరమో అది మాత్రమే ఉంటుంది. ► కాంట్రవర్శీ అనేది ఇంట్రెస్ట్. కానీ సమాజానికి అవసరమేం కాదు. సినిమా చూశాక ప్రేక్షకుడికి అసంపూర్ణంగా, అసంతృప్తిగా మాత్రం అనిపించదు. ► తేజాగారు దర్శకుడిగా ఉన్నప్పుడు కూడా నేనే డైలాగ్ రైటర్‌ను. క్రిష్‌గారు వచ్చాక స్క్రీన్‌ప్లే స్టైల్ మారిపోయింది. ఈ సినిమాకు సంభాషణలు రాయడం సంతృప్తిని ఇచ్చింది. డైలాగ్స్ కోసం కష్టపడలేదు. ఇష్టంగా చేసిందేదీ కష్టం కాదు. ► ప్రస్తుతం చిరంజీవిగారి ‘సైరా’, రాజమౌళిగారి ‘ఆర్ఆర్ఆర్’కు రాస్తున్నాను. -
నిజం చూపిస్తారా? అబద్ధం చూపిస్తారా?
-
‘యన్.టీ.ఆర్’ సినిమా ఆడియో వేడుక
హైదరాబాద్‌లో శుక్రవారం ‘యన్‌టిఆర్’ సినిమా ఆడియో, ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ వేడుకలో చిత్ర హీరో బాలకృష్ణ, హీరోయిన్ విద్యాబాలన్, దర్శకుడు క్రిష్, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. వీరితో పాటు నటీనటులు జమున, గీతాంజలి, కృష్ణ, కృష్ణంరాజు, మోహన్‌బాబు, బ్రహ్మానందం, కల్యాణ్‌రామ్, ఎన్టీఆర్, సుమంత్, రానా, తారకరత్న, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రణీత, దర్శకులు రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, ‘కళాబంధు’ టి.సుబ్బరామిరెడ్డి, పరుచూరి బ్రదర్స్, నాజర్, నరేశ్‌లతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
జగదేకసుందరిగా...
అందాల తార శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించడానికి రంగం సిద్ధమైందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా రూపొందుతోన్న సినిమా ‘యన్టీఆర్’. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ టైటిల్ రోల్ చేస్తూ, నిర్మిస్తున్నారు. విష్ణు ఇందూరి, సాయి కొర్రపాటి సహ నిర్మాతలు. ఈ సినిమాలోనే జగదేక సుందరి శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్‌సింగ్ నటించనున్నారని సమాచారం. శ్రీదేవి, ఎన్టీఆర్ కలిసి దాదాపు 14 సినిమాలు చేశారు. శ్రీదేవి పాత్ర లేకుండా ఈ సినిమా అసంపూర్ణంగా ఉంటుందని ఆ పాత్రను కూడా కథలో జోడించారట. ఒక సాంగ్‌తో పాటు, కొన్ని కీలక సన్నివేశాలు శ్రీదేవి పాత్రకు సంబంధించి ఉంటాయని సమాచారం. ఇప్పటివరకూ జరిపిన చిత్రీకరణతో సినిమా 30 శాతం పూర్తయింది. కైకాల సత్యనారాయణ, విద్యాబాలన్, రానా, మురళీ శర్మ తదితరులు నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. -
ఎన్టీఆర్ సినిమాకు బాబు డైరెక్షన్!
వింతల్లోకెల్లా వింత. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పదవీచ్యుతుడిని చేసి, ఆయన మానసిక క్షోభకు, మరణానికి కారకుడైన వ్యక్తే.. ఎన్టీఆర్ సినిమా ఎలా తీయాలో, ఆ సినిమాలో ఏం చెప్పాలో నిర్దేశిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాత, దర్శకులు బాలకృష్ణ, క్రిష్‌లను చంద్రబాబు శుక్రవారం తన దగ్గరకు పిలిపించుకొని మూడు గంటలపాటు ఆ సినిమాపై కర్తవ్య ప్రబోధం చేయడం తెలుగు ప్రజలను షాక్‌కు గురిచేసింది. సాక్షి, అమరావతి: ప్రముఖ నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమా సీఎం చంద్రబాబు సూచనల ప్రకారం తెరకెక్కుతోందనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆ సినిమాపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండగా చిత్ర ముఖ్యులు చంద్రబాబుతో సుదీర్ఘంగా సమావేశం కావడం వాటికి బలాన్ని చేకూరుస్తోంది.ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న దగ్గుబాటి రాణాలు శుక్రవారం మూడు గంటలపాటు చంద్రబాబుతో ఈ సినిమా గురించి చర్చించారు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ అనగానే ఆయన జీవితంలో అత్యంత విషాదకర పరిణామాలేవీ ఉండవని, అన్ని ఘటనలను చంద్రబాబు రాజకీయాలకు అనుగుణంగా చిత్రీకరిస్తారని అటు సినిమా, ఇటు రాజకీయ వర్గాలో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలపై ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఇప్పటికే దీనిపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ మానసిక క్షోభ సినిమాలో లేనట్లే.. తెలుగు సినీ పరిశ్రమలో రారాజుగా వెలుగొంది, ఆ తర్వాత రాజకీయాల్లోకొచ్చి సంచలనాలు సృష్టించిన ఎన్టీఆర్ చివరి దశ అత్యంత దారుణంగా ముగిసింది. ఒక పథకం ప్రకారం ఎన్టీఆర్ అల్లుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపి దాన్ని ఆక్రమించారనే విషయం జగమెరిగిన సత్యం. పిల్లనిచ్చిన పాపానికి తనను మోసం చేశాడని, చంద్రబాబు మరో ఔరంగజేబని బ్రతికున్న రోజుల్లో ఎన్టీఆర్ వాపోయారు. ముఖ్యమంత్రి పదవిని లాక్కోవడమేగాక, చంద్రబాబు ఆయనపై చెప్పులు వేయించి, దుర్భాషలాడించి తీవ్ర అవమానాల పాలు చేశారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని కబ్జా చేయడమేగాక ఒక వ్యూహం ప్రకారం ఎన్టీఆర్ కుటుంబాన్ని ఆయనకు దూరం చేసి ఒంటరి చేశారు. ఈ మానసిక వ్యధతోనే ఆయన 1996 జనవరి 18న మృతి చెందారు. బ్రతికున్నంత కాలం అన్నివిధాలుగా అవమానించి వేధించిన చంద్రబాబు మృతి చెందిన తర్వాత ఆయన కీర్తిని కూడా కబ్జా చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగుడుతున్నా ఆయన మరణానికి చంద్రబాబే కారణమని ఆరోపణలు తరచుగా అభిమానుల నుంచి వింటూనే ఉంటాం. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తుండడం, ఆయన పాత్రను చంద్రబాబుకు పూర్తి అనుకూలంగా ఉండే ఆయన కుమారుడు బాలకృష్ణ నిర్మిస్తూ, స్వయంగా తండ్రి పాత్ర వేస్తుండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు సూచనలు, సలహాల ప్రకారం పూర్తిగా ఆయనే అనుకూలంగా ఉండేలా సినిమా తీయనున్నారని ఎన్టీఆర్ అభిమానులు పేర్కొంటున్నారు. ఎన్టీఆర్ చివరి దశలో చంద్రబాబు వల్ల జరిగిన విషాద ఘటనలేవీ ఈ సినిమాలో ఉండవని వారు స్పష్టం చేస్తున్నారు. గాంధీ సినిమాకు గాడ్సే సూచనలా? మొదట ఈ సినిమాను తేజ దర్శకత్వంలో నిర్మించాలనుకున్నారు. కొంత పని కూడా జరిగింది. కానీ అనూహ్యంగా ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. బాలకృష్ణ చెప్పిన ప్రకారం సినిమాను తీసేందుకు తేజ ఒప్పుకోలేదని సమాచారం. తనతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా తీసిన క్రిష్ అయితే తాము చెప్పినట్లు సినిమా తీస్తారని, ఇబ్బంది ఉండదని బాలకృష్ణ భావించడంతోనే దర్శకుడి మార్పు జరిగిందనే వాదన ఉంది. ఈ మార్పు జరిగినప్పుడే ఎన్టీఆర్ సినిమా వాస్తవానికి దగ్గరగా ఉండే అవకాశం లేదనే విశ్లేషణలు వచ్చాయి. తాజాగా చంద్రబాబు వద్దకే నేరుగా చిత్ర దర్శకుడు వచ్చి కొన్ని గంటలపాటు సూచనలు తీసుకోవడంతో ఎన్టీఆర్ జీవితంలోని విషాద పరిణామాలను వక్రీకరించడం ఖాయమని స్పష్టమవుతోంది. ఈ చర్చలపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. గాంధీ సినిమాకు ఆయన్ను చంపిన గాడ్సే సూచనలు తీసుకున్నట్లు ఎన్టీఆర్ సినిమాకు ఆయనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు సలహాలు తీసుకుంటున్నారనే సెటైర్లు హల్చల్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ అంతిమ దశలో చోటుచేసుకున్న దుర్భర పరిణామాలను చంద్రబాబుకు అనుకూలంగా, రాజకీయంగా ఆయనకు ఉపయోగపడేలా చిత్రీకరిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా చంద్రబాబు కోణంలోనే ఉంటుందని, బ్రతికుండగా ఆయన్ను అన్నింటికీ దూరం చేసి చివరికి ఆయన జీవిత చరిత్రను కూడా చంద్రబాబు వక్రీకరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
తాతలా మనవడు
‘మహానటి’ సినిమాలో ఏయన్నార్ పాత్రను ఆయన మనవడు నాగ చైతన్య పోషించి, అభిమానులను అలరించారు. ఇప్పుడు మరో మనవడు సుమంత్, తాత పాత్రలో కనిపించడానికి రెడీ అయ్యారు. బాలకృష్ణ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యన్టీఆర్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించనున్నట్లు సుమంత్ కన్ఫర్మ్ చేశారు. ‘‘యన్.టి.ఆర్’ బయోపిక్‌లో జాయిన్ అవ్వడం ఎగై్జటింగ్‌గా, గౌరవంగా ఫీల్ అవుతున్నాను. మా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు పాత్రను ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో పోషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ‘యన్.టి.ఆర్’ బయోపిక్ వచ్చే ఏడాది జనవరి 11న రిలీజ్ కానుంది.