తాతలా మనవడు | SUMANTH IN NTR BIOPIC | Sakshi
Sakshi News home page

తాతలా మనవడు

Published Sun, Aug 5 2018 1:58 AM | Last Updated on Sun, Aug 5 2018 1:58 AM

SUMANTH IN NTR BIOPIC - Sakshi

సుమంత్

‘మహానటి’ సినిమాలో ఏయన్నార్‌ పాత్రను ఆయన మనవడు నాగ చైతన్య పోషించి, అభిమానులను అలరించారు. ఇప్పుడు మరో మనవడు సుమంత్, తాత పాత్రలో కనిపించడానికి రెడీ అయ్యారు. బాలకృష్ణ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘యన్‌.టి.ఆర్‌’. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యన్టీఆర్‌ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించనున్నట్లు సుమంత్‌ కన్‌ఫర్మ్‌ చేశారు. ‘‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌లో జాయిన్‌ అవ్వడం ఎగై్జటింగ్‌గా, గౌరవంగా ఫీల్‌ అవుతున్నాను. మా తాతగారు అక్కినేని నాగేశ్వరరావు పాత్రను ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో పోషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌ వచ్చే ఏడాది జనవరి 11న రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement