
రానా
వైవిధ్యమైన పాత్రలు, కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయకుడు రానా. ‘బాహుబలి, బాహుబలి 2’ చిత్రాల్లో భల్లాలదేవగా, ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో లీడ్ రోల్‌లో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’ చిత్రాల్లో నటిస్తున్న రానా నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ‘యన్.టి.ఆర్’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.
బాలకృష్ణ నటిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్రలో రానా నటిస్తారని తెలిసింది. ‘‘గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు కథను చెప్పడానికి నేను కూడా కలిసి వస్తున్నాను’ అంటూ ఈ సినిమాలో తాను నటిస్తున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రానా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment