స్పెషల్‌ డేట్‌! | NTR biopic Released On january 9th | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ డేట్‌!

Published Mon, Jun 18 2018 1:38 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

NTR biopic Released On january 9th - Sakshi

బాలకృష్ణ

దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘యన్‌.టి.ఆర్‌’. ఈ చిత్రాన్ని ఆయన కుమారుడు బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తూ, నిర్మించనున్న విషయం తెలిసిందే. క్రిష్‌ దర్శకత్వంలో ఎన్‌బీకే ఫిల్మ్స్‌ పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇటీవలే గ్రాండ్‌గా ఈ సినిమాను స్టార్ట్‌ చేసిన బాలకృష్ణ, సినిమా రిలీజ్‌కు కూడా స్పెషల్‌ డేట్‌ను ఫిక్స్‌ చేశారు. ఎన్టీఆర్‌ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9నే ఈ సినిమాను రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేశారు. వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానున్న ఈ సినిమాకు సంగీతం: కీరవాణి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement