నాడు.. నేడు ‘మన దేశం’తోనే! | Overwhelming response to Balayya's first look | Sakshi
Sakshi News home page

నాడు.. నేడు ‘మన దేశం’తోనే!

Published Fri, Jul 6 2018 12:57 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

Overwhelming response to Balayya's first look - Sakshi

బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావుపై రూపొందుతోన్న బయోపిక్‌ ‘యన్‌.టి.ఆర్‌’. వారాహి చలన చిత్రం అండ్‌ విబ్రీ మీడియా సమర్పణలో ఎన్టీఆర్‌ తనయుడు, నటుడు బాలకృష్ణ టైటిల్‌ రోల్‌లో నటిస్తూ, నిర్మిస్తున్నారు. జాగర్లమూడి రాధకృష్ణ (క్రిష్‌) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ గురువారం మొదలైంది. 1949లో జూలై 5నే ఎన్టీఆర్‌ ‘మన దేశం’ సినిమాను స్టార్ట్‌ చేశారు.

‘‘నాడు, నేడు ‘మన దేశం’తోనే చరిత్రకు శ్రీకారం.. తెలుగువారందరి ఆశీస్సులు కోరుతూ’’ అంటూ ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. అలాగే ‘అభిమానమును మించిన ధనము, ఆదరమును మించిన పెన్నిధి ఈ లోకమున లేదు. ఇందరి సోదరుల ప్రేమానురాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా రుణపడ్డట్లే! నా శుభాకాంక్షలు. సోదరుడు రామారావు.. 27.8.75’’ అంటూ 1975లో ఎన్టీఆర్‌ స్వయంగా రాసిన ఓ లేఖను బాలకృష్ణ లుక్‌తో పాటుగా చిత్రబృందం రిలీజ్‌ చేసింది. ఈ సినిమాకు కీరవాణి స్వరాలు అందిస్తున్నారు. జ్ఞానశేఖర్‌ ఛాయాగ్రాహకుడిగా చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement