
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో బాలకృష్ణ, డైరెక్టర్ క్రిష్‌కు మధ్య మంచి స్నేహ బంధం నెలకొన్న విషయం తెలిసిందే. బాలకృష్ణ తన 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను అతి తక్కువ రోజుల్లో ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ క్రిష్. తన పనితనంపై ఉన్న నమ్మకంతో బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ సినిమా బాధ్యతను అప్పగించారు.
రేపు (జూన్10) బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా ‘ఎన్టీఆర్’ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. క్రిష్ బాలకృష్ణకు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘తన నూరవ చిత్రంలో అమ్మ పేరుని ధరించి కూస్తంత మాతృఋణం తీర్చుకున్న "బసవ రామ తారక పుత్రుడు",ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృఋణాన్ని కూడా తీర్చుకుంటున్న "తారక రామ పుత్రుడు",శతాధిక చిత్ర "నటసింహం", నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.
తన నూరవ చిత్రంలో అమ్మ పేరుని ధరించి కూస్తంత మాతృఋణం తీర్చుకున్న "బసవ రామ తారక పుత్రుడు",
— Krish Jagarlamudi (@DirKrish) June 9, 2018
ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృఋణాన్ని కూడా తీర్చుకుంటున్న "తారక రామ పుత్రుడు",
శతాధిక చిత్ర "నటసింహం",
నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.#HappyBirthdayNBK | #NTR | pic.twitter.com/oLbk9FLQWr
Comments
Please login to add a commentAdd a comment