టాలీవుడ్లో వేదలం రీమేక్..? | vedhalam telugu remake detailes | Sakshi
Sakshi News home page

టాలీవుడ్లో వేదలం రీమేక్..?

Published Fri, Sep 30 2016 10:32 AM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM

టాలీవుడ్లో వేదలం రీమేక్..?

టాలీవుడ్లో వేదలం రీమేక్..?

ప్రజెంట్ టాలీవుడ్ టాప్ హీరోలందరూ రీమేక్  సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలు వరుసగా రీమేక్ సినిమాలు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిరంజీవి 150వ సినిమాను కత్తి సినిమా రీమేక్గా తెరకెక్కిస్తుండగా, రామ్ చరణ్ ధృవ సినిమాను తనీఒరువన్ రీమేక్గా రూపొందిస్తున్నారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రీమేక్ సినిమానే చేస్తున్నాడు. అజిత్ హీరోగా తెరకెక్కిన వీరం సినిమాను తెలుగులో కాటమరాయుడు పేరుతో రీమేక్ చేస్తున్నాడు అజిత్. టాలీవుడ్ రీమేక్ స్పెషలిస్ట్ వెంకటేష్ కూడా మరోసారి రీమేక్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఇటీవల తమిళ, హిందీ భాషల్లో సక్సెస్ సాధించిన సాలాఖద్దూస్ సినిమాను గురు పేరుతో రీమేక్ చేస్తున్నాడు.

ఇప్పుడు ఈ లిస్ట్లో మరో తమిళ సినిమా చేరింది. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన వేదలం సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాను సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిచనున్నారు. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమా నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement