ఎన్టీఆర్‌ 60.. ఏఎన్నార్‌ 8..! | Balakrishna ANd Sumanth Getups In NTR Biopic | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 26 2018 10:08 AM | Last Updated on Wed, Sep 26 2018 1:33 PM

Balakrishna ANd Sumanth Getups In NTR Biopic - Sakshi

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం యన్‌.టి.ఆర్‌. సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్రవేసిన నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. బాలయ్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ తారగణంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య 60 విభిన్న గెటప్‌లలో కనిపించనున్నారట.

తాజా సమచారం ప్రకారం ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఏఎన్నార్‌ పాత్రకు కూడా చాలా ఇంపార్టెన్స్‌ ఉందన్న టాక్ వినిపిస్తోంది. అక్కినేని వారసుడు సుమంత్‌ తాత నాగేశ్వరరావు పాత్రలో నటిస్తుండగా ఆయన కూడా ఈ సినిమాలో దాదాపు 8 డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమాను 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement