చరిత్ర పాఠాలు చదువుకున్నట్టుంది | NTR Biopic Movie Team Interview | Sakshi
Sakshi News home page

చరిత్ర పాఠాలు చదువుకున్నట్టుంది

Published Mon, Jan 7 2019 1:37 AM | Last Updated on Mon, Jan 7 2019 1:37 AM

NTR Biopic Movie Team Interview - Sakshi

సుమంత్‌

‘‘చిన్నప్పటి నుంచి నాలో తాతగారి పోలికలున్నాయని చాలా మంది చెప్పేవారు. కానీ  తాతగారిలా నటించే అవకాశం దొరకలేదు. ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’ చిత్రంలో  25నుంచి 60 సంవత్సరాల వరకూ తాతగారిలా ఐదు డిఫరెంట్‌ లుక్స్‌లో కనిపిస్తాను. నా ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన వచ్చింది’’ అని సుమంత్‌ అన్నారు. క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషించి, నిర్మించిన చిత్రం ‘యన్‌.టి.ఆర్‌’. దివంగత ముఖ్యమంత్రి,  నటుడు యన్టీ రామారావు జీవితం ఆధారంగా రూపొందించిన ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’ ఈ నెల 9న రిలీజ్‌ కానుంది. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు పాత్రని ఆయన మనవడు సుమంత్‌ పోషించారు. ఈ సందర్భంగా సుమంత్‌ మాట్లాడుతూ...

► ఎన్టీఆర్‌గారి బయోపిక్‌ తీస్తున్నారు అని విన్నాను కానీ అందులో తాతగారి పాత్ర ఉంటుంది, అది నా వరకూ వస్తుంది అనే ఆలో^è న కూడా చేయలేదు. క్రిష్‌ కలిసి సీన్స్‌ అన్నీ వివరించాడు. తను కేవలం దర్శకుడు మాత్రమే కాదు తెలుగు ఇండస్ట్రీకి విద్యార్థి కూడా. క్రిష్‌ న్యాయం చేయగలడని నాకు గట్టి నమ్మకం ఉంది. అతనికి కమర్షియాలిటీ, ఆర్ట్‌కి బ్యాలెన్స్‌ కుదర్చడం బాగా తెలుసు. ఒకవేళ క్రిష్, బాలకృష్ణగారు లేకుంటే ఈ సినిమా చేసేవాణ్ని కాదేమో?

► ఫ్యాన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అనే ఆలోచన లేదు. క్రిష్‌ చెప్పిన స్క్రిప్ట్‌ ప్రకారం తాతగారి క్యారెక్టర్‌ చాలా హానెస్ట్‌గా, డిగ్నిఫైడ్‌గా చూపించాను. నాకు ఆ డౌటే లేదు. ఇది కేవలం సపోర్టింగ్‌ రోల్‌ అని యాక్సెప్ట్‌ చేయాలి. 

► తాతగారి పాత్ర చేస్తున్నాను అని తాతగారిని అనుకరించడమో, మిమిక్రీ చేయడమో చేయలేదు. యూ ట్యూబ్‌లో ఒకే ఒక్క ఇంటర్వ్యూ చూశా. అదే ఈ సినిమాకు నా హోమ్‌ వర్క్‌. ఈ పాత్ర చేయగలను అనే నమ్మకం నాలో మొదటి నుంచీ ఉంది. చిన్నప్పటి నుంచి ఆయనతో పెరిగాను కాబట్టి ఆయన అలవాట్లు నాకు కొన్ని వచ్చేశాయి. ఆయన చాలా గొప్ప పరిశీలకుడు. నాకు కూడా అదే వచ్చింది. సినిమాలో ఏదీ  కావాలని ప్రత్యేకంగా చేయలేదు. సహజంగా ఉండటానికి ప్రయత్నించాను.

► ఎప్పుడో ‘యువకుడు’ సినిమా టైమ్‌లో క్లీన్‌ షేవ్‌ చేశాను. మళ్లీ వేరే సినిమాల్లో ట్రై చేయలేదు. ‘యన్‌.టి.ఆర్‌’ చిత్రానికి ఫస్ట్‌ డే మేకప్‌లో చిన్న చిన్న ఇబ్బందులున్నా తర్వాత అంతా సాఫీగా సాగిపోయింది. యాక్టింగ్‌ పరంగా ఏ దశలోనూ కష్టంగా అనిపించలేదు. మేకప్‌ పరంగా 60 ఏళ్ల వయసు పాత్రప్పుడు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది.

► యన్టీఆర్‌గారితో తాతగారు పంచుకున్న అనుంబంధం గురించి చెబుతూనే ఉండేవారు. కానీ నేను విన్నది ఏదీ స్క్రిప్ట్‌లో లేవు. నాకు తెలియని చాలా విషయాలు ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. అది కొత్తగా, ఎగై్జటింగ్‌గా అనిపించాయి. హిస్టరీ క్లాసులకు వెళ్లినట్టు అనిపించింది.

► తాతగారి బయోపిక్‌ గురించి ఏం ఆలోచించలేదు. మా చిన్నమావయ్య (నాగార్జున)గారు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు చూద్దాం. నా లాస్ట్‌ సినిమా ‘ఇదంజగత్‌’ నిరాశ పరిచింది. రిలీజ్‌ కూడా సరిగ్గా జరగలేదు. ‘మళ్ళీరావా’ కంటే ముందే ఒప్పుకున్న సినిమా అది. ‘యన్‌.టి.ఆర్‌’ తర్వాత రాబోతున్న సినిమాపై కూడా పూర్తి నమ్మకంతోఉన్నాను.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement